నెల రోజులు చక్కెర తినకపోతే ఏం జరుగుతుంది?
చక్కెరతో చేసిన ఎలాంటి ఆహారాలైనా టేస్టీ టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది తీపిని బాగా ఇష్టపడతారు. కానీ చక్కెర మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రెగ్యులర్ గా చక్కెరను తినేవారు ఒక నెల పాటు తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే దీనిలో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో నీటి నిలుపుదలకి కారణమవుతాయి. దీనివల్ల పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి వస్తుంది. అలాగే చక్కెర మన బరువును కూడా పెంచుతుంది. అసలు మీరు 1 నెల పాటు చక్కెరను తినడం పూర్తిగా మానేస్తే ఏమౌతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటుంది
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం మంచిది కాద. అయితే మీరు ఒక నెల పాటు చక్కెర తీసుకోవడం ఆపివేస్తే.. అది పెరిగిన రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. డయాబెటీస్ పేషెంట్లు చక్కెరను పొరపాటున కూడా తినకూడదు.
బరువు తగ్గుతారు
చక్కెరలో కేలరీలు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనివల్ల మీరు విపరీతంగా బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ఒక నెల పాటు చక్కెరను తినకపోవడం వల్ల కేలరీలు తీసుకోవడం బాగా తగ్గుతుంది. అలాగే మీరు బరువు కూడా తగ్గుతారు.
కాలేయ ఆరోగ్యం
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ఒక నెల పాటు చక్కెరను తినకపోవడం వల్ల మీ కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం
చక్కెరలు కొవ్వుగా మారడం ప్రారంభించినప్పుడు మీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది అధిక రక్తపోటు సమస్యను బాగా పెంచుతుంది. దీనివల్ల మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అదే మీరు చక్కెరను తీసుకోవడం మానేసినప్పుడు మీ గుండె కూడా తన పనిని మెరుగ్గా చేయగలుగుతుంది. అలాగే గుండె పోటు వంటి గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
దంతాల సమస్య
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల కుహరాలు, చిగుళ్ల వ్యాధి ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. మీరు ఒక నెల పాటు చక్కెరను తినకపోతే మీ నోటి ఆరోగ్యం బాగుంటుంది. నోటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
మూడ్ స్వింగ్స్
మీకు తీపి బాగా అలవాటయ్యి, రోజూ తింటుంటే.. సడెన్ గా స్వీట్లు తినకపోవడం వల్ల శరీరంలో డోపామైన్ హార్మోన్ పూర్తిగా విడుదల కాదు. ఇది ఒక రకమైన న్యూరోట్రాన్స్మిటర్. ఇది మనస్సును చురుకుగా ఉంచుతుంది. అయితే మీరు చక్కెరను పూర్తిగా మానేయడం వల్ల మూడ్ స్వింగ్స్ సమస్యకు గురవుతారు.
sugar
శక్తి లేకపోవడం
చక్కెర మన శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తుంది. ఒకవేళ మీరు దీన్ని తీసుకోవడం ఆపేస్తే.. మీ శరీరం ఎప్పుడూ బలహీనంగా అనిపించడం ప్రారంభిస్తుంది. దీంతో మీరు చురుగ్గా ఉండలేరు. ఎప్పుడూ నీరసంగా కనిపిస్తారు.