ఉదయం ఇవి తింటూ.. రాత్రిపూట వీటికి దూరంగా ఉంటే చాలు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తినడం మానేస్తే చాలు తొందరగా బరువు తగ్గుతామని అనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. నిజమేంటంటే బ్రేక్ ఫాస్ట్ న స్కిప్ చేస్తే మధ్యాహ్నం పూట ఎక్కువ ఫుడ్ ను తినే అవకాశం ఉంది. దీంతో మీరు మరిత బరువు పెరుగుతారు.

మనలో చాలా మంది బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా అనుకున్నట్టుగా బరువు తగ్గని వారు లేకపోలేదు. అయితే కొంతమంది తినకుండా ఉంటే బరువు తగ్గుతామని భావిస్తారు. అందుకే ఉదయం మొత్తమే తినరు. నిజానికి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేసినంత మాత్రాన బరువు తగ్గుతాము అనుకోవడం భ్రమే. ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ ను చేయకపోవడం వల్ల కొన్ని గంటల్లోనే విపరీతమైన ఆకలి కలుగుతుంది. దీంతో మీరు మధ్యాహ్నం వేళ మోతాదుకు మించి తింటారు. ఇది ఊబకాయానికి దారిస్తుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఉదయం కొన్ని ఆహారాలను ఖచ్చితంగా తింటూ.. రాత్రి పూట కొన్నింటిని తినడం మానేస్తే తొందరగా బరువు తగ్గుతారు.
అరటి పండ్లు
అరటిపండు బరువు తగ్గడంలో ఎంతో సహాయపడుతుంది. రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఒక అరటిపండును తింటే ఆకలి తగ్గుతుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అరటి పండ్లలో ఉండే కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని అందించడమే కాదు.. ఫిట్ నెస్ ను కూడా పెంచుతాయి. ఇది అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. ఈ పండ్లలో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
గుడ్లు
బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే గుడ్లను ఖచ్చితంగా తినాలి. గుడ్లు ప్రోటీన్ల భాండాగారం. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. గుడ్లలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
ఓట్స్
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఓట్స్. ఓట్స్ మీ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ ను ఎలాంటి భయాలు పెట్టుకోకుండా తినొచ్చు. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది.
మొలకెత్తిన ధాన్యాలు
మొలకెత్తిన ధాన్యాలు, చిక్కుళ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినడం మంచిది. వీటివల్ల మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది. వీటిలో ప్రోటీన్లు, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.
బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు రాత్రిపూట తినకూడని ఆహారాలు
అన్నం
బరువు తగ్గాలనుకుంటే రాత్రి పూట అన్నం తినడం మానేయండి. అందులోనూ రోజుకు ఒక్కసారి మాత్రమే అన్నం తినండి. ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరిగితే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. అన్నానికి బుదులగా చపాతీలను తినండి.
రెడ్ మీట్
మటన్, గొడ్డు మాంసం వంటి రెడ్ మీట్ వంటకాల ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి. కానీ వీటిలో ఎక్కువ మొత్తంలో కొవ్వు, కేలరీలు ఉంటాయి. అందుకే వీటిని రాత్రిపూట అసలే తినకూడదు. ఒకవేళ తింటే బరువు పెరుగుతారు.
బంగాళాదుంపలు
బంగాళాదుంపలను కూడా రాత్రిపూట అసలే తినకూడదు. ఎందుకంటే ఇవి గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలకు దారితీస్తాయి. ఇది బరువును కూడా పెంచుతుంది. అలాగే జున్నులో కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తిన్నా బరువు పెరుగుతారు. వీటిని కూడా రాత్రిపూట తినకండి.
క్యాండీలు
రాత్రిపూట క్యాండీలకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది.