MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • IRCTC Tour Package: 5 నైట్స్, 6 డేస్.. రూ.17వేలకు ఊటీ, కూనూరు ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచే స్పెషల్ ట్రైన్

IRCTC Tour Package: 5 నైట్స్, 6 డేస్.. రూ.17వేలకు ఊటీ, కూనూరు ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచే స్పెషల్ ట్రైన్

 IRCTC Tour Package: ఎండలు కాస్త తగ్గాయి కదా అని ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లాలని అనుకుంటున్నారా? చల్లగా ఉండే ఊటీ, కోనూర్ వెళ్లి రావాలని అనుకుంటున్నారా? రూ.20వేల కంటే తక్కువ బడ్జెట్ లో ఈ ట్రిప్ కి వెళ్లేలా ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్ ఇచ్చింది. 

3 Min read
Author : ramya Sridhar
| Updated : Jun 05 2026, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
IRCTC OotyTour
Image Credit : Chat GPT

IRCTC OotyTour

ఇప్పుడిప్పుడే ఎండలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. మళ్లీ స్కూల్స్ రీ ఓపెన్ చేసేలోగా పిల్లలతో ఒక ట్రిప్ వెళ్లాలి అనుకుంటున్న వారికి ఐఆర్సీటీసీ.. శుభ వార్త తెలియజేసింది. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా.. ఈ ట్రిప్ కి హ్యాపీగా వెళ్లి రావచ్చు. మొత్తం 5 నైట్స్, 6 డేస్ సాగే ఈ ఊటీ టూర్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ట్రైన్ ఎప్పుడు, ఎక్కడ, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..?
Image Credit : Getty

ట్రైన్ ఎప్పుడు, ఎక్కడ, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..?

‘ అల్టీమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్’ పేరిట ఈ రైలు జూన్ 9వ తేదీన హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో బయలుదేరుతుంది. ఈ టూర్ కి వెళ్లడానికి అందరూ సికింద్రాబాద్ కి రావాల్సిన అవసరం లేదు. నల్గొండ, గుంటూరు, తెనాలి స్టేషన్స్ లో ఆగుతూ వెళ్తుంది. మీకు దగ్గరలో ఉన్న స్టేషన్ లో మీరు ట్రైన్ ఎక్కొచ్చు. కేవలం రైలులో ప్రయాణించడమే కాదు.. మీ హోటల్ రూమ్స్, మీ ఫుడ్, మీరు తిరిగి చూడాల్సిన ప్రదేశాలన్నీ.. అన్నింటినీ ఐఆర్సీటీసీ చూసుకుంటుంది. ఇవన్నీ ఈ ప్యాకేజీ కిందకే వస్తాయి. జూన్ 9వ తేదీన మధ్యాహ్నం 2గంటల 20 నిమిషాలకు సికింద్రాబాద్ లో రైలు బయలు దేరుతుంది.

మరుసటి రోజు ఉదయం అంటే జూన్ 10వ తేదీన దాదాపు 9 గంటలకు తమిళనాడు లోని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు. అక్కడికి మీరు చేరుకోగానే రైల్వే సిబ్బంది మీ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటారు. వాళ్లే స్వయంగా ఏసీ వాహనంలో ఊటీ తీసుకువెళతారు. అక్కడ హోటల్ రూమ్స్ కూడా వాళ్లే బుక్ చేస్తారు. మీరు వెళ్లి చెక్ ఇన్ అవ్వడమే. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం ఊటీలోని ఫేమస్ బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ అన్నీ రైల్వే సిబ్బందే మీకు దగ్గరుండి చూపిస్తారు. అవి చూసిన తర్వాత.. రాత్రికి ఊటీలోనే బస చేస్తారు. రాత్రి భోజనం కూడా వాళ్లే అందిస్తారు.

ఆ తర్వాతి రోజు ఊటీలో మిగిలిన ఇతర ప్రదేశాలను ఓపికగా తిప్పి చూపిస్తారు. మీరు ఊటీలో చూడాల్సిన అన్ని ప్రదేశాలకు తీసుకువెళతారు. టీ తోటలు, చాక్లెట్ ఫ్యాక్టరీ, వాటర్ ఫాల్స్ అన్నీ చూసేసిన తర్వాత తిరిగి మళ్లీ హోటల్ కి చేరుకొని రెస్ట్ తీసుకుంటారు. నాలుగో రోజు మీరు హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత.. ఊటీ సమయంలో మరో పర్యాటక ప్రదేశం కూనూరు తీసుకువెళతారు. అక్కడ సరదాగా గడిపిన తర్వాత మళ్లీ రాత్రికి ఊటీ వచ్చి.. అక్కడే రెస్ట్ తీసుకుంటారు.

మరుసటి రోజు ఊటీలో మీరు బ్రేక్ ఫాస్ట్ చేసి హోటల్ చెక్ అవుట్ చేస్తే.. మళ్లీ ఐఆర్సీటీసీ సిబ్బంది.. మిమ్మల్ని స్పెషల్ వెహికిల్ లో కోయంబత్తూరు తీసుకువస్తారు. అక్కడ మళ్లీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మీ కోసం రైలు సిద్ధంగా ఉంటుంది. ఈ సారి మీరు శబరి ఎక్స్ ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది. అంతే.. ట్రైన్ ఎక్కి పడుకుంటే.. తర్వాతి రోజు ఉదయానికి మీరు మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు.

Related Articles

Related image1
Guru Gochar: ఐదు నెలలు ఈ రాశులకు తిరుగు లేదు, గురు ఆశీర్వాదంతో ప్రమోషన్ పక్కా, ఫుల్ పైసల్
Related image2
Washing Machine: మీరు వాషింగ్ మెషిన్ లో ఎన్ని జతల బట్టలు పెడుతున్నారు..?
33
 ప్యాకేజీ ధర వివరాలకు వస్తే..
Image Credit : Getty

ప్యాకేజీ ధర వివరాలకు వస్తే..

ఈ ఊటీ ప్యాకేజ్ మీకు రెండు విధాలుగా అందుబాటులో ఉంది. స్లీపర్ క్లాస్, కంఫర్ట్ (3ఏ క్లాస్) అనే రెండు రకాలుగా విభజించారు. మీకు నచ్చిన ప్యాకేజీ ఎంచుకోవచ్చు. మీరు సింగిల్ గా ప్రయాణిస్తే కాస్త ధర ఎక్కువ అవుతుంది. అదే ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తే.. మీకు బడ్జెట్ తగ్గుతుంది.

స్లీపర్ క్లాస్ ఎంచుకుంటే.. ఒక్కరే ట్రిప్ కి వెళ్తే..31,050 చెల్లించాల్సి ఉంటుంది. ట్విన్ షేరింగ్ అయితే..16,360, ట్రిపుల్ షేరింగ్ అయితే 14,360 చెల్లించాలి.

ఇక.. కంఫర్ట్ అంటే థర్డ్ క్లాస్ ఎంచుకుంటే.... సింగిల్ పర్సన్ కి రూ.33,590 ఖర్చు అవుతుంది. అదే ట్విన్ షేరింగ్ అయితే..18 వేలు, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.17వేలు ఖర్చు అవుతుంది. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్తే.. షేరింగ్ వెళ్తారు కాబట్టి... బడ్జెట్ కలిసొస్తుంది.

మీరు ఈ ప్యాకేజీ తీసుకోకుండా..వేరే కారులో వెళ్లాలన్నా, లేదా విమానంలో వెళ్లినా మనిషికి రూ.50వేలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. అన్ని ప్రదేశాలు చూసే అవకాశం రాకపోవచ్చు. మీరు ఈ ప్యాకేజీ కాకుండా.. నార్మల్ గా ట్రైన్ బుక్ చేసుకున్నా ఎక్కువే అవుతుంది. అదే..ఈ ప్యాకేజీ సెలక్ట్ చేసుకుంటే.. తక్కువ ధరకు ఎలాంటి టెన్షన్ లేకుండా... హ్యాపీగా వెళ్లి రావచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ప్రయాణం
Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: మగువలు మెచ్చే సొగసైన చీరలు.. చూడకపోతే ఎలా?
Recommended image2
Purple Sarees: ఇలాంటి ఊదా రంగు చీర ఒక్కటైనా మీ దగ్గరుండాల్సిందే
Recommended image3
Toe Ring Designs: పాదాలకు రెట్టింపు అందాన్ని ఇచ్చే మెట్టెలు.. చూసేయండి
Related Stories
Recommended image1
Guru Gochar: ఐదు నెలలు ఈ రాశులకు తిరుగు లేదు, గురు ఆశీర్వాదంతో ప్రమోషన్ పక్కా, ఫుల్ పైసల్
Recommended image2
Washing Machine: మీరు వాషింగ్ మెషిన్ లో ఎన్ని జతల బట్టలు పెడుతున్నారు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved