మీకు తెలుసా.. డ్రై ఫ్రూట్స్ ను తినడానికి ఓ పద్దతుంది..!
డ్రై ఫ్రూట్స్ (Dry Fruits)మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని తినడం వల్ల ఎన్నో రోగాల నుంచి మనల్ని మనం సురక్షితంగా ఉంచుకున్నవాళ్లమవుతాం. అందుకే చాలా మంది తరచుగా డ్రై ఫ్రూట్స్ ను తింటారు. డ్రై ఫ్రూట్స్ మంచివే అయినా.. వీటిని తినే విధానం కూడా ఒకటుంది. అలా తింటేనే మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచడానికి మనం తీసుకునే ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆరోగ్యకరమైన పదార్థాలను మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. వివిధ రకాల ఆహారాలు శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి. అందులో డ్రై ఫ్రూట్స్ ఒకటి. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఖనిజాలు (Minerals), పోషకాలు (Nutrients), విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని సరైన పద్దతిలో తింటేనే మీ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. ఇంతకీ వీటిని ఎలా తినలో ఇప్పుడు తెలుసుకుందాం..
డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మంది అంటూ ఉంటారు. ఇందులో విటమిన్ ఇ, క్యాల్షియం, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్, పొటాషియం, జింక్, బి విటమిన్లు, నియాసిన్, థయామిన్, ఫోలేట్ కూడా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యను తగ్గిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డ్రై ఫ్రూట్స్ ఎంత పరిమాణంలో తినాలి? ఎప్పుడు తినాలి? వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
డ్రై ఫ్రూట్స్ ని ఎంత పరిమాణంలో తినాలి
అద్భుతమైన జీర్ణశక్తి (Digestion)ఉన్నవారు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, పుష్కలంగా నీరు త్రాగేవారు, ఎలాంటి వ్యాధులు లేనివారు ప్రతిరోజూ ఒక ఔన్సు (An ounce) పప్పును తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
డ్రై ఫ్రూట్స్ ను ఎలా తినాలి?
ఆయుర్వేదం ప్రకారం.. డ్రై ఫ్రూట్స్ శరీరం జీర్ణం చేసుకోవడం కష్టం. ఎందుకంటే వాటిలో ఎక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. అందుకే వీటిని తినడానికి ఆరు-ఎనిమిది గంటలు ముందు నీటిలో నానబెట్టాలి.. ఇలా నానబెట్టడం వల్ల దానిలో ఉండే ఫైటిక్ యాసిడ్, టానిన్ లు తొలగిపోతాయి. తద్వారా వాటి నుంచి పోషకాలను శోషించుకోవడం మనకు సులభం అవుతుంది. మీరు వాటిని నానబెట్టడం మర్చిపోతే, వాటిని పొడిగా వేయించండి. డ్రై ఫ్రూట్స్ ను ఇలా తింటేనే ఆరోగ్యానికి మంచిది.
డ్రై ఫ్రూట్స్ ను అందరూ తినొచ్చా?
పేగు ఆరోగ్య సమస్యలు, జీర్ణ సమస్యలు, ఉబ్బరం, అసిడిటీ, తీవ్రమైన విరేచనాలు, అల్సరేటివ్ కొలిటిస్, అలర్జీలు వచ్చే వారు జీర్ణశక్తి మెరుగుపడే వరకు ఈ గింజలను తినకూడదు. లేకుంటే అజీర్ణం (Indigestion), మలబద్ధకం (Constipation)వంటి సమస్యలను దారితీస్తుంది.
dry fruits
డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు తినకూడదు?
డ్రై ఫ్రూట్స్ మన శరీర ఆరోగ్యాన్ని, ఫిట్ నెస్ ను మెయింటైన్ చేయడానికి చాలా మంచివి. మీ రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ ను చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. చాలా మంది వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినడం మానుకుంటారు. డ్రై ఫ్రూట్స్ వేడిని కలిగించడమే దీనికి కారణం.అందుకే డ్రై ఫ్రూట్స్ ను ఎండాకాలంలో ఎక్కువగా తినకూడదు.