- Home
- Life
- School Fees: ఈ దేశంలో నో స్కూల్ ఫీజ్, నో యూనిఫాం, నో హోం వర్క్...చదువు ఎలా చెబుతారో తెలుసా?
School Fees: ఈ దేశంలో నో స్కూల్ ఫీజ్, నో యూనిఫాం, నో హోం వర్క్...చదువు ఎలా చెబుతారో తెలుసా?
School Fees: స్కూల్ ఫీజు రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా, కనీసం యూనిఫాం ధరించాల్సిన అవసరం కూడా లేకుండా, చిన్న హోం వర్క్ కూడా రాయాల్సి అవసరం లేని స్కూల్స్ ఉన్నాయి అని మీకు తెలుసా? అది ఏ దేశంలోనే తెలుసా?

ఇలాంటి స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా?
ఈ రోజుల్లో పిల్లలను చదివించడం అంటే మామూలు విషయం కాదు. పిల్లల్ని నర్సరీలో చేర్పించాలన్నా...లక్షల్లో ఫీజులు కట్టాల్సి వస్తున్న రోజులు ఇవి. అంతేకాదు, ప్లే స్కూల్ లో ఆడుకోవడానికి పంపించే పిల్లలకు సైతం మోయలేనంత బరువుతో పుస్తకాల బ్యాగు, సాయంత్రం ఇంటికి రాగానే హోం వర్క్ టెన్షన్, తోటి విద్యార్థులతో ర్యాంకుల కోసం పోటీలు. దాదాపు మన దేశంలో అన్ని స్కూళ్లలోనూ ఇలానే చదువు సాగుతోంది. కానీ, దీనికి భిన్నంగా ఎడ్యుకేషన్ సాగే దేశాలు కూడా ఉన్నాయి.
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన పిల్లలు ఉండే దేశాల్లో ఒకటైన నెదర్లాండ్స్ లో విద్యావ్యవస్థ చాలా భిన్నంగా సాగుతుంది. అక్కడ ఆరేళ్ల లోపు స్కూల్ పిల్లల లైఫ్ చూస్తే..‘ అరెరే.. చదువు అంటే ఇలా కూడా ఉంటుందా?’ అని ఆశ్చర్యపోవాల్సిందే. పిల్లలకు హోం వర్క్, ర్యాంకుల టెన్షన్ లేకపోవడమే కాదు, పేరెంట్స్ కి స్కూల్ ఫీజు కట్టే అవసరం కూడా రాదు. మరి, అక్కడ పిల్లలకు చదువు ఎలాసాగుతుందో ఇప్పుడు చూద్దాం...
1.ఫీజుల భారం ఉండదు..
నెదర్లాండ్స్ లోని స్కూళ్లలో ప్రాథమిక విద్య దాదాపు ఉచితం. మన దగ్గర ప్రైవేట్ స్కూళ్లలో లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంటే, అక్కడ మాత్రం నాణ్యమైన విద్యను ప్రభుత్వం బాధ్యతగా అందిస్తుంది. పుస్తకాలు, పిల్లలకు అవసరమైనవన్నీ కూడా స్కూల్సే ఉచితంగా అందిస్తాయి.
2.యూనిఫాం ఉండదు.
అక్కడి స్కూళ్లలో పిల్లలకు ప్రత్యేకమైన యూనిఫాంలు ఉండవు. పిల్లలు తమకు నచ్చిన, సౌకర్యవంతమైన సాధారణ దుస్తుల్లోనే స్కూల్‌కు వెళ్తారు. దీనివల్ల పిల్లల్లో చిన్నప్పటి నుంచే సొంత వ్యక్తిత్వం, స్వేచ్ఛా భావన పెరుగుతాయని అక్కడి విద్యావేత్తలు నమ్ముతారు.
3. హోంవర్క్ టెన్షన్ అస్సలు ఉండదు.. ప్రాథమిక స్థాయిలో (ముఖ్యంగా 6-10 ఏళ్ల వయసులో) పిల్లలకు ఇంటికి హోంవర్క్ ఇచ్చే సంప్రదాయం దాదాపు ఉండదు. స్కూల్ సమయం ముగిశాక పిల్లలు ఇంటికి వచ్చి ఆడుకోవడానికి, తమకు నచ్చిన హాబీలు నేర్చుకోవడానికి, కుటుంబంతో సమయం గడపడానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తారు.
4. బట్టీ చదువులు కాదు.. ఆటపాటలతోనే పాఠాలు
పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు బట్టీ పట్టడం, మార్కుల కోసం పరుగులు పెట్టడం నెదర్లాండ్స్ విద్యా విధానంలో కనిపించదు. ప్రకృతిని పరిశీలించడం, గ్రూప్ యాక్టివిటీస్, కథలు, ఆటల ద్వారా జీవిత నైపుణ్యాలను నేర్పిస్తారు. ప్రతి చిన్నారికి తనదైన వేగంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, తోటి పిల్లలతో పోల్చి ఒత్తిడికి గురిచేయడం అక్కడ ఉండదు.
5. టీచర్లు కాదు.. స్నేహితులు..
తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. పిల్లలు భయం లేకుండా ప్రశ్నలు అడిగేలా, తమ ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకునేలా ప్రోత్సహిస్తారు. అందుకే అక్కడి పిల్లలు స్కూల్‌కు వెళ్లడాన్ని ఒక భారంగా కాకుండా, ఒక వేడుకలా ఎంజాయ్ చేస్తారు.
అయితే.. పూర్తిగా చదువు మొత్తం ఉచితంగా ఉండదు. ఇక చిన్నపిల్లలకు మాత్రం చదువు భారంగా కాకుండా, సరదాగా నేర్చుకునేలా అలవాటు చేయడానికి ఈ రూల్స్ ఫాలో అవుతారు.















