MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Prasad: చాక్లెట్స్ ని ప్రసాదంగా పంచి పెట్టే ఏకైక గుడి ఇది.. ఎక్కడ ఉందో తెలుసా?

Prasad: చాక్లెట్స్ ని ప్రసాదంగా పంచి పెట్టే ఏకైక గుడి ఇది.. ఎక్కడ ఉందో తెలుసా?

Prasad: గుడిలో దేవుడిని చూడటానికి వెళ్లే వాళ్లు ఎంత మంది ఉంటారో... గుడిలో పెట్టే ప్రసాదం కోసం వెళ్లేవాళ్లు కూడా అంతే ఉంటారు. అయితే, చాక్లెట్స్ ని ప్రసాదంగా పంచే గుడి ఒకటి ఉందని మీకు తెలుసా? అది కూడా మన దేశంలోనే..

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 24 2026, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చాక్లెట్ ప్రసాదం..
Image Credit : Gemini ai

చాక్లెట్ ప్రసాదం..

భారత దేశంలో చాలా ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మనకు గుడి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దేవుడు అయితే... ఆ తర్వాత గుర్తుకు వచ్చేది ప్రసాదమే. కాలం ఎంత మారినా దేవుడి ప్రసాదాల సంప్రదాయం అలానే కొనసాగుతోంది. కానీ, కేరళలోని ఒక విభిన్నమైన ఆలయంలో మాత్రం భక్తులందరికీ, ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఇష్టమైన 'మంచ్' (Munch) చాక్లెట్లను ప్రసాదంగా పంచుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చాక్లెట్స్ ప్రసాదంగా పంచే గుడి ఎక్కడ ఉంది?
Image Credit : Gemini ai

చాక్లెట్స్ ప్రసాదంగా పంచే గుడి ఎక్కడ ఉంది?

కేరళలోని అలప్పుజ జిల్లా, తలవాడి ప్రాంతంలో ఉన్న 'దెక్కన్ పళని బాలసుబ్రహ్మణ్య ఆలయం' గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ కొలువుదీరిన శ్రీ మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) కి సాంప్రదాయ పిండి వంటలకు బదులుగా చాక్లెట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ అనంతరం అర్చకులు అవే చాక్లెట్లను భక్తులకు దివ్య ప్రసాదంగా అందిస్తారు. ఇక్కడి ఈ విభిన్నమైన ఆచారం వల్ల భక్తులు ఆ స్వామిని ఎంతో ప్రేమగా 'మంచ్ మురుగన్' (Munch Murugan) అని పిలుచుకుంటారు.

ఈ వింత ఆచారం వెనుక ఉన్న క్యూట్ స్టోరీ ఏంటంటే? 

ఈ అసాధారణ సంప్రదాయం వెనుక ఒక చిన్నారికి సంబంధించిన అందమైన కథ ఉంది. కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న ఒక చిన్నారి బాలుడు తనకి ఇష్టమైన మంచ్ చాక్లెట్‌ను స్వామివారికి ఇష్టపూర్వకంగా నైవేద్యంగా సమర్పించాడట. ఆ తర్వాత ఆ బాలుడు కోలుకోవడంతో, ఆ ప్రాంత ప్రజల్లో దేవుడిపై నమ్మకం మరింత బలపడింది. అప్పట్నుంచీ భక్తులు తమ మొక్కుల కోసం స్వామివారికి కేవలం పండ్లు, పూలే కాకుండా మంచ్ చాక్లెట్లు తీసుకువెళ్లి సమర్పించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. పూజ తర్వాత తిరిగి ప్రసాదంగా ఆ చాక్లెట్‌ను స్వీకరిస్తారు.

33
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండ్:
Image Credit : Gemini ai

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండ్:

ఈ గుడి విశేషాలు ఇటీవలతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఎంతోమంది ట్రావెల్ బ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లు ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడి విశేషాలను వీడియోల రూపంలో షేర్ చేస్తున్నారు. "ఈ గుడిలో ప్రసాదంగా దొరికే మంచ్ ఎందుకో చాలా టేస్టీగా ఉంటుంది", "మంచ్ లవర్స్ అయితే ఈ ప్రసాదం చూసి ఖుషీ అయిపోవాల్సిందే" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్థానికులైతే ప్రతీ వారం ఈ ఆలయానికి వెళ్లి మరీ స్వామివారిని దర్శించుకుంటారు. ఈసారి మీరు కేరళ వెళ్తే.. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bus Tickets: బస్ టికెట్లు, కరెంట్ బిల్లులు చేతితో పట్టుకుంటున్నారా?
Recommended image2
Hair Growth: జుట్టు రాలిపోతుందని టెన్షన్ పడుతున్నారా? ఇదొక్కటి రోజూ రాస్తే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది..!
Recommended image3
Halter Neck Blouse:చీరకు ట్రెండీ లుక్ఇచ్చే హాల్టర్ నెక్ బ్లౌజుడిజైన్లు
Related Stories
Recommended image1
Dmart:ఎలాంటి యాడ్స్ ఇవ్వకుండానే.. ఇండియాను ఏలుతున్న డీమార్ట్..ఈ సూపర్ మార్కెట్ సక్సెస్ సీక్రెట్ ఇదే..!
Recommended image2
Hair Growth: జుట్టు రాలిపోతుందని టెన్షన్ పడుతున్నారా? ఇదొక్కటి రోజూ రాస్తే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved