Telugu

Bangle Designs: పట్టుచీరల మీదకు మీ మనసుదోచే గాజుల డిజైన్లు

Telugu

ముత్యాలు, కెంపులు..

నాలుగు వరుసల ముత్యాల అమరిక మధ్యలో ఎర్రటి కెంపులు, పచ్చలతో నిండిన ఈ గాజులు చాలా అందంగా ఉన్నాయి. నిజాం కాలం నాటి రాయల్ ఆభరణాలను తలపించే ఈ డిజైన్ పెళ్లికూతుళ్లకు అద్భుతంగా నప్పుతాయి.

Image credits: south india Jewels
Telugu

నక్షి బ్యాంగిల్స్

అద్భుతమైన యాంటిక్ ఫినిషింగ్‌తో కూడిన నక్షి కార్వింగ్ మధ్యలో తెల్లటి రాళ్ల చట్రంలో అమర్చిన చదరపు కెంపు, పచ్చ ఈ కడియాలకు ప్రత్యేకతను తెచ్చాయి. ఇవి చేతులకు నిండుగా కనిపిస్తాయి.

Image credits: south india Jewels
Telugu

క్లాసీ బ్యాంగిల్స్..

ముదురు ఆకుపచ్చని  గడులు, అంచుల వెంబడి తెల్లటి ముత్యాల వరుసతో పాటు మధ్యలో కొలువుదీరిన లక్ష్మీదేవి ప్రతిమ ఈ గాజులకు అద్భుతమైన శోభను ఇచ్చింది. ఫెస్టివల్ లుక్ ఇస్తాయి.

Image credits: south india Jewels
Telugu

నక్షి డిజైన్..

చుట్టూ బంగారు రవ్వల పూసలు, మధ్యలో గుండ్రటి రింగ్‌ల వంటి నక్షి డిజైన్‌తో పాటు కెంపులు, పచ్చలతో కూడిన పువ్వు ఆకృతి ఈ గాజులకు ఎంతో అందాన్ని ఇచ్చింది. క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: south india Jewels
Telugu

కెంపులు, పచ్చలతో...

ముత్యాలు, కెంపులు, పచ్చల కాంబినేషన్ లో ఈ గాజులు చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తాయి. చేతులకు చాలా అందంగా ఉంటాయి.

Image credits: south india Jewels
Telugu

ముత్యాల గాజులు..

మధ్యలో మూడు వరుసల తెల్లటి ముత్యాలు, చుట్టూ బంగారు పూసల డిజైన్‌తో ఈ గాజులు ఎంతో హుందాగా కనిపిస్తున్నాయి.చీరలమీదకు మంచి రాయల్ లుక్ ఇస్తాయి.

Image credits: south india Jewels
Telugu

ముత్యాల గాజులు..

ముత్యాల వరసతో మధ్యలో.. కెంపులతో పూల డిజైన్ లో ఉన్న ఈ గాజులు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. చేతులకు చాలా అందంగా కనపడతాయి.

Image credits: south india Jewels
Telugu

లక్ష్మీదేవి గాజులు..

చుట్టూ ముత్యాల వరస.. మధ్యలో లక్ష్మీదేవి ప్రతిమలతో ఈ గాజులు చాలా అందంగా ఉంటాయి. మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.

Image credits: south india Jewels

Fenugreek Water: ఉదయం కాదు.. రాత్రిపూట మెంతుల నీళ్లు తాగితే ఏమవుతుంది?

Blouse Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ బ్లౌజు డిజైన్లు..!

Saree Designs: మీ అందాన్ని మరింత పెంచే చీరలు.. ట్రై చేయకపోతే ఎలా?

Cooking Tips: డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇదొక్కటి వేస్తే పొగ రానే రాదు