మహిళల షర్ట్ బటన్స్ ఎడమ వైపు ఎందుకు ఉంటాయి.? దీనివెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే..
మన చుట్టూ ఉండే, మనం ప్రతీ రోజూ ఉపయోగించే ఎన్నో వస్తువుల్లో మనకు తెలియని విషయాలు దాగి ఉంటాయి. చూడ్డానికి సాధారణంగా కనిపించే వాటి వెనకాల పెద్ద కారణాలు ఉంటాయి. అలాంటి వాటిలో మహిళలు ధరించే చొక్కా బటన్స్ ఉంటాయి. ఈ ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చొక్కాలు పురుషులతో పాటు మహిళలు కూడా ధరిస్తుంటారు. అయితే ఇదేదో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రెండ్ కాదు. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం వస్తోంది. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే మహిళలు ధరించే షర్ట్స్‌కి, పురుషులు ధరించే షర్ట్స్‌కి ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది. మహిళల చొక్కాలలో బటన్స్ ఎడమవైపు ఉంటాయి.? అదే పురుషులు ధరించే చొక్కాల్లో బటన్స్ కుడివైపు ఉంటాయి.? ఇంతకీ దీని వ్యత్యాసం వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చారిత్రక కారణాలు:
ఇలా షర్ట బటన్స్ రివర్స్‌లో ఉండేందుకు చారిత్రక కారణాలు ఉన్నాయి. పూర్వం చొక్కాలను కేవలం ధనిక వర్గానికి చెందిన మహిళలు మాత్రమే ధరించే వారు. ముఖ్యంగా రాజ వంశానికి చెందిన మహిళలు ధరించే వారు. వీరి వెంట దాసీలు ఉండేవారు. చొక్కాలను విప్పడం, తొడగడం వంటివి దాసీలు చూసుకునే వారు. దీంతో మరో వ్యక్తి చొక్కా బటన్స్ విప్పాలంటే బటన్స్ ఎడమ వైపు ఉంటే అనుకూలంగా ఉంటుంది. అందుకే పూర్వం నుంచి మహిళ చొక్కాలకు బటన్స్ ఎడమ వైపు ఉన్నాయని చెబుతుంటారు. పురుషులు స్వయంగా తామే దుస్తులు ధరించే వారు కాబట్టి వారి సౌకర్యం కోసం రైట్ సైడ్ బటన్స్‌ను ఇచ్చారని అంటారు.
గుర్రపు స్వారీ:
పూర్వకాలంలో రాజ వంశస్థులకు చెందిన మహిళలు గుర్రపు స్వారీలు చేసేవారు. అయితే వీరు గుర్రంపై రెండు కాళ్లు ఒకవైపు మాత్రమే వేసి కూర్చునే వారు. ఈ సమయంలో గాలి కారణంగా చొక్కా గాలికి ఎగురుతుండేది. ఈ కారణంగానే ఇలా బటన్స్ ఎడమ వైపు కుట్టడం ప్రారంభిచారని కొందరు అభిప్రాయపడుతుంటారు.
milk feeding
పాలు ఇవ్వడం:
మహిళలు ఎక్కువగా ఎడమ చేతిలో చిన్నారులను పట్టుకొని కుడి చేత్తో ఏదో ఒక పనిచేసేవారు. బిడ్డలకు పాలిచ్చే సమయంలో దుస్తులను సులభంగా విప్పేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా బటన్స్ ఎడమ వైపు ఇచ్చారనే అభిప్రాయం కూడా ఉంది.
Fact behind Shirt Pocket
పురుషుల్లో కుడి వైపు ఉండడానికి కారణం ఏంటో తెలుసా.?
ఇక పురుషుల చొక్కాలకు బటన్స్ కుడి వైపు ఉండడానికి మరో కారణం కూడా ప్రచారంలో ఉంది. పూర్వం యుద్ధంలో పాల్గొన్న సమయంలో పురుషుల కుడి చేతిలో ఆయుధాలు ఉండేవి. ఈ సమయంలో తమ చొక్కాలను ఎడమ చేతితో సులభంగా విప్పే అవకాశం ఉంటుందన్న కారణంగా ఇలా డిజైన్ చేశారని చెబుతారు.
మహిళల చొక్కాలకు బటన్స్ ఎడమవైపు ఉండేందుకు ఇలా రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా కొన్ని వందళ ఏళ్ల నుంచి ఇది ఇలాగే కొనసాగుతోంది. ఇప్పటికే డిజైనర్స్ ఇదే డిజైన్‌ను కొనసాగిస్తున్నారు.