- Home
- Business
- Today Gold Rate: బంగారం ధరలకు భారీ బ్రేక్.. 10 గ్రాములపై రూ.1,520 తగ్గుదల.. వెండి కూడా డౌన్
Today Gold Rate: బంగారం ధరలకు భారీ బ్రేక్.. 10 గ్రాములపై రూ.1,520 తగ్గుదల.. వెండి కూడా డౌన్
Today Gold Rate: బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించేలా దిగి వచ్చాయి. 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1,500కుపైగా తగ్గుదల నమోదైంది. వెండి ధర కూడా కిలోకు రూ.5 వేల మేర పడిపోయింది. మరి తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎంత ఉన్నాయంటే..

బంగారం ధరలకు బ్రేక్
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గత కొన్ని రోజులుగా పైపైకి కదులుతున్న పసిడి రేట్లు ఇప్పుడు భారీగా తగ్గాయి. బంగారం కొనాలని చూస్తున్న వారికి ఈ ధరల తగ్గుదల కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది.
రూ.1,52,680 కు చేరిన బంగారం
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల పసిడి ధర రూ.1,520 మేర పడిపోయింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,680 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములపై రూ.1,400 మేర తగ్గడంతో ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,39,950గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా దిగివచ్చింది. 10 గ్రాములపై రూ.1,140 తగ్గడంతో 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,510కి చేరింది.
ఇప్పుడు కొనాలా? వద్దా?
అంటే 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరల్లోనూ ఒకేరోజు భారీ తగ్గుదల కనిపించింది. దీంతో ఇటీవల పెరిగిన ధరలతో బంగారం కొనుగోలును వాయిదా వేసుకున్న వారికి ప్రస్తుతం మార్కెట్ రేట్లు కాస్త అనుకూలంగా మారాయి. మరోవైపు వెండి ధరలోనూ భారీ మార్పు చోటుచేసుకుంది. కిలో వెండిపై ఏకంగా రూ.5 వేల తగ్గుదల నమోదైంది. దీంతో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా కొనసాగుతోంది.
మార్కెట్లు గమనించాలి
ఒకవైపు బంగారం ధరలు భారీగా తగ్గగా, మరోవైపు వెండి రేటు కూడా కిలోకు రూ.5 వేల మేర దిగివచ్చింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులు, డాలర్ విలువ, వడ్డీ రేట్ల అంచనాలు వంటి అంశాల ప్రభావంతో బులియన్ మార్కెట్‌లో ధరలు వేగంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే కొనుగోలు చేసే ముందు ఆ రోజు మార్కెట్ రేటును మరోసారి పరిశీలించడం మంచిది.

