MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Biryani: బిర్యానీ మొదటిసారి ఎవరు తయారు చేశారు? మన దేశంలోకి ఎలా అడుగుపెట్టింది?

Biryani: బిర్యానీ మొదటిసారి ఎవరు తయారు చేశారు? మన దేశంలోకి ఎలా అడుగుపెట్టింది?

Biryani: బిర్యానీ పేరు వినగానే నోరు ఊరిపోతోంది కదా.. కానీ, మొదటిసారి బిర్యానీని ఎవరు తయారు చేశారు? అసలు.. ఈ బిర్యానీకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? మన దేశానికి ఎవరు పరిచయం చేశారు?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 28 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Biryani
Image Credit : Getty

Biryani

ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని తన సువాసన, రుచితో కట్టిపడేసే ఆహారం ఏదైనా ఉంది అంటే అది బిర్యానీ మాత్రమే. బిర్యానీ అనగానే మనకు ముందు గుర్తుకు వచ్చేది హైదరాబాద్. ఇక్కడ దొరికేంత రుచికరమైన బిర్యానీ మరెక్కడా దొరకదు. కానీ, మొట్టమొదటిసారి బిర్యానీని ఎవరు తయారు చేశారో తెలుసా? బిర్యానీ అసలు ఎలా పుట్టింది? ఈ బిర్యానీ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది..?
Image Credit : Getty

బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది..?

దాదాపు అందరూ బిర్యానీ అంటే మన దేశపు ఆహారం అని నమ్ముతారు. కానీ, బిర్యానీ అనే పదం పర్షియన్ ( పర్షియా) భాషలోని బిరింజ్ బిర్యానీ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం వేయించిన బియ్యం.. అదే ఫ్రైడ్ రైస్. మనకు బిర్యానీ, ఫ్రైడ్ రైస్ రెండూ వేర్వేరు కానీ.. బిర్యానీ పేరు మాత్రం దాని నుంచే రావడం విశేషం.

బిర్యానీ మొదట ఎవరు తయారు చేశారు..?

భారతదేశంలోకి అడుగుపెట్టడానికి ముందే పర్షియాలోని రాజభవనాల్లో బిర్యానీ పుట్టింది. అక్కడి రాజ వంశీయులు బిర్యానీ నెయ్యిలో వేయించి, దానికి మాంసం, జీడిపప్పు, బాదం, కుంకుమ పువ్వు చేర్చి, ఆ పాత్రపై మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా చిన్న సెగపై వండేవారు. ఈ పద్ధతినే మనం దమ్ బిర్యానీ అని పిలుస్తాం. అక్కడి వర్తకులు, సైనికుల ద్వారా ఈ వంటకం నెమ్మదిగా ఆప్ఘనిస్తాన్ మీదుగా మన వైపు ప్రయాణించింది.

33
భారత్ లోకి ఎలా అడుగుపెట్టిందంటే...
Image Credit : Getty

భారత్ లోకి ఎలా అడుగుపెట్టిందంటే...

15వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్, హెరాత్ ప్రాంతాలలో 'కబులీ పలావ్' అనే రాజభోజనం చాలా ప్రసిద్ధి చెందింది. 1526లో దండయాత్రల ద్వారా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్... పర్షియన్ , సెంట్రల్ ఆసియన్ వంటకాల పద్ధతులను మన దేశానికి తీసుకొచ్చారు. ఇక్కడ లభించే బాస్మతీ బియ్యం, మన సుగంధ ద్రవ్యాలు (మసాలాలు) కలవడంతో పలావ్ కాస్తా బిర్యానీగా రూపాంతరం చెందింది!

మరో కథ కూడా ఉంది...

యుద్ధరంగంలో ఉండే మొఘల్ సైనికులకు తక్కువ సమయంలో ఎక్కువ శక్తినిచ్చే ఆహారం అందించడం కోసం ఒకే పాత్రలో రైస్, మాంసం, అందుబాటులో ఉన్న మసాలాలు కలిపి వండేవారు. అలా సాధారణ సైనికుల ఆకలి తీర్చిన ఈ వంటకం.. 18వ శతాబ్దం నాటికి ఢిల్లీ, లక్నో, హైదరాబాద్‌లలో రాజులు మెచ్చే రాజభోజనంగా మారింది!

బిర్యానీ కి గుర్తింపు తెచ్చింది మాత్రం మనమే..

బిర్యానీ ఎక్కడ పుట్టినా.. దానికి ఒక మహత్తరమైన వంటకాల కళాత్మక రూపం ఇచ్చింది మాత్రం హైదరాబాద్, అవధ్ (లక్నో) నవాబులే. లక్నోలో రాగితో చేసిన పాత్రల్లో సున్నితమైన రుచులతో వండితే, హైదరాబాద్‌లో కుంకుమపువ్వు, ఘాటైన మసాలాలతో బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. బిర్యానీ ఎక్కడ పుట్టినా... దానిని కింగ్ ఆఫ్ ఫుడ్ గా మార్చింది మాత్రం మన భారతదేశమే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ బాల్కనీని సీతాకోకచిలుకల తోటగా మార్చే చిట్కాలు.. ఎలాంటి మొక్కలు పెంచాలంటే..
Recommended image2
Alia Bhatt Diet Secret: సెలబ్రిటీ డైట్ అంటే ఇదేనా? ఆలియా భట్ ఫుడ్ ఛాయిస్ ఇదే
Related Stories
Recommended image1
Makhana Capital: మన దేశంలో మఖానా రాజధాని ఏది? ప్రపంచం మొత్తానికి ఇక్కడి నుంచే సరఫరా..!
Recommended image2
Ghee Vs Butter: నెయ్యి, బటర్ రెండింటికి తేడా ఏంటి? రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved