MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Alcohol: ఎలా పడితే అలా కాదు... మందు తాగేందుకు కూడా ఓ లెక్క ఉందండోయ్..!

Alcohol: ఎలా పడితే అలా కాదు... మందు తాగేందుకు కూడా ఓ లెక్క ఉందండోయ్..!

 Alcohol: మీకు మందు తాగే అలవాటు ఉందా? కానీ.. మందు తాగితే.. లివర్ డ్యామేజ్ అవుతుంది.. ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడుతున్నారా? కానీ.. మందు తాగే అలవాటు మాత్రం మానలేకపోతున్నారా? అయితే.. ఈ గోల్డెన్ రూల్ ఫాలో అవ్వండి.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 06 2026, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మందు తాగే అలవాటు ఉందా?
Image Credit : Getty

మందు తాగే అలవాటు ఉందా?

మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ విషయం అందరికీ తెలుసు. అంతెందుకు.. రోజూ మందు తాగే వాడికి కూడా ఈ విషయం తెలుసు. కానీ.. ఏం చేస్తాం.. అలవాటు అయిపోయింది.. రోజుకి రెండు పెగ్గులు పడకపోతే..నిద్ర పట్టదు.. పిచ్చెక్కి పోతుంది అనే సమాధానాలు చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉంటాం. నిజమే.. మద్యం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. కుదిరితే... ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడే మంచిది. కానీ.. తప్పదు మానేయలేకపోతున్నాం అంటే మాత్రం..ఒక గోల్డెన్ రూల్ ఫాలో అవ్వాలి. ఆ రూల్ ఫాలో అయితే... జరిగే డ్యామేజ్ కాస్త తక్కువగా ఉంటుంది. ఆ రూల్ ఏంటి? దానిని ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రముఖ టాలీవుడ్ నటుడు, డైరెక్టర్ హర్ష వర్థన్ తెలిసే ఉంటారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆల్కహాల్ గురించి మాట్లాడారు. హీరో నితిన్ కెరీర్ లో రెండు హిట్లు ఇచ్చిన వ్యక్తి ఈయన. తాను నితిన్ , వాళ్ల నాన్నతో కలిసి మందు తాగుతానని.. అయితే.. వాళ్ల నాన్నతో మందు తాగాలంటే ఒక రూల్ ఫాలో అవ్వాలి.. ఒక పెగ్గు మందు తాగాలంటే.. గ్లాసు నీరు తాగాలి. ఆ గ్లాసు వాటర్ తాగిన తర్వాతే.. ఇంకో పెగ్గు తాగాలి. ఇలా తాగితే.. లివర్ డ్యామేజ్ అవ్వదు..అని హర్షవర్థన్ చెప్పారు.. ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్ ఏంటి..?
Image Credit : unsplash

ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్ ఏంటి..?

2-2-2 ఈ రూల్ ఫాలో అయ్యి మందు తాగేవారికి తొందరగా ఆరోగ్య సమస్యలు రావు. ఈ రూల్ ఏంటి అంటే...ఒక వ్యక్తి ఒకేసారి రెండు పెగ్గుల కంటే ఎక్కువ మందు తాగకూడదు. ఆ రెండు పెగ్గులు కూడా కూడా వెంట వెంటనే తాగకూడదు. కనీసం రెండు గంటల సమయం తీసుకోవాలి. ఒక్కసారి మందు తాగితే.. మళ్లీ రెండు రోజుల వరకు ముట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల తీసుకున్న మందు నుంచి శరీరం కోలుకోవడానికి సమయం ఇస్తుంది. అంతేకాదు.. మందు తాగడానికి ముందు కనీసం రెండు గ్లాసుల మంచి నీరు తాగాలి. దీని వల్ల మందు తాగడం వల్ల వచ్చే డీ హైడ్రేషన్ సమస్య ఉండదు అని నిపుణులు చెబుతున్నారు.

33
  ఈ రూల్ ఫాలో అవ్వడం వల్ల ఏం జరుగుతుంది?
Image Credit : Getty

ఈ రూల్ ఫాలో అవ్వడం వల్ల ఏం జరుగుతుంది?

రెగ్యులర్ ఆల్కహాల్ తాగడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. చాలా మంది మందు తాగిన వెంటనే మాకు నిద్ర పట్టేస్తుంది అని అనుకుంటారు.కానీ.. వెంటనే నిద్ర వస్తుంది నిజమే కానీ.. అర్థరాత్రి మధ్యలో మెళకువ వచ్చేస్తూ ఉంటుంది. అదే ఈ 2-2-2 రూల్ ఫాలో అయితే... నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. చాలా మంది తాము సోషల్ డ్రింకర్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ, ఇదే తర్వాత అలవాటుగా మారే ప్రమాదం ఉంటుంది. ఒత్తిడి, ఇతర సమస్యలు ఉన్నప్పుడు మందు తాగడం మొదలుపెడితే దానికి బానిసలుగా మారతారు. అదే ఈ 222 రూల్ ఫాలో అయితే.. ఇలాంటి సమస్య ఉండదు. కాస్త కంట్రోల్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ రూల్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయితే.. నిద్ర సమస్య ఉండదు. శరీరం కోలుకోవడానికి సమయం ఇస్తుంది. పెద్దగా లివర్ మీద ఒత్తిడి పడే అవకాశం ఉండదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదెక్కడి వింత ఆచారం! పెళ్లి తర్వాత వధూవరులు టాయిలెట్‌కు వెళ్లకూడదా!!
Recommended image2
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Related Stories
Recommended image1
Lunch Box: హాట్ బాక్స్ కాదు.. ఈ లంచ్ బాక్స్ లో ఫుడ్ ఐదు గంటలైనా వేడి తగ్గదు, ఆఫీస్, స్కూల్ కి పర్ఫెక్ట్ ఆప్షన్..!
Recommended image2
రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? ‘ పెద్ది’ లో చూపించింది నిజమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved