Snakes: పాములు మనుషుల బెడ్ మీదకి ఎందుకు వస్తాయి?
Snakes: రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా మీ మంచంపై పాము కనిపిస్తే ఎలా ఉంటుంది. అమ్మో..చెప్తుంటేనే భయమేస్తుంది కదా. అసలు పాములు మనుషుల మంచాలపైకి ఎందుకు వస్తాయి? కాటేయడానికే వస్తాయా? అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

మంచం మీదికి ఎందుకొస్తాయి?
పాములు సాధారణంగా మనుషులను వెతుక్కుంటూ ఇళ్లలోకి రావు. అయితే ఇంట్లో ఎలుకలు, కప్పలను ఉంటే వాటి వెంట పాములు ఇంటి లోపలికి వచ్చే అవకాశం ఉంది. మంచం కింద, గోడల మూలల్లో లేదా ఫర్నిచర్ చుట్టూ ఎలుకలు తిరుగుతుంటే వాటిని వెంటాడి వేటాడి అలా మీరు పడుకున్న బెడ్ వరకూ వచ్చేస్తాయి.
మరో కారణం ఏంటో తెలుసా..
మరో కారణం ఏంటో తెలుసా..వెచ్చదనం.ముఖ్యంగా చల్లని వాతావరణంలో పాములు శరీర ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి వెచ్చగా ఉండే ప్రదేశాలను వెతుక్కుంటాయి. అలా అక్కడ దుప్పట్లు, మంచం లేదా మరేదైనా వెచ్చగా అనిపిస్తే దూరిపోతాయి. వాటికి అనుకూలంగా ఉంటే ఉండిపోతాయి. అక్కడ దాడి చేసే సంకేతాలు కనిపిస్తే కాటేస్తాయి.
క్లీన్ చేసుకోవాలి
అలాగే మంచం కింద ఉన్న చీకటి, ప్రశాంతమైన వాతావరణం..పాములు దాక్కునేందుకు అనువుగా ఉంటుంది. నేలపై వస్తువులు ఎక్కుగా పేరుకుపోయి ఉంటే నక్కడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే మంచాల కింద, ఫర్నిచర్ దగ్గర వస్తువులు పేరుకుపోకుండా చూసుకోవాలి. వీలు దొరికినప్పుడల్లా క్లీన్ చేసుకోవడం బెటర్. అందులోనూ వర్షాకాలం కాబట్టి...ఎక్కువగా బయట తిరుగుతుంటాయి. అప్పుడు వెచ్చదనం కోసం ఇళ్లల్లోకి చొరబడుతుంటాయి.
వెంటనే చంపేయకండి
ముందుగా పాము మంచం మీద గానీ, ఎక్కడైనా కనిపిస్తే వెంటనే చంపేయకండి. దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయొద్దు. ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకోవాలి. కన్నాలు, గుంతలు, చీమలు పుట్టలు లేకుండా చూసుకోవాలి. చెత్తా చెదారం క్లీన్ చేసుకోవాలి.అంతకన్నా ముందు ఇంట్లో ఎలుకలు లేకుండా చూడండి. ముందు అటవీ సిబ్బందిని పిలిపించి బంధించడానికి ట్రై చేయండి.

