వేసవిలో పుచ్చకాయ ఎక్కువ దొరుకుతుంది. దీనిలో లైకోపీన్, విటమిన్ సి, పాలిఫెనాలిక్ కాంపౌండ్స్ వంటి ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి పేగులను కాపాడతాయి.
బొప్పాయిని వారానికి రెండు మూడు సార్లు తినాలి. ఈ పండులో ఎంజైమ్‌లు, ఫైబర్, బయోయాక్టివ్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి.
వేసవి పండు మామిడి. ఈ పండులో పాలిఫెనాల్స్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
రోజుకో అరటిపండు తింటే ఎంతో ఆరోగ్యం. ఈ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. అరటిపండు తినడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
పైనాపిల్ పండులో బ్రోమెలైన్ అనే సమ్మేళనం ఉంటుంది. పైనాపిల్ తినడం వల్ల పొట్టలో చెడు బ్యాక్టీరియా తగ్గుతుంది.
ఆపిల్ పండులో 'పెక్టిన్' అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియా అసవరం. కాబట్టి రోజుకో యాపిల్ తినాల్సిన అవసరం ఉంది.
పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పైన చెప్పిన పండ్లలో కనీసం రెండు పండ్లు అయినా రోజూ తినేందుకు ప్రయత్నించండి.
Black Pepper: ఇంట్లో నల్ల మిరియాలు ఎలా పెంచాలో తెలుసా?
Money Plant: మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అంతే సంగతులు
Trendy Bangles: అదిరిపోయే డిజైన్‍లో లక్క గాజులు.. ట్రై చేయకపోతే ఎలా?
Blouse Designs: సమ్మర్ పార్టీల కోసం అదిరిపోయే డిజైన్‍లో బ్లౌజ్‍లు..