MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Food
  • Ice Cream: ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ చేయాలో తెలుసా?

Ice Cream: ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ చేయాలో తెలుసా?

Ice Cream:  ఐస్ క్రీమ్ డబ్బా కొని.. డీప్ ఫ్రిజ్ లో పెట్టి మర్చిపోతున్నారా? ఒక్కసారి ఓపెన్ చేసిన ఐస్ క్రీమ్ డబ్బా..లోని ఐస్ క్రీమ్ ఎన్ని రోజుల వరకు తాజాగా ఉంటుంది? ఒక్కసారి  ఐస్ క్రీమ్ డబ్బా ఓపెన్ చేస్తే… ఎన్ని రోజుల్లో తినేయాలి?  

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 01 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఐస్ క్రీమ్..
Image Credit : chatgpt

ఐస్ క్రీమ్..

చిన్న, పెద్దా అనే తేడా లేకుండా  ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫుడ్స్ లో ఐస్ క్రీమ్ ముందు వరసలో ఉంటుంది. ఎండా కాలం అయినా, వానా కాలం అయినా… ఐస్ క్రీమ్ తినే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే… కొందరు.. ఐస్ క్రీమ్ పెద్ద పెద్ద డబ్బాలు కొనేసి.. ఫ్రీజర్ లో స్టోర్ చేసి..రోజూ కొంచెం కొంచెం తింటూ ఉంటారు. కానీ.. ఓపెన్ చేసిన ఐస్ క్రీమ్ డబ్బాని ఎక్కువ రోజులు నిల్వ ఉంచి  తినడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఐస్ క్రీమ్ బాక్స్ ఓపెన్ చేయకపోతే....
Image Credit : chatgpt

ఐస్ క్రీమ్ బాక్స్ ఓపెన్ చేయకపోతే....

మీరు దుకాణం నుంచి తెచ్చిన ఐస్ క్రీమ్ బాక్సులు తెరవకుండా… ఇంట్లో ఫ్రీజర్ లో పెడితే… అది దాదాపు 2 నుంచి 3 నెలల వరకు తాజాగా, సురక్షితంగా ఉంటుంది. దీనినే షెల్ప్ లైఫ్ అంటారు.

మరి బాక్స్ ఓపెన్ చేస్తే…

ఒక్కసారి బాక్స్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత, మిగిలిన దానిని గరిష్టంగా.. 1 నెల నుంచి 2 నెలల్లోపు తినేయాలి.  అంతకంటే ఎక్కువ రోజులు దానిని నిల్వ ఉంచితే… దానిపై ఐస్ క్రిస్టల్స్ ఏర్పడుతాయి. అంతేకాదు.. ఐస్ క్రీమ్ రుచి కూడా తగ్గిపోతుంది. ఇలా మారిన దానిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Instant Curd: ఇంట్లో పెరుగు అయిపోయిందా? 15 నిమిషాల్లో పాలను పెరుగులా మార్చే టెక్నిక్ ఇది
Related image2
Curd: ఇడ్లీ, దోశ కాదు.. పరగడుపున పెరుగున్నం తింటే ఏమౌతుంది..?
34
ఐస్ క్రీమ్ ఎక్కడ స్టోర్ చేయాలి?
Image Credit : chatgpt

ఐస్ క్రీమ్ ఎక్కడ స్టోర్ చేయాలి?

చాలా మంది ఐస్ క్రీమ్ ని నార్మల్ ఫ్రిజర్ డోర్ లో పెడుతూ ఉంటారు. కానీ.. ఇది తప్పు. ఇలా స్టోర్ చేయకూడదు.  డోర్ పదే పదే తీయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. అందుకే.. ఐస్ క్రీమ్ పాడవ్వకుండా ఉండాలంటే..  ఫ్రీజర్ లో అది కూడా వెనక భాగంలో లోపల పెట్టాలి. అక్కడ టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది.  ఐస్ క్రీమ్ పాడవ్వకుండా ఉంటుంది.

ఓపెన్ చేసిన ఐస్ క్రీమ్ ను ఫ్రీజర్ లో పెట్టే ముందు ఒక ప్లాస్టిక్ కవర్ లేదా వాక్స్ పేపర్ ను ఐస్ క్రీమ్ పైన పెట్టి… ఆ తర్వాత మూత పెట్టాలి. ఇలా చేస్తే… ఐస్ క్రిస్టల్స్  ఏర్పడవు. ఐస్ క్రీమ్ పాడవ్వకుండా తాజాగా ఉంటుంది.

44
ఇలాంటి ఐస్ క్రీమ్ పొరపాటున కూడా తినొద్దు...
Image Credit : Gemini AI

ఇలాంటి ఐస్ క్రీమ్ పొరపాటున కూడా తినొద్దు...

ఐస్‌క్రీమ్ ఇతర ఆహారాల ఘాటైన వాసనలను సులభంగా పీల్చుకుంటుంది. అందుకే పచ్చి మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి వాటి పక్కన పెట్టొద్దు. ఒరిజినల్ బాక్స్ పగిలినా, దాన్ని వెంటనే గాలి చొరబడని (ఎయిర్-టైట్) డబ్బాలోకి మార్చండి.

ఐస్‌క్రీమ్‌పై మందపాటి మంచు పొర ఏర్పడినా, దాని రంగు, ఆకృతి మారినా, లేదా రుచిలో పులుపు లేదా వింతగా అనిపించినా వెంటనే దాన్ని పడేయండి. సరైన పద్ధతిలో నిల్వ చేస్తేనే ఐస్‌క్రీమ్‌ను పూర్తిగా ఆస్వాదించగలం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Instant Curd: ఇంట్లో పెరుగు అయిపోయిందా? 15 నిమిషాల్లో పాలను పెరుగులా మార్చే టెక్నిక్ ఇది
Recommended image2
Curd: ఇడ్లీ, దోశ కాదు.. పరగడుపున పెరుగున్నం తింటే ఏమౌతుంది..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved