MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Phone Charging: నైట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి పడుకునే అలవాటు మీకు ఉందా? జరిగేది ఇదే

Phone Charging: నైట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి పడుకునే అలవాటు మీకు ఉందా? జరిగేది ఇదే

 Phone Charging: మెలకువగా ఉన్నంతసేపు ఫోన్ చూసి..సరిగ్గా నిద్రపోయే సమయంలో చాలా మంది ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. అలా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి రాత్రంతా వదిలేస్తారు. ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 06 2026, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Phone Charging..
Image Credit : our own

Phone Charging..

మనలో చాలా మందికి రాత్రి పడుకునే ముందు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. పడుకునే ముందు ఛార్జింగ్ పెడితే.. ఉదయానికి ఫుల్ అవుతుంది కదా అని అనుకుంటారు. కానీ.. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో చాలా మందికి ఐడియా ఉండదు. మనం చేసే ఈ చిన్న పొరపాటు కారణంగా...మీ ఫోన్ పరిస్థితి ఎలా మారిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎక్కువ గంటలు ఛార్జింగ్ పెడితే జరిగేది ఇదే..
Image Credit : PINTEREST

ఎక్కువ గంటలు ఛార్జింగ్ పెడితే జరిగేది ఇదే..

ఎక్కువ గంటలు ఛార్జింగ్ పెడితే...ఎక్కువ గంటలు ఛార్జింగ్ ఉంటుంది అనుకోవడం పొరపాటు. ప్రతి స్మార్ట్ ఫోన్ బ్యాటరీని లిథియం- అయాన్ లేదా లిథియం- పాలిమర్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తారు. మనమేమో.. రాత్రి ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటామా.. అది ఒక గంటకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. కానీ.. మనం నిద్రలో ఉండటం వల్ల దానిని అన్ ప్లగ్ చేయం. కానీ.. ఫోన్ 100 శాతం ఛార్జ్ అయిన తర్వాత కూడా దానికి పవర్ సప్లై అవుతుంది అంటే.. ఫోన్ బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల ఫోన్ పనితీరు తగ్గడం మొదలౌతుంది. ఎన్నెన్ని వేలుపోసి కొన్నా కూడా ఫోన్ ఎందుకు తొందరగా పాడౌతుంది అంటే.. మనం చేసే ఈ తప్పే కారణం.

అంతేకాదు....మీ ఫోన్ ని రాత్రంతా ఛార్జింగ్ ఉంచడం వల్ల అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల మీ బ్యాటరీ పనితీరు తగ్గిపోవడమే కాకుండా.. లోపల ఉండే సర్క్యూట్ కూడా దెబ్బ తింటుంది. ఇక చాలా మంది ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఛార్జర్ ని వాడరు. అది తప్ప... ఫోన్ కి ఏది సెట్ అయితే.. ఆ ఛార్జర్ వాడేస్తూ ఉంటారు. దీని వల్ల అప్పుడప్పుడు స్మార్ట్ ఫోన్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

విద్యుత్ హెచ్చుతగ్గుల కారణంగా...

రాత్రిపూట పవర్ ఓల్టేజ్ అకస్మాత్తుగా పెరిగినా లేదా తగ్గినా అది ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, బ్యాటరీ లేదా మదర్ బోర్డుకు నష్టం కలిగిస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు పవర్ ఫ్లక్చువేషన్స్ ని మనం చెక్ చేయలేం కాబట్టి...ఆ సమయంలో ఛార్జింగ్ పెట్టి ఉంటే.. ఫోన్ పాడైపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

33
ఫోన్ ఛార్జింగ్ చేయడానికి సరైన పద్ధతి ఏంటి...?
Image Credit : others

ఫోన్ ఛార్జింగ్ చేయడానికి సరైన పద్ధతి ఏంటి...?

మీ ఫోన్ ను పదే పదే 100 శాతం ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ ను 80 శాతం వరకు ఛార్జ్ చేస్తే సరిపోతుంది. ప్రతిసారీ 100 శాతం ఛార్జ్ చేయక్కర్లేదు. 80 శాతం మాత్రమే ఛార్జ్ చేయడం వల్ల మీ ఫోన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఒకవేళ మీరు రాత్రిపూట ఛార్జింగ్ పెట్టాలి అనుకుంటే.. మీ బ్యాటరీ ఫుల్ అవ్వగానే.. చార్జింగ్ ఆటోమెటిక్ గా ఆగిపోయేలా స్మార్ట్ చార్జింగ్ ఫీచర్ ని ఉపయోగించడం ఉత్తమం. అంతేకాకుండా.. మీ ఫోన్ కొన్నప్పుడు వచ్చిన కేబుల్ తోనే ఛార్జింగ్ పెట్టాలి. అదేవిధంగా.. మీ ఫోన్ ని దిండు కింద లేదా దుప్పటి కింద దాచి ఛార్జింగ్ చేయకూడదు. మీ ఫోన్ వేడిగా మారింది అని మీకు అనిపిస్తే..ఫుల్ అవ్వకపోయినా ఛార్జింగ్ తీసేయాలి. ఫోన్ కి పగలు మాత్రమే ఛార్జింగ్ పెట్టండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదెక్కడి వింత ఆచారం! పెళ్లి తర్వాత వధూవరులు టాయిలెట్‌కు వెళ్లకూడదా!!
Recommended image2
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Related Stories
Recommended image1
రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? ‘ పెద్ది’ లో చూపించింది నిజమేనా?
Recommended image2
Alcohol: ఎలా పడితే అలా కాదు... మందు తాగేందుకు కూడా ఓ లెక్క ఉందండోయ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved