చలికాలంలో చుండ్రు సమస్య అధికంగా ఉంటుంది. తలపై దురద, తెల్లటి పొరలు, వెంట్రుకలు రాలడం ఎక్కువవుతాయి.
చుండ్రు సమస్యను వేగంగా కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? ఇంట్లో సులభంగా పాటించే చిట్కాలను ఇక్కడ ఇచ్చాము.
పెరుగు తలకు చల్లదనాన్నిస్తుంది, నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ చుండ్రును తొలగిస్తుంది. 3 చెంచాల పెరుగు, 1 చెంచా నిమ్మరసం కలిపి రాస్తే మాస్క్ దురద, మంట వెంటనే తగ్గుతుంది.
టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇది చుండ్రుపై అద్భుతంగా పనిచేస్తుంది. 4 చెంచాల కలబంద జెల్‌లో 2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించండి.
మెంతులు తలపై మాడును బాగుచేసి, పొరలను తగ్గిస్తాయి. రాత్రంతా నానబెట్టిన మెంతులను పేస్ట్ చేసి, 1 చెంచా కొబ్బరి నూనె కలిపి అరగంట పాటూ ఉంచి కడిగేయండి.
వేపలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. మొండి చుండ్రుకు చాలా సహాయపడుతుంది. వేపాకులు నీటిలో మరిగించి పేస్ట్ చేసి 2 చెంచాల పెరుగు కలపండి. దీన్ని తలకు పట్టించి శుభ్రం చేసుకోండి.
టీ ట్రీ లేదా కీటోకోనజోల్ ఉన్న షాంపూ , యాంటీ-డాండ్రఫ్ షాంపూ… నిమ్మ, క్లే ఆధారిత షాంపూలు వంటివి వాడడం వల్ల చుండ్రు త్వరగా పోతుంది.