MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Furniture Tips: ఇంట్లో ఫర్నిచర్‌కు చెదలు పట్టాయా..? రూ.5లోపే ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు

Furniture Tips: ఇంట్లో ఫర్నిచర్‌కు చెదలు పట్టాయా..? రూ.5లోపే ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు

Furniture Tips: ఇంట్లో చెక్క ఫర్నిచర్ ఉంటే చెదల సమస్య చాలా సాధారణం. మొదట్లో చిన్న సమస్యలా కనిపించినా.. తర్వాత అల్మారాలు, తలుపులు, టేబుళ్లు, కుర్చీలు లోపల నుంచి పూర్తిగా పాడవుతాయి. అయితే ఈ సమస్యకు ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో చెక్ పెట్టొచ్చు.  

2 Min read
Author : Narender Vaitla
Published : May 20 2026, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెదలు పట్టాయని ఎలా గుర్తించాలి..?
Image Credit : Gemini AI

చెదలు పట్టాయని ఎలా గుర్తించాలి..?

చెదలు సాధారణంగా తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతాయి. గోడలపై మట్టిలా కనిపించే చిన్న సొరంగాలు కనిపించడం, తలుపులు లేదా కిటికీల దగ్గర చిన్న రెక్కలు పడిపోవడం, చెక్కను తట్టినప్పుడు లోపల ఖాళీగా ఉన్నట్టుగా శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి. ఫర్నిచర్ నుంచి చెక్క పొడి రావడం లేదా స్క్రూడ్రైవర్‌తో గుచ్చినప్పుడు చెక్క మృదువుగా అనిపించడం కూడా చెదలు వ్యాపిస్తున్న సంకేతాలే. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే చర్యలు తీసుకోకపోతే చెదలు మరింతగా విస్తరించే ప్రమాదం ఉంటుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఉప్పుతో చెదలకు చెక్
Image Credit : stockPhoto

ఉప్పుతో చెదలకు చెక్

చెదలను తగ్గించడంలో ఉప్పు చాలా ఉపయోగపడుతుంది. ఇది తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సులభంగా చేయగలిగే పరిష్కారం. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో సరిపడా ఉప్పు కలిపి గట్టిగా ద్రావణం తయారు చేయాలి. తర్వాత దాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి చెదలు ఉన్న ప్రదేశాల్లో చల్లాలి. కావాలంటే నేరుగా ఉప్పును చెదల సొరంగాల్లో కూడా వేయవచ్చు. ఉప్పు ప్రభావంతో చెదల శరీరంలోని తేమ తగ్గిపోతుంది. దీంతో అవి క్రమంగా చనిపోతాయి. ఈ చిట్కా చిన్న స్థాయిలో ఉన్న చెదల సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.

Related Articles

Related image1
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?
Related image2
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి పండ‌గే.. పెన్ష‌న్‌ను రూ. 3 వేల‌కి పెంచ‌నున్న కేంద్రం.?
35
వేపతో సహజ పరిష్కారం
Image Credit : pinterest

వేపతో సహజ పరిష్కారం

వేపను సహజ కీటకనాశినిగా భావిస్తారు. చెదలను దూరం చేయడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేపాకులను నీళ్లలో మరిగించి ఆ నీటిని చల్లారిన తర్వాత ఫర్నిచర్‌పై స్ప్రే చేయవచ్చు. అలాగే వేపనూనెను నీళ్లలో కలిపి కూడా ఉపయోగించవచ్చు. వేపలో ఉండే చేదు గుణాలు, దాని బలమైన వాసన చెదలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా చెక్కలో నుంచి పొడి రావడం మొదలైన దశలో ఈ పద్ధతి ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

45
వెనిగర్, నిమ్మరసం కూడా..
Image Credit : Getty

వెనిగర్, నిమ్మరసం కూడా..

ఇంట్లో సులభంగా దొరికే వెనిగర్, నిమ్మరసం మిశ్రమం కూడా చెదలపై ప్రభావం చూపుతుంది. అర కప్పు వెనిగర్‌లో ఒక నిమ్మకాయ రసం కలిపి స్ప్రే బాటిల్‌లో పోసి చెదలు ఉన్న ప్రాంతాల్లో చల్లాలి. ఈ మిశ్రమం చెదల సొరంగాలను దెబ్బతీసి వాటిని క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, చెక్కలో ఉండే దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. రసాయనాలు ఎక్కువగా ఉపయోగించకుండా సహజ పద్ధతిలో చెదలను నియంత్రించాలని అనుకునేవారికి ఇది మంచి మార్గంగా చెప్పొచ్చు.

55
చెదలు రాకుండా ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : google

చెదలు రాకుండా ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చెదలు ఎక్కువగా తేమ ఉన్న ప్రదేశాల్లో పెరుగుతాయి. అందుకే ఇంట్లో లీకేజీలు ఉంటే వెంటనే సరిచేయాలి. గోడలు ఎప్పుడూ తడిగా ఉండకుండా చూసుకోవాలి. ఫర్నిచర్‌ను అప్పుడప్పుడు ఎండలో పెట్టడం వల్ల తేమ తగ్గి చెదలు చేరకుండా ఉంటుంది. అలాగే చెక్క ఫర్నిచర్‌కు ఏడాదికి ఒకసారి వార్నిష్ లేదా పెయింట్ వేయడం మంచిది. నేలపై నేరుగా చెక్క వస్తువులు పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లో ఫర్నిచర్‌ను చాలా కాలం వరకు చెదల సమస్య నుంచి కాపాడుకోవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
హల్దీ వేడుక తర్వాత విషాదం.. కొత్త పెళ్లి కూతురు ప్రాణం తీసిన పసుపు.. అసలేం జరిగిందటే.?
Recommended image2
Blouse Model:కాటన్ చీరలో కూడా గ్లామర్ గా కనిపించాలా? ఈ బ్లౌజులు బెస్ట్
Recommended image3
Mangalsutra: ఈ మంగళసూత్రం ఉంటే... వేరే నగలు ఏవీ అవసరం లేదు..!
Related Stories
Recommended image1
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?
Recommended image2
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి పండ‌గే.. పెన్ష‌న్‌ను రూ. 3 వేల‌కి పెంచ‌నున్న కేంద్రం.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved