MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Cucumber: రోజూ ఒక కీరదోస తింటే చాలు.. ఈ సమస్యలన్నీ దూరం! ఒక్కసారి ట్రై చేయండి

Cucumber: రోజూ ఒక కీరదోస తింటే చాలు.. ఈ సమస్యలన్నీ దూరం! ఒక్కసారి ట్రై చేయండి

Cucumber: మనం రోజూ తినే సాధారణ ఆహారాల్లో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిలో ముఖ్యమైంది కీరదోస. ఇందులో శరీరానికి అవసరమైన నీరు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నిపుణుల ప్రకారం రోజుకో కీరదోస తినడం వల్ల ఏ సమస్యలు తగ్గే అవకాశం ఉందో చూద్దాం

1 Min read
Author : Kavitha G
Published : Jun 26 2026, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోజుకో కీరదోస తినడం వల్ల కలిగే లాభాలు
Image Credit : Getty

రోజుకో కీరదోస తినడం వల్ల కలిగే లాభాలు

కీరదోస చాలా సింపుల్‌గా కనిపించే కూరగాయ అయినా, ఆరోగ్య పరంగా ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇందులో దాదాపు 95 శాతం వరకు నీరు ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కీరదోసలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మంపై వచ్చే మచ్చలు, డల్ స్కిన్, పింపుల్స్ వంటి సమస్యలను తగ్గించడంలో కీరదోస ఎంతో సహాయపడుతుంది. రోజూ కీరదోస తినడం వల్ల చర్మం సహజంగా ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గట్ హెల్త్ కి మేలు
Image Credit : Getty

గట్ హెల్త్ కి మేలు

కీరదోసలో ఉండే ఫైబర్ గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. చాలామంది డాక్టర్లు సహజమైన ఫైబర్ కోసం కీరదోసను తినమని చెబుతుంటారు. కీరదోస జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.

Related Articles

Related image1
Banana: రోజూ ఒక అరటిపండు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
Related image2
Pomegranate: రోజూ ఒక దానిమ్మ తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
35
బరువు తగ్గడానికి
Image Credit : Getty

బరువు తగ్గడానికి

బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉండటంతో పాటు ఎక్కువ సేపు పొట్ట నిండిన భావన ఇస్తుంది. దీనివల్ల ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది. నార్మల్ స్నాక్స్‌కు బదులుగా కీరదోస ముక్కలు తీసుకుంటే హెల్తీగా ఉండటమే కాకుండా బరువు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

45
విషపదార్థాల తొలగింపు
Image Credit : Getty

విషపదార్థాల తొలగింపు

కీరదోస ఒక సహజ డిటాక్స్ ఫుడ్‌గా పనిచేస్తుంది. రోజూ కీరదోస తినడం వల్ల కిడ్నీ ఫంక్షన్ మెరుగుపడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యూరిన్ ప్రొడక్షన్‌ను ప్రోత్సహిస్తుంది. అయితే కీరదోస ఎక్కువగా తినడం కూడా మంచిదికాదు. కొంతమందికి గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. కాబట్టి మితంగా తీసుకోవాలి.

55
బీపీ కంట్రోల్
Image Credit : Getty

బీపీ కంట్రోల్

గుండె ఆరోగ్యానికి కూడా కీరదోస మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హై బీపీతో బాధపడేవారికి ఇది సహజ ఆహారంగా పనిచేస్తుంది. అయితే, ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: ప్రతి తల్లీ తన కొడుకుకి చెప్పాల్సిన 7 విషయాలు ఇవి
Recommended image2
Dosa: డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశె.. దీన్ని చేయడం వెరీ ఈజీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి స్పెషల్
Recommended image3
Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Related Stories
Recommended image1
Banana: రోజూ ఒక అరటిపండు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
Recommended image2
Pomegranate: రోజూ ఒక దానిమ్మ తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved