Nandu's World: తినటానికి తిండిలేని స్థాయి నుంచి కోట్ల రూపాయల సంపాదన..ఎవరు ఈ నందూ..?
Nandu's World: ప్రస్తుతం యూట్యూబ్ లో ఎక్కడ చూసినా నందూస్ వరల్డ్ పేరే వినపడుతోంది. ఆమె భర్త మధూ చాలా మందికి వీసాలు ఇప్పిస్తామని మోసం చేసి.. కోట్లల్లో స్కామ్ చేశారంటూ వార్తలు వినపడుతన్నాయి...

Nandu's World
ఒకప్పుడు తినటానికి తిండి కూడా లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఫేమస్ ఇన్ ఫ్లయూన్సర్. ఒక్క వీడియో పెడితే మిలియన్ల కొద్దీ వ్యూస్. ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన సినిమాలో ఛాన్స్. ఇక్కడి వరకు అంత పాజిటివ్ గా బాగానే ఉంది. అందరికీ వీళ్లపై మంచి అభిప్రాయమే ఉండేది. కానీ.. సడెన్ గా ఒక్కసారి వీరిపై ఆరోపణాలు రావడం మొదలయ్యాయి. విదేశాలు వెళ్లి స్థిరపడాలి అని కలలు కంటున్న చాలా మంది ఆశలను తమకు అనుకూలంగా మార్చుకొని.. కోట్లల్లో డబ్బులు సంపాదించారనే వార్తలు రావడం మొదలయ్యాయి. అయితే.. కాసేపు ఈ సంగతి పక్కన పెడితే.. అసలు.. ఎవరు ఈ నందు..? మధు..? వీళ్లు ఈ స్థాయికి ఎలా వచ్చారు..? వీరి బ్యాగ్రౌండ్ ఏంటో చూద్దాం....
నందూ బ్యాగ్రౌండ్...
నందన స్వస్థలం మంగళగిరి సమీపంలోని పెద్ద వడ్లపూడి. అయితే... విజయవాడలోనే పెరిగారు. విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది. ఆమె భర్త మధు గుంటూరుకు చెందినవారు. వీరిది ప్రేమ వివాహం. 29 ఏళ్ల క్రితం ఓ పెళ్లిలో వీరికి పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియా లేని కాలం కాబట్టి.. ఆ సమయంలో వీరు ఉత్తరాలతో తమ ప్రేమాయణం సాగించారు. తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
యూకే ప్రయాణం.. అక్కడ ఎదుర్కొన్న కష్టాలు...
పెళ్లి తర్వాత వీరు యూకే వెళ్లారు. అక్కడ వారు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పెళ్లైన 2 నెలలకే ఉద్యోగం పోతే.. రెండు సంవత్సరాలు పార్ట్ టైమ్ ఉద్యోగం చేశారు. ఇంటి అద్దె కట్టడానికి, తిండి తినడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సొంత ఇల్లు కొనే వరకు పిల్లలను కూడా కనకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే, పెళ్లైన ఆరేళ్ల తర్వాత వాళ్లు బిడ్డను ప్లాన్ చేసుకున్నారు.
యూట్యూబ్ జర్నీ...
లాక్ డౌన్ సమయంలో సరదాగా యూట్యూబ్ మొదలుపెట్టారు. ఇంట్లో తమ దగ్గర ఉన్న చీరలు, నగలు చూపిస్తూ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. అయితే..ఆ వీడియోలు చూసి సబ్ స్క్రైబర్స్ రావడం మొదలుపెట్టారు. అయితే.. మొదట్లో నందూ వాయిస్ బాలేదని చాలా మంది కామెంట్స్ చేసేవారంట. మీ వాయిస్ చాలా కామెడీగా ఉంది అని ఒకరు పెట్టిన కామెంట్ చూసి ఆమె రెండు రోజులు ఏడ్చారంట. ఆ తర్వాత.. కామెడీగా ఉన్న తన వాయిస్ నే ప్లస్ గా మార్చుకోవాలని అనుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి కామెడీ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. దీంతో.. చాలా తక్కువ సమయంలోనే ఫేమ్ వచ్చేసింది. ఇప్పుడు ఆమెకు యూట్యూబ్ లో 2.89 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. వీరి వీడియోలు చూసి నవ్వుకోని వారు ఎవరూ ఉండరు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోల ద్వారానే వీరు లక్షల్లో సంపాదిస్తున్నారు.
సినిమాలో అవకాశం...
యూట్యూబ్ లో విపరీతమైన క్రేజ్ వచ్చిన తర్వత.. నందూకి.. ఏకంగా సినిమాలో అవకాశం వచ్చింది. చిరంజీవి, నయనతార జంట గా నటించిన మన శంకర ప్రసాద్ సినిమాలో ఒక చిన్న పాత్ర చేశారు. ఆ పాత్రకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా.. సడెన్ గా వీరికి వ్యతిరేకంగా యూట్యూబ్ లో ఆరోపణలు రావడం మొదలయ్యాయి. నందు గురించి కాదు కానీ.. ఆమె భర్త మధు ఫ్రాడ్ చేశారని.. కోట్లల్లో స్కామ్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే..తనపై వచ్చిన ఆరోపణలను కూడా ఫన్నీగా చూపిస్తూ.. ఆమె వీడియోలు చేయడం విశేషం.

