పంటి నొప్పికి లవంగాలు అద్భుతమైన ఔషధం. నొప్పి ఉన్న చోట ఒక లవంగాన్ని ఉంచి నెమ్మదిగా నమలాలి. దీనివల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
Image credits: gemini
Telugu
వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను నాశనం చేసి నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమలడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
ఉప్పు
గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల పంటి నొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది.
Image credits: Getty
Telugu
ఐస్ క్యూబ్
నొప్పి ఉన్న పంటిపై ఒక ఐస్ క్యూబ్ ఉంచి కొరకాలి. చల్లదనం వల్ల పంటి నొప్పి తీవ్రత వెంటనే తగ్గుముఖం పడుతుంది.
Image credits: Freepik
Telugu
బేకింగ్ సోడా
టూత్‌పేస్ట్‌లో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి పళ్లు తోముకోవాలి. ఈ చిట్కా కూడా పంటి నొప్పిని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.
Image credits: Social Media
Telugu
జామ ఆకులు
జామ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. లేత జామ ఆకులను నమలడం లేదా నీటిలో మరిగించి పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.