- Home
- Entertainment
- Tamannaah: తల్లిగా తన కోరికని బయట పెట్టిన తమన్నా.. అమ్మలా అస్సలు ఉండనంటూ బోల్డ్ స్టేట్ మెంట్
Tamannaah: తల్లిగా తన కోరికని బయట పెట్టిన తమన్నా.. అమ్మలా అస్సలు ఉండనంటూ బోల్డ్ స్టేట్ మెంట్
Tamannaah: మిల్కీ బ్యూటీ ఫ్యూచర్ గురించి ఆమె తల్లి ఒక షాకింగ్ విషయం బయటపెట్టారు. తమన్నా తల్లి అయితే ఎలా ఉంటుందో చెప్పేశారు. పేరెంటింగ్ స్టైల్ స్ట్రిక్ట్ గా ఉంటుందని అన్నారు. కానీ అందుకు తమన్నా ఏమంటున్నారో చూడండి.

తమన్నా బోల్డ్ స్టేట్ మెంట్
తల్లీకూతుళ్ల మధ్య చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడం సహజమే. అయితే పిల్లలు పెద్దయ్యాక వాళ్లు ఎలా ఉంటారో, ఎలాంటి తల్లిదండ్రులుగా ఉంటారో కూడా తల్లులు ముందుగానే అంచనా వేస్తుంటారు. ఇప్పుడు నటి తమన్నా విషయంలోనూ ఆమె తల్లి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు.
తమన్నా భవిష్యత్తులో తల్లి అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని ఆమె తల్లి భావిస్తున్నారట. అయితే ఈ విషయంలో తమన్నా మాత్రం తన తల్లితో ఏకీభవించడం లేదు. తాను మాత్రం చాలా ‘చిల్’ మామ్‌గా ఉంటానని చెబుతోంది.
తమన్నా ఫ్యూచర్ చెప్పిన ఆమె తల్లి
ఇటీవల ‘ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా తన తల్లితో జరిగిన ఒక చర్చ గురించి చెప్పింది. తాను భవిష్యత్తులో తల్లి అయితే చాలా స్ట్రిక్ట్ మామ్ అవుతానని అమ్మ అంటుంటారు..కానీ అది ఆమె అభిప్రాయమని తమన్నా చెప్పింది.
అయితే తాను మాత్రం పిల్లల విషయంలో చాలా సరదాగా ఉంటానని ఈ మిల్కీ బ్యూటీ తెలిపింది. చిల్ మామ్ గా ఉంటానని అన్నారు. తన అమ్మ తనతో స్ట్రిక్ట్ గా ఉండేవారని...అందుకే తాను కూడా అలా ఉంటానని అనుకుంటున్నారని చెప్పారు.
క్లాస్ బంక్ కొట్టినా ఫర్వాలేదు
ఒకవేళ తనకు పిల్లలు పుడితే వాళ్లపై అంత కఠినంగా ఉండనని తమన్నా స్పష్టం చేసింది. పిల్లలు తనతో సరదాగా ఉండాలని కోరుకుంటానని చెప్పింది. స్కూల్‌కు వెళ్లకుండా ఒకరోజు క్లాస్ బంక్ కొట్టినా ఫర్వాలేదన్నట్టుగా తాను ఉండాలని అనుకుంటున్నట్లు సరదాగా చెప్పుకొచ్చింది.
రూ.50 కోట్లకు పైగా వసూళ్లు
ప్రస్తుతం తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటించిన ‘ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా బీహార్‌లోని పాట్నాకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాన్ దేవి ఆలయానికి సంబంధించిన పురాణగాథ ఆధారంగా రూపొందింది.
దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం బీహార్‌లో ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా చెబుతారు. చుట్టుపక్కల అడవుల్లోని ప్రతికూల శక్తుల నుంచి స్థానికులను ఈ ఆలయం కాపాడుతుందనే నమ్మకం ఉంది. అయితే రాత్రి సమయంలో ఆలయాన్ని, దాని చుట్టుపక్కల అడవిని సందర్శించడానికి అనుమతి లేదు.
చెప్పులు వేసుకోకుండా వెళ్తున్న ప్రేక్షకులు
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా ఇంట్రెస్టింగ్ రియాక్షన్ వస్తోంది. తొలివారం ముగిసే సమయానికి సినిమా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా బీహార్‌లో అభిమానులు సినిమాను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొంతమంది అభిమానులు థియేటర్లలోకి వెళ్లే ముందు బయటే చెప్పులు వదిలి వెళ్లగా.. మరికొందరు థియేటర్లలో ప్రసాదంగా డీప్ ఫ్రైడ్ తేకువాను పంచుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

