Tips and Tricks: మీరు బెడ్ షీట్ ఎన్ని రోజులకి ఒకసారి మారుస్తున్నారు..?
Tips and Tricks: చాలా మంది ఇంటిని శుభ్రం చేయడం అంటే… కేవలం ఫ్లోర్ మాత్రమే శుభ్రం చేస్తారు. కానీ… రెగ్యులర్ గా బెడ్ షీట్ మార్చడం కూడా ఇంటిని క్లీన్ చేయడంలో భాగమే.

Bed sheet
చాలా మంది తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే, చాలా మంది తమ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతారు. అదే బెడ్ షీట్ లను మార్చడం. బెడ్ షీట్ లపై మరలు ఉంటే లేదా మురికిగా కనిపిస్తేనే వాటిని మార్చాలని చాలా మంది అనుకుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. మరి నిపుణుల ప్రకారం, అసలు బెడ్ షీట్స్ని ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
నిపుణుల అభిప్రాయం...
నిపుణుల ప్రకారం... నెలల తరబడి ఒకటే బెడ్ షీట్ ని వాడకూడదు. కనీసం వారానికి ఒకసారి అయినా బెడ్ షీట్ ని మారుస్తూ ఉండాలి. అప్పుడే ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
బెడ్‌షీట్‌లను రెగ్యులర్ గా ఎందుకు మార్చాలి?
మన శరీరంలోని చెమట , చనిపోయిన చర్మ కణాలు ప్రతిరోజూ మన బెడ్‌షీట్‌లపై పేరుకుపోతాయి. ఇవి కనిపించని క్రిములు, శిలీంధ్రాలకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతాయి. మనకు అవి కనపడకపోవడం వల్ల నీట్ గానే ఉన్నాయి కదా అని మనం బెడ్ షీట్ మార్చకుండా వదిలేస్తాం. కానీ, దీని వల్ల స్కిన్ అలెర్జీలు, శ్వాస కోస వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
వేసవి కాలంలో....
వేసవిలో చాలా చెమట పడుతుంది కాబట్టి, ప్రతి మూడు లేదా నాలుగు రోజులకు మీ బెడ్‌షీట్‌లను మార్చడం మంచిది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. చెమట తక్కువగా ఉండటం వల్ల శీతాకాలంలో బెడ్‌షీట్‌లు శుభ్రంగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ, అప్పుడు కూడా బ్యాక్టీరియా వచ్చి చేరే ప్రమాదం ఉంది. కాకపోతే ఈ వర్షాకాలం, శీతాకాలంలో వారానికి ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది.
పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే...
మీకు ఇంట్లో పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉంటే, ప్రతి రెండు లేదా మూడు రోజులకు మీ బెడ్ షీట్లను మార్చడం మంచిది. ఎందుకంటే ఆహార కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు , ధూళి మీ బెడ్ షీట్లపై సులభంగా చిక్కుకుపోతాయి. అదనంగా, ఉబ్బసం, అలెర్జీలు లేదా చాలా సున్నితమైన చర్మం ఉన్నవారు అదనపు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా, మీ బెడ్ షీట్లను మారిస్తే సరిపోదు. వాటిని సరిగ్గా శుభ్రం చేయడం కూడా ముఖ్యం.
బెడ్ షీట్లను ఎలా శుభ్రం చేయాలి?
బెడ్ షీట్లను వేడి నీటిలో యాంటీసెప్టిక్ ద్రవంతో ఉతకాలి. ఉతికిన బెడ్ షీట్లను ఎండలో ఆరబెట్టడం ఉత్తమం, ఎందుకంటే సూర్యకాంతి శక్తివంతమైన క్రిమిసంహారక మందుగా పనిచేస్తుంది. బెడ్ షీట్లలో దాగి ఉన్న సూక్ష్మక్రిములను చంపుతుంది.
మీ బెడ్ షీట్లను క్రమం తప్పకుండా మార్చడం, శుభ్రపరచడం వలన ఇన్ఫెక్షన్లు , అలెర్జీలు నివారించవచ్చు, అలాగే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు.