MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Urine: గంటపాటు మూత్రం ఆపుకుంటే ఏమౌతుంది?

Urine: గంటపాటు మూత్రం ఆపుకుంటే ఏమౌతుంది?

Urine: ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టినప్పుడు చాలా మందికి పబ్లిక్ టాయిలెట్స్ వాడటం ఇష్టం ఉండదు. ఇంటికి వచ్చే వరకు మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 02 2026, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Urine
Image Credit : Getty

Urine

పని మీద బయటకు వెళ్లినప్పుడు..మనకు అవసరం అయినప్పుడు.. శుభ్రమైన టాయిలెట్స్ దొరకడం అంత ఈజీ కాదు. అలా అని ఎక్కడ పడితే అక్కడ వెళ్లలేరు. అలాంటప్పుడు చాలా మంది మూత్రాన్ని ఆపుకుంటారు. ఇలా మూత్రాన్ని ఆపుకోవడం అప్పుడప్పుడు జరిగితే పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మూత్రం ఆపితే ఏమౌతుంది?
Image Credit : Getty

మూత్రం ఆపితే ఏమౌతుంది?

అసౌకర్యం, ఒత్తిడి.. ఒక గంట పాటు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయం పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల, పొత్తి కడుపులో లేదా మూత్రాశ్రయం చుట్టూ నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. మూత్రాశయ కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు, మూత్రాన్ని ఆపుకునే క్రమంలో.. మెదడుకు కొన్ని సిగ్నల్స్ వెళతాయి. దీని కారణంగా.. ఫోకస్ మొత్తం ఎప్పుడెప్పుడు టాయిలెట్ కి వెళ్దామా అనే ఉంటుంది. మరో విషయంపైకి ఫోకస్ రాదు.

యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయా?

గంట లేదా అంత కంటే ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే, రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల మాత్రం యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి... దాని వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి.

33
కిడ్నీళ్లలో రాళ్లు వస్తాయా?
Image Credit : Getty

కిడ్నీళ్లలో రాళ్లు వస్తాయా?

కేవలం యూరిన్ ఇన్ఫెక్షన్లు మాత్రమే కాదు... ఈ కింది సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది...

మూత్రాశయ కండరాల బలహీనత: రెగ్యులర్ గా మూత్రం ఆపుకునే వాళ్లకు మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి. ఫలితంగా, తదుపరి మూత్ర విసర్జన సమయంలో మూత్రాశం పూర్తిగా ఖాళీ అవ్వదు. దీని వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

మూత్రపిండాలపై ఒత్తిడి: ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోవడం క్రమంగా మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది, ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి హానికరం. అంతేకాదు.. కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Choker Designs: చీరలు, లెహంగాలకు గ్రాండ్ లుక్ ఇచ్చే చోకర్ డిజైన్స్!
Recommended image2
కొంతమంది అమ్మాయిలకు మీసాలు ఎందుకు వస్తాయి? వాటిని శాశ్వతంగా ఎలా తొలగించుకోవాలి?
Recommended image3
Gold Chain: అర తులంలో ఈజీగా లభించే చైన్ డిజైన్లు..చూసేయండి
Related Stories
Recommended image1
Instant Curd: ఇంట్లో పెరుగు అయిపోయిందా? 15 నిమిషాల్లో పాలను పెరుగులా మార్చే టెక్నిక్ ఇది
Recommended image2
Ice Cream: ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved