MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Age Gap: భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉంటే వారు సంతోషంగా ఉంటారు?

Age Gap: భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉంటే వారు సంతోషంగా ఉంటారు?

Age Gap: భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువ ఉండాలా? లేక తక్కువగా ఉండాలా?  వైవాహిక జీవితం ఆనందంగా సాగాలంటే భార్యా భర్తల మధ్య వయసు తేడా ఎంత ఉండాలి? ఈ విషయంలో చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 05 2026, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భార్యాభర్తల మధ్య వయసు తేడా
Image Credit : Instagram

భార్యాభర్తల మధ్య వయసు తేడా

తెలుగిళ్లల్లో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి, అమ్మాయి వయసు గురించే మొదట అడుగుతారు. నిజానికి సమాజంలో అబ్బాయి వయసును పెద్దగా పట్టించుకోరు.  అతని జీతం, ఆస్తులు మాత్రమే చూస్తారు.  అమ్మాయి కన్నా అబ్బాయి కేవలం ఏడాది పెద్దయినా, పదేళ్లు పెద్దయినా పట్టించుకోరు. నిజానికి  భార్యభర్తల మధ్య వయసు తేడా చూసుకుని పెళ్లి చేయడం చాలా ముఖ్యం.  ఆచార్య చాణక్యుడు కూడా ఇదే విషయాన్ని తాను రాసిన నీతి శాస్త్రంలో వివరించారు. జంటల మధ్య సరైన ఏజ్ గ్యాప్ ఉంటే బంధంలో పరిపక్వత వస్తుందని, అవగాహన, గౌరవం, సహనం పెరుగుతాయని చాణక్యుడి నమ్మకం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వయసు తేడా తక్కువగా ఉంటే
Image Credit : Asianet News

వయసు తేడా తక్కువగా ఉంటే

భార్యాభర్తల మధ్య వయసు తేడా తక్కువగా ఉంటే వారి మధ్య అవగాహనఎక్కువగా ఉంటుందని చాణక్యుడు చెబుతున్నారు. దాదాపు ఒకే వయసు వాళ్లు కాబట్టి కలిసి తప్పులు చేస్తారు, కలిసి సంతోషంగా జీవిస్తారు. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు వయసు తేడాను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.

34
వయసు తేడా ఎక్కువంటే..
Image Credit : stockPhoto

వయసు తేడా ఎక్కువంటే..

భర్త వయసులో చాలా పెద్దవాడు, భార్య చిన్న వయసు అయితే  ఆ పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలవదు. వయసులో పెద్ద తేడా ఉంటే దంపతుల మధ్య అవగాహన ఉండదు.  ఇది సజావుగా సాగే వైవాహిక జీవితానికి అడ్డంకిగా మారుతుంది.భార్యాభర్తల మధ్య 3 నుంచి 5 ఏళ్ల వయసు తేడా ఉంటే మంచిదే. అయితే,కొన్నిసార్లు ఈ వయసు తేడా 10 నుంచి 15 ఏళ్ల వరకు కూడా ఉంటుంది. అది ఏమాత్రం మంచిది కాదు. వరుడికి 30 ఏళ్లు ఉంటే, వధువు వయసు 25 నుంచి 30 మధ్య ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండకూడదు.

44
హార్మోన్లలో మార్పులు
Image Credit : pinterest

హార్మోన్లలో మార్పులు

టీనేజీలో అమ్మాయిలు, అబ్బాయిల హార్లోన్లలో మార్పులు వస్తాయి.  అమ్మాయిలలో ఈ మార్పు దాదాపు 13 ఏళ్ల వయసులో కనిపించడం మొదలవుతుంది. అబ్బాయిలలో 15 ఏళ్ల నుంచి జరుగుతుంది. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలలో ఈ హార్మోన్ల మార్పులు ముందే వస్తాయి. ఫలితంగా వారు అబ్బాయిల కంటే చిన్న వయసులోనే శారీరకంగా పరిణితి చెందుతారు.  అందుకే అబ్బాయి కన్నా కొంతవరకు అమ్మాయి వయసు తక్కువగా ఉండాలని చెబుతారు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదెక్కడి వింత ఆచారం! పెళ్లి తర్వాత వధూవరులు టాయిలెట్‌కు వెళ్లకూడదా!!
Recommended image2
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Related Stories
Recommended image1
Necklace: మెడలో రంగురంగుల రాళ్ల నెక్లెస్.. డిజైన్స్ ఇవిగో
Recommended image2
iPhone Price: ఈ దేశాల్లో ఐఫోన్ చాలా చీప్.. వెళితే ఓ రెండు మూడు కొని తెచ్చుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved