MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Parenting: పిల్లల కోసం తండ్రి మార్చుకోవాల్సిన 3 అలవాట్లు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి టిప్స్

Parenting: పిల్లల కోసం తండ్రి మార్చుకోవాల్సిన 3 అలవాట్లు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి టిప్స్

Parenting: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు పనితోనే సరిపోతోంది.. ఇంటికి వచ్చాక పిల్లలతో గడపడానికి కూడా సమయం కూడా ఉండట్లేదు అని ఫీల్ అయ్యే పేరెంట్స్ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఇచ్చిన టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 25 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ కాలం పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు..
Image Credit : Getty

ఈ కాలం పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు..

ఈ కాలం పేరెంట్స్.. పిల్లల పెంపకంలో చాలా మార్పులు వచ్చాయి. పిల్లలను అతిగా గారాబం చేస్తున్నారు. పిల్లలు నోరు తెరిచి అడిగేలోపే కోరినవన్నీ తెచ్చి ముందు పెడుతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి బొమ్మలు కొనిపెడుతున్నారు. కానీ.. పిల్లలతో కాసేపు కూడా సమయం గడపడం లేదు. అడిగితే.. ఇంటి పని, ఆఫీసు పనితో అలసిపోతున్నాం అని.. పిల్లలతో గడపడానికి సమయం ఉండటం లేదని చెబుతారు. అయినా.. పిల్లలకు ఏమీ తక్కువ కాకుండా.. అన్నీ కొనిస్తున్నాం అని చెబుతుంటారు. కానీ.. నిజమైన పేరెంటింగ్ అంటే ఎలా ఉండాలి? అసలు... పిల్లలతో తండ్రి ఎలా ఉండాలి అనే విషయాలను ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నుంచి కచ్చితంగా ఈ కాలం పేరెంట్స్ నేర్చుకోవాల్సిందే.

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉండేవారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అయితే.. అంత బిజీ రోజుల్లో కూడా.. ఆయన తన పిల్లలకు సమయం కేటాయించేవారట. దానిని ఆయన ఎలా బ్యాలెన్స్ చేసేవారు...? పిల్లల కోసం తండ్రి కచ్చితంగా మార్చుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1. రోజంతా పిల్లలతో ఉండక్కర్లేదు..కానీ,
Image Credit : Getty

1. రోజంతా పిల్లలతో ఉండక్కర్లేదు..కానీ,

పిల్లలతో టైమ్ గడపడం అంటే రోజంతా పిల్లలతోనే ఉండాల్సిన అవసరం లేదు.. కానీ, గడిపిన కాసేపు మాత్రం పూర్తిగా వారికే కేటాయించాలి. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన పిల్లల విషయంలో ఇదే రూల్ ఫాలో అయ్యేవారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె అక్షితా మూర్తి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన చిన్నతనంలో తండ్రి నారాయణ మూర్తి పని కారణంగా ఇంటికి దూరంగా ఉండేవారని, కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం తన సమయమంతా పిల్లలకే కేటాయించేవారు అని ఆమె చెప్పారు. ఇదే రూల్ కనుక.. ఈ కాలం పేరెంట్స్ కూడా అలవాటు చేసుకుంటే..పిల్లలు తమ తండ్రి తమతో దూరంగా ఉంటున్నారనే భావన ఉండదు. పిల్లలతో ఉన్నప్పుడు ఫోన్లు, ల్యాప్ టాప్స్ చూసుకోకుండా.. వారు చెప్పే మాటలు వినడం, వారితో మాట్లాడటం, కలిసి ఆడటం లాంటివి చేయాలి.

Related Articles

Related image1
Mukesh Ambani: కొడుకుతో వాచ్ మెన్ కి క్షమాపణలు చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
Related image2
Cinnamon Water:15 రోజులు దాల్చిన చెక్క నీరు తాగితే బాడీలో ఏం జరుగుతుంది? బరువు తగ్గుతారా?
33
2.తాతయ్య, అమ్మమ్మల పెంపకం..
Image Credit : Getty

2.తాతయ్య, అమ్మమ్మల పెంపకం..

పిల్లలు ఎదుగుతున్నప్పుడు పేరెంట్స్ తో కలిసి పెరగడం ఎంత ముఖ్యమో.. అమ్మమ్మ, తాతయ్యలతో పెరగడం కూడా అంతే ముఖ్యం. వారి సంరక్షణలో పిల్లలను పెరగనివ్వాలి. అలా పెరిగిన పిల్లల జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ విలువలు, ప్రేమ, భద్రత వంటి విషయాలు నేర్చుకుంటారు. ఉమ్మడి కుటుంబంలో పెరిగే పిల్లలకు పెద్దల అనుభవం, ప్రేమ, సంప్రదాయల గురించి తెలుస్తాయి.

ఖరీదైన బహుమతులు కాదు.. జ్ఞాపకాలు ముఖ్యం..

చాలా మంది పిల్లలకు ఖరీదైన బహుమతులు ఇస్తే చాలు అనుకుంటారు. కానీ, బహుమతుల కంటే పిల్లలకు జ్ఞాపకాలు ఇవ్వడం చాలా ముఖ్యం. నారాయణ మూర్తి కూడా తమ పిల్లల విషయంలో ఇదే రూల్ ఫాలో అయ్యేవారు. ఇచ్చిన గిఫ్ట్ ఎంత ఖరీదైనది అయినా పిల్లలు మర్చిపోతారు. కానీ.. మనం వారికి ఇచ్చే జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం గుర్తుంటాయి.

ఈ మూడు విషయాలను ఈకాలం తండ్రులు తెలుసుకుంటే.. తమ పిల్లల బాల్యం సంతోషంగా గడుస్తుంది.

ఉద్యోగం, పర్సనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి?

ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగం కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. అది అందరూ ఒప్పుకునే సత్యమే. అయితే, అలాంటి పరిస్థితుల్లో పిల్లలతో రోజంతా ఉండలేకపోయినా, రోజుకి కొంత సమయం వారికి కేటాయించాలి. వారితో మాట్లాడటం, వారి మాటలు ఓపికగా వినడం వంటి చిన్న అలవాట్లు పిల్లలతో మంచి బంధం ఏర్పడటానికి కారణం అవుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
Mukesh Ambani: కొడుకుతో వాచ్ మెన్ కి క్షమాపణలు చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
Recommended image2
Cinnamon Water:15 రోజులు దాల్చిన చెక్క నీరు తాగితే బాడీలో ఏం జరుగుతుంది? బరువు తగ్గుతారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved