Gas Leakage: ఇంట్లో.. గ్యాస్ లీక్ అయినప్పుడు ఏం చేయాలి..?
Gas Leakage: మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? రోజూ దానిమీదే వంట చేస్తూ ఉంటారా? ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

Gas leakage
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిండర్లు ఉంటాయి. ఇవి వచ్చాక.. వంట చేయడం చాలా సులభం అయ్యిందని చెప్పొచ్చు. కానీ.. ఈ సిలిండర్స్ వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న పాటి నిర్లక్ష్యం కూడా చాలా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. లిండర్ నుంచి గ్యాస్ లీక్ లీకేజ్ అవ్వడం వల్ల చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే.. చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
గ్యాస్ లీక్ అవుతుంటే వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మరి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
గ్యాస్ వాసన వస్తే ముందుగా ఏం చేయాలి?
గ్యాస్ లీక్ అయినప్పుడు ఆ వాసనను వెంటనే గుర్తించేలా ఆ సిలిండర్లకు ఇథైల్ మెర్కాప్టాన్ కలుతారు. దీని కారణంగా ఇంట్లో కుళ్లిన కోడిగుడ్డు లేదా వెల్లుల్లి లాంటి వాసన వస్తుంది. దీనిని ఆధారంగా గ్యాస్ లీక్ అవుతుందని మనం గుర్తించాలి. ఇలా వాసన వస్తున్నప్పుడు వెంటనే స్టవ్ బర్నర్, కంట్రోలర్ అన్నింటినీ ఆపేయాలి. అంతేకాదు.. ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ తెరిచి ఉంచాలి. అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
సిలిండర్ ని ఉంచే ప్రదేశం...
గ్యాస్ వాసన కొనసాగితే, రెగ్యులేటర్‌ను తీసివేసి సిలిండర్‌పై సేఫ్టీ క్యాప్‌ను ఉంచండి. పిల్లలను గ్యాస్ ప్రాంతం దగ్గర అనుమతించవద్దు. సిలిండర్‌ను ఎక్కువసేపు ఉపయోగించకూడదనుకుంటే, రెగ్యులేటర్‌ను తీసివేసి దానిపై క్యాప్‌ను ఉంచండి. సిలిండర్‌ను పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.
వీటిని దూరంగా ఉంచాలి...
మీకు గ్యాస్ వాసన వస్తే, సమీపంలోని ఏవైనా మంటలు, కొవ్వొత్తులు, అగరుబత్తులు, దీపాలు లాంటివి ఉంటే వాటిని వెంటనే ఆర్పివేయండి. అగ్గిపుల్లలు లేదా లైటర్లను వెలిగించవద్దు. విద్యుత్ స్విచ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయకుండా జాగ్రత్త వహించండి, ఎందుకంటే అవి స్పార్క్‌లను కలిగించి పెద్ద పేలుడుకు కారణమవుతాయి.
సిలిండర్ నుంచి మంటలు వస్తే...
గ్యాస్ లీకేజీ కారణంగా సిలిండర్ నుంచి మంటలు వస్తే మీరు వెంటనే భయపడవద్దు. సిలిండర్ మంటల్లో చిక్కుకుంటే, మీకు కొంత సమయం ఉంది. సిలిండర్ మంటల్లో చిక్కుకుంటే, మందపాటి దుప్పటిని తడిపి, ఆపై సిలిండర్ చుట్టూ చుట్టండి. ఇది మంటలను ఆపివేస్తుంది. దీని తరువాత, వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1906 కు కాల్ చేయండి.

