Hair Oil: ఈ రెండు కలిపిన నూనెను పెడితే మీ జుట్టు తెల్లగా కాదు, ఊడిపోదు
Hair Oil: ఈ రోజుల్లో జుట్టు రాలడమనేది ఒక కామన్ సమస్యగా మారిపోయింది. దీనివల్ల జుట్టు సన్నగా కనిపిస్తుంది. దీనికి తోడు జుట్టు జీవంలేనట్టుగా కనిపిస్తుంది కూడా. అయితే మందారం, మెంతులతో చేసిన నూనెను పెడితే మీకు జుట్టు సమస్యలే ఉండవు తెలుసా?

హెయిర్ ఆయిల్
ప్రతి ఒక్కరూ నల్లని, ఒత్తైన జుట్టు ఉండాలని ఆశపడతారు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే నూనెలను, షాంపూలను మార్చడం వంటివి చేస్తూనే ఉంటారు. ఇక కొంతమంది రకరకాల ఇంటిచిట్కాలను కూడా ఫాలో అవుతుంటారు. కానీ జుట్టు రాలడానికి షాంపూలు, నూనెలు కాకుండా వేరే కారణాలు ఉన్నాయి. అంటే ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారాలను తినడం, కాలుష్యం, కెమికల్స్ ఉండే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను వాడటం వంటి కారణాల వల్ల జుట్టు రాలుతుంది. దెబ్బతింటుంది.
జుట్టు బలంగా, రాలకుండా ఉండటానికి సహజ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని ఎన్నో ఏండ్ల నుంచి వాడుతూ వస్తున్నారు. వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండటం వల్ల జుట్టుకు ఎలాంటి నష్టం జరగదు. ఇలాంటి వాటిలో మందార పువ్వులు, మెంతులు ఉన్నాయి. అవును మందారం, మెంతుల్లో మన జుట్టుకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటిలో ఉండే లక్షణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుతాయి. మరి ఈ రెండింటిలో ఆయిల్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మందార పువ్వులు, ఆకులు జుట్టుకు చేసే మేలు
మందారం పువ్వులను, ఆకులను మన జుట్టు కోసం ఉపయోగించొచ్చు. ఈ పువ్వులు, ఆకుల్లో మన జుట్టును ఆరోగ్యంగా ఉంచే లక్షణాలు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు జుట్టును రాలకుండా చేస్తాయి. అలాగే షైనీగా ఉంచుతాయి. అసలు ఇవి మన జుట్టుకు ఎలాంటి మేలు చేస్తాయంటే?
జుట్టును బలంగా ఉంచుతాయి
మందార పువ్వులు, ఆకుల్లో అమైనో ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన జుట్టుకు అవసరమైన కెరాటిన్ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపతాయి. దీంతో మన జుట్టు మూలాల నుంచి బలంగా మారుతుంది. అలాగే వెంట్రుకలు తెగిపోకుండా కాపాడుతుంది. మొత్తంగా మందారం జుట్టును స్ట్రాంగ్ గా ఉంచేందుకు సహాయపడుతుంది.
జుట్టు పెరగడానికి సహాయపడుతుంది
జుట్టు పొడుగ్గా పెరగాలని ఆడవాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారికి మందార బాగా సహాయపడుతుంది. అవును మందార పువ్వు, ఆకులను ఉపయోగించి మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా చేయొచ్చు. మందార పువ్వులో విటమిన్ C, అమైనో ఆమ్లాలు ఉంటాయి.
ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు ఫాస్ట్ గా, ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడతాయి. మందారం నెత్తిమీద రక్తప్రసరణను పెంచుతుంది. దీంతో జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది. దీనివల్ల ఉన్న జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి.
కండిషనింగ్
మందరంలో కండీషనింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. మందార పువ్వులు, ఆకుల్లో జిగటగా ఉండే ఒక పదార్థం ఉంటుంది. ఇది నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. వీటిని పెట్టడం వల్ల మన జుట్టు సాఫ్ట్ గా అవుతుంది. అందంగా మెరుస్తుంది. అంతేకాదు వీటిని వాడటం వల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది.
చుండ్రు నుంచి ఉపశమనం
చుండ్రు చూడటానికి చిన్న సమస్యే అయినా దీనివల్ల ఎన్నో హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే చుండ్రు ఉంటే వెంట్రుకలు బాగా ఊడిపోతాయి. పొడుగ్గా పెరగవు. నెత్తిమీద ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే వెంట్రుకలు జీవం లేనట్టుగా కనిపిస్తాయి.అందుకే నెత్తిమీద చుండ్రు లేకుండా చూసుకోవాలి. చుండ్రును పోగొట్టడంలో మందారం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించేందుకు సహాయపడతాయి.
జుట్టు రాలడం తగ్గుతుంది
మందార పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి స్కాల్ప్ ను బలంగా ఉంచేందుకు సహాయపడతాయి. ఇది నెత్తిమీద రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు మూలాలు బలంగా అవుతాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు మందార పువ్వును ఉపయోగించడం వల్ల జుట్టు బాగా శుభ్రపడుతుంది.అంతేకాదు వీటిని ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు అంత తొందరగా రాదు.
మెంతులు జుట్టుకు చేసే మేలు
మెంతులు మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ గింజల్లో నికోటిన్ యాసిడ్, ప్రోటీన్, ఐరన్, లెసిథిన్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ మన జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అసలు మెంతులు మన జుట్టుకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హెయిర్ ఫాల్ తగ్గుతుంది
మెంతులను జుట్టుకు ఉపయోగిస్తే జుట్టు ఊడిపోవడం చాలా వరకు తగ్గుతుంది. వీటిలో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, నికోటినిక్ ఆమ్లం జుట్టు కుదుళ్లను బలంగా చేయడానికి సహాయపడుతుంది. దీంతో మీ జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు మెంతుల్లో ఉండే లెసిథిన్ మన జుట్టు మూలాలకు మంచి పోషణ అందిస్తుంది. దీంతో కొత్త జుట్టు వస్తుంది. జుట్టు పొడుగ్గా కూడా పెరుగుతుంది.
పొడిబారడం తగ్గుతుంది
మెంతులు జుట్టును పొడిబారకుండా చేయడానికి సహాయపడతాయి. వీటిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు తేమను నిలుపుకుంటుంది. దీంతో మీ జుట్టు నిర్జీవంగా కాదు. పొడిబారదు. అలాగే మెంతులు నెత్తిమీద చుండ్రును తగ్గిస్తుంది. దద్దుర్లు కాకుండా చేయడానికి సహాయపడుతుంది.
తలలో దద్దుర్లు, డాండ్రఫ్ తగ్గించగలవు. మెంతుల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు మెంతులు కూడా చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది.
మందారం, మెంతులతో నూనెను ఎలా తయారుచేయాలి?
ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకుని తక్కువ మంట మీద వేడి చేయండి. నూనె గోరువెచ్చగా అయినపపుడు అందులో ఐదారు మందార ఆకులు, పువ్వులు, రెండు టేబుల్ స్పూన్ల మెంతులను వేయండి. మెంతులు గోధుమ రంగులోకి మారి, మందార పువ్వులు, ఆకుల రంగు నూనెకు వచ్చిన తర్వాత స్టవ్ ను ఆపేయండి.
ఈ ప్రాసెస్ కావడానికి 5 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. కాబట్టి దీన్ని తక్కువ మంట మీదే మరిగించాలి. తర్వాత స్టవ్ ను ఆపేసి నూనెను చల్లారనివ్వండి. దీన్ని వడకట్టి నీట్ గా ఉండే గాజు సీసాలోకి పోయండి.
మందారం, మెంతుల నూనెను ఎలా ఉపయోగించాలి?
రాత్రిపూట పడుకునే ముందు ఈ నూనెను గోరువెచ్చగా చేసి నెత్తికి, జుట్టు మొత్తానికి బాగా అప్లై చేయాలి. కొద్దిసేపు మసాజ్ చేయాలి. దీనివల్ల నెత్తిమీద రక్తప్రసరణ పెరుగుతుంది. కుదుళ్లకు పోషణ అందుతుంది. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది. లేదంటే తలస్నానం చేయడానికి గంట ముందు పెట్టుకోవచ్చు.