MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kitchen Hacks: గ్యాస్ స్టవ్ బర్నర్లను ఇలా ఈజీగా క్లీన్ చేయండి

Kitchen Hacks: గ్యాస్ స్టవ్ బర్నర్లను ఇలా ఈజీగా క్లీన్ చేయండి

Kitchen Hacks:రోజూ రకరకాల వంటలను చేయడం వల్ల గ్యాస్ స్టవ్, దాని బర్నర్లు మురికిగా అవుతాయి. వారం పాటు క్లీన్ చేయకుండా వదిలేస్తే ఇవి అస్సలు పోవు. ఇలాంటి వాటిని సులువుగా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 05 2025, 08:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గ్యాస్ స్టవ్ బర్నర్లను ఎలా శుభ్రం చేయాలి?
Image Credit : stockPhoto

గ్యాస్ స్టవ్ బర్నర్లను ఎలా శుభ్రం చేయాలి?

గ్యాస్ స్టవ్ ను మనం రెగ్యులర్ గా ఉపయోగిస్తాం. వీటిపై ఎన్నో రకాల ఆహార పదార్థాలు, నూనె, కారం వంటివి ఎన్నో పడతాయి. దీనివల్ల గ్యాస్ స్టవ్, గ్యాస్ బర్నర్లు మురికిగా అవుతాయి. వీటిని క్లీన్ చేయకుండా వదిలేస్తే ఈ మరకలు మొండిగా అయ్యి అస్సలు పోవు. 

అంతేకాకుండా వీటిలో దుమ్ము, ధూళి కూడా ఉంటాయి. దీనివల్ల గ్యాస్ స్టవ్ అంతర్గత భాగాలు దెబ్బతింటాయి. అలాగే మంట కూడా తక్కువగా వస్తుంది. కానీ గ్యాస్ వృధా అవుతుంది. అందుకే గ్యాస్ స్టవ్ బర్నర్లను ఎలా క్లీన్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
  గ్యాస్ స్టవ్ బర్నర్లను ఎలా శుభ్రం చేయాలి?
Image Credit : stockPhoto

గ్యాస్ స్టవ్ బర్నర్లను ఎలా శుభ్రం చేయాలి?

గ్యాస్ స్టవ్ చుట్టూరా క్లీన్ చేయాలి

గ్యాస్ స్టవ్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదంటే దానిచుట్టూరా క్లీన్ చేసుకోవాలి. ఇందుకోసం గ్యాస్ స్టవ్ చుట్టూ ఉన్న కాగితపు తువాళు, దుస్తులు, పాత్రలను తీసేయాలి. వీటిని స్టవ్ కు దగ్గరగా ఉంచకూడదు.

 మీరు స్టవ్ ను వాడుతున్నప్పుడు సరైన వెంటిలేషన్ ఉండాలి. దీనివల్ల బర్నర్లు సరిగ్గా పనిచేస్తాయి. గ్యాస్ స్టవ్ చుట్టూరా క్లీన్ చేయడం వల్ల గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేసుకోవడం ఈజీ అవుతుంది.

గ్యాస్ స్టవ్ బర్నర్‌లను ఎలా శుభ్రం చేయాలి?

బేకింగ్ సోడా, వెనిగర్ తో గ్యాస్ స్టవ్ బర్నర్ లను ఈజీగా శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం ఒక కప్పు బేకింగ్ సోడాలో 1/2 కప్పు వెనిగర్ ను పోసి కలపాలి. దీనితో బర్నర్లను శుభ్ర చేయడానికి ముందు గ్యాస్ స్టవ్ ను ఆఫ్ చేయండి.

 ఇప్పుడు బేకింగ్ సోడా మిశ్రమాన్ని బర్నర్ హెడ్స్, క్యాప్స్ కు పెట్టండి. దీన్ని అర్థగంట పాటు అలాగే ఉంచి తర్వాత బ్రష్ తో క్లీన్ చేయండి. నీళ్ల కింద బర్నర్ లను క్యాప్స్ ను కడగండి. తర్వాత టవల్ లో తడి లేకుండా తుడిచి ఆరబెట్టండి.

34
నానబెట్టండి
Image Credit : stockPhoto

నానబెట్టండి

గ్యాస్ బర్నర్లు చల్లగా ఉన్నప్పుడు ఒక డబ్బాలో నీళ్లను తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. దీనిలో బర్నర్ లను, క్యాప్స్ ను వేసి నానబెట్టండి. 

దీన్ని సుమారుగా ఒక 30 నిమిషాలు నానబెట్టండి. వీటిని ఎంత ఎక్కువ సేపు నానబెడితే ఇవి అంత శుభ్రంగా అవుతాయి. ఇవి బాగా నానడం వల్ల వాటికి అంటుకున్న దుమ్ము, ధూళి తొందరగా తొలగిపోతాయి.

ఈ పేస్ట్ ను పెట్టండి

నానబెట్టిన వాటర్ లో నుంచి క్యాప్స్ ను , బర్నర్ లను బయటకు తీయండి. వీటిని పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకుని అందులో కొన్ని టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, కొన్ని చుక్కల నీళ్లు పోసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ను బర్నర్ లకు, క్యాప్స్ కు బాగా అప్లై చేయండి. దీన్ని 15 నిమిషాలు పక్కన పెట్టండి.

44
ఇలా క్లీన్ చేయండి
Image Credit : stockPhoto

ఇలా క్లీన్ చేయండి

ఇప్పుడు టూత్ బ్రష్ తీసుకుని బర్నర్ , క్యాప్స్, హెడ్స్ ను క్లీన్ చేయండి. బ్రష్ తో రుద్దడం వల్ల వాటికి అంటుకున్న నూనె, దుమ్ము, ధూళి సులువుగా తొలగిపోతాయి. బర్నర్ రెండు వైపులా, వెనకాల శుభ్రంగా క్లీన్ చేయాలి. అయితే బర్నర్ రంధ్రాల్లోని మురికిని పోగొట్టడానికి మాత్రం మీరు టూత్ పిక్ లను అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది పోర్టులను మూసుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల బర్నర్ లు పాడవుతాయి.

ఈ భాగాలను శుభ్రం చేయండి

బర్నర్లను, క్యాప్స్ ను శుభ్రం చేసిన తర్వాత వాటిని కుళాయి కింద పెట్టి శుభ్రం చేయండి. తర్వాత దీనికి వాటర్ లేకుండా క్లాత్ తో తుడవండి. తర్వాత గాలికి బాగా ఆరబెట్టండి. ఇవి పూర్తిగా ఆరిన తర్వాతే ఉపయోగించండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Recommended image3
Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్
Related Stories
Recommended image1
Sink Cleaning Tips: కిచెన్ సింక్ జామ్ అయ్యి నీళ్లతో నిండిపోయిందా? వెంటనే ఇలా చేయండి క్లియర్ అవుతుంది
Recommended image2
Hair Oil: ఈ రెండు కలిపిన నూనెను పెడితే మీ జుట్టు తెల్లగా కాదు, ఊడిపోదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved