మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా.. డోంట్ వర్రీ.. ఈ అమ్మాయిలను ట్రై చేయండి!
మన దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే.. 1000 మంది పురుషులకు కేవలం 951 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అందుకే చాలా మంది బ్యాచిలర్స్ గా మిగిలిపోతున్నారు. మరి పెళ్లి, పెళ్లాం లేకపోతే కష్టం కదా.. ఇంత వ్యత్యాసం ఉన్న చోట గర్ల్ ఫ్రెండ్స్ దొరకడం కూడా చాలా కష్టం. అందుకే గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటున్న అబ్బాయిలు ఈ అమ్మాయిలను ట్రై చేయండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు.
2024లో భారతదేశ జనాభా 1.44 బిలియన్లుగా ఉంది. ఇందులో 743.39 మిలియన్ పురుషులు, 698.29 మిలియన్ మహిళలు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం పురుషులు మొత్తం జనాభాలో 51.56%, స్త్రీలు 48.44% భాగాన్ని కలిగి ఉన్నారన్న మాట. ఇండియాలో స్త్రీ, పురుషుల నిష్పత్తి (sex ratio) సుమారుగా ప్రతి 1,000 పురుషులకు 951 స్త్రీలుగా ఉంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. కుటుంబ బాధ్యతలు లేని పురుషులైనా, స్త్రీలైనా చెడు మార్గాల వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పూర్వం పెద్దలు యుక్త వయసు అంటే సుమారు 20 ఏళ్లు వచ్చే సరికి పెళ్లి చేసేసే వారు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బాధ్యతలు నెరవేర్చుకుంటూ జీవితం ఆనందంగా గడిపేవారు.
మన దేశం విషయానికి వస్తే వివిధ రాష్ట్రాల్లో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో చాలా వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఒక్క కేరళలో 1084 మంది స్త్రీలు, ఛత్తీస్గఢ్ లో 1017 మంది స్త్రీలు పురుషుల కంటే అధికంగా ఉన్నారు. పశ్చిమబెంగాల్ 1000 మంది పురుషులకు 950 మహిళలు మాత్రమే ఉన్నారు. హర్యానాలో879, పంజాబ్ లో 895, ఉత్తరప్రదేశ్ లో 912 ఉన్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో స్త్రీల సంఖ్య ఇంకా తక్కువగా ఉంది.
విదేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటే..
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 100 మంది బాలికలకు 105 మంది అబ్బాయిలు పుడుతున్నారు. అయితే ఆయుర్దాయం, వలసలు వంటి అంశాల వల్ల కొన్ని దేశాలు స్త్రీల నిష్పత్తిని ఎక్కువగా కలిగి ఉన్నాయి. 2024 జూలైలో ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక శాతం మహిళలు ఉన్న దేశాల్లో మోల్డోవా, లాట్వియా, ఆర్మేనియా, రష్యా మొదటి వరుసలో ఉన్నాయి.
మోల్డోవా జనాభాలో 53.98% మహిళలు ఉన్నారు. ఈ దేశం ఇప్పటికీ లింగ సమానత్వానికి సంబంధించి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉద్యోగాలు ఎక్కువగా మహిళలకు కల్పించాలని వారు పోరాడుతున్నారు. ఇళ్లు, పిల్లల సంరక్షణ బాధ్యతల్లోనూ సమాన వాటా ఉండాలని వారు కోరుతున్నారు.
లాట్వియాలో జనాభాలో 53.68% మంది మహిళలే ఉన్నారు. 43 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఇక్కడ ఎక్కువ. ఇక్కడ పురుషులు స్మోకింగ్ వల్ల ఆరోగ్యం పాడై ఎక్కువగా చనిపోతున్నారు.
ఆర్మేనియా జనాభాలో స్త్రీలు 53.61 % . చాలా మంది ఆర్మేనియన్ పురుషులు పని కోసం విదేశాలకు వెళ్లడం వల్ల ఈ దేశంలో స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది.
రష్యా జనాభాలో 1950ల నుండి అధిక శాతం స్త్రీలే ఉంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎక్కువ మంది పురుషులు చనిపోయారు. అప్పటి నుంచి స్త్రీల సంఖ్య తగ్గడం లేదు. దీనికి తోడు మద్యపానం, ఆత్మహత్యలు, వ్యాధుల కారణంగా రష్యాలో పురుషులు తక్కువ ఆయుర్దాయం కలిగి ఉంటున్నారు.
రష్యా మాదిరిగానే ఉక్రెయిన్లోనూ స్త్రీల సంఖ్యఅధికంగా ఉంది. ఈ దేశంలో 53.50 % మంది మహిళలు ఉన్నారు. 60% మంది మహిళలు ఉన్నత విద్యా పట్టాలను కలిగి ఉన్నారు.
అదేవిధంగా జార్జియాలో 53.4 %, బెలారస్ దేశంలో 53.4 %, లిథువేనియా జనాభాలో 52.85 %, టోంగా జనాభాలో 52.59 %, సెర్బియాలో 52.51 % మంది మహిళలు పురుషుల కంటే అధికంగా ఉన్నారు. అందువల్ల మీరు గర్ల్ ఫ్రెండ్ కోసం ట్రై చేస్తుంటే మన దేశంలో కంటే విదేశాల్లో ప్రయత్నించడం మేలు. మీరు కచ్చితంగా సక్సెస్ అవుతారు.