MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Paneer: మీరు తినే పనీర్ లో కల్తీ జరిగిందా? ఎలా గుర్తించాలో తెలుసా?

Paneer: మీరు తినే పనీర్ లో కల్తీ జరిగిందా? ఎలా గుర్తించాలో తెలుసా?

Paneer: ప్రోటీన్ కోసం పనీర్ తీసుకుంటున్నారా? కానీ, మీరు తినే పనీర్ స్వచ్ఛమైనదేనా? లేక కల్తీ జరిగిందా? తెలుసుకోలేకపోతున్నారా? ఇంట్లో నే సింపుల్ చిట్కాలతోనే గుర్తించొచ్చని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 08 2026, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మీరు తినే పనీర్ స్వచ్ఛమైనదేనా?
Image Credit : Getty

మీరు తినే పనీర్ స్వచ్ఛమైనదేనా?

పనీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పనీర్ తో లభిస్తుంది. అందుకే రెగ్యులర్ గా చాలా మంది పనీర్ ని ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటారు. కానీ, మార్కెట్ లో మనం కొనే పనీర్ స్వచ్ఛమైనదా కాదా? లేక అందులో ఏదైనా కల్తీ జరిగిందా తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

పనీర్ ని సాధారణంగా పాలతో తయారు చేస్తారు. కానీ, ఈ మధ్యకాలంలో మార్కెట్ లో లభించే పనీర్ పూర్తిగా పాలతో చేయడం లేదు. దాంట్లో స్టార్చ్ లేదా ఇతర అనవసరమైన పదార్థాలను కలిపి అమ్మేస్తున్నారు. అది చూడటానికి స్వచ్ఛమైన పనీర్ లానే కనిపిస్తుంది. దీంతో.. స్వచ్ఛమైనదే అనుకొని మనం కూడా తినేస్తుం. మరి, కల్తీని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.చేతితో నొక్కి చూడండి..
Image Credit : Getty

1.చేతితో నొక్కి చూడండి..

చిన్న పనీర్ ముక్కను తీసుకొని వేళ్లతో మెల్లగా నొక్కి చూడండి. స్వచ్ఛమైన పనీర్ అయితే.. చేతితో నొక్కినప్పుడు మెత్తగా ఉంటుంది.సులభంగా విరుగుతుంది. అలా కాకుండా.. నొక్కినప్పుడు రబ్బరులా సాగుతూ, స్పాంజ్ లా అనిపించింది అంటే.. అందులో కల్తీ జరిగిందని అర్థం. ఇలాంటి పనీర్ తినకపోవడమే మంచిది.

2. వండే ముందు వాసన చూడండి

తాజా పనీర్‌కు సాధారణంగా తేలికపాటి పాల వాసన ఉంటుంది. అది సహజంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.పనీర్‌ నుంచి తీవ్రమైన పుల్లటి వాసన, రసాయనాల్లాంటి వాసన లేదా అసహజమైన దుర్వాసన వస్తే దాన్ని ఉపయోగించకుండా ఉండటం మంచిది. ఇలాంటి వాసన కల్తీకి మాత్రమే కాకుండా పనీర్‌ పాడైపోయిందనడానికి కూడా సంకేతం కావచ్చు.

33
3. అయోడిన్ టెస్ట్‌..
Image Credit : Getty

3. అయోడిన్ టెస్ట్‌..

పనీర్‌లో స్టార్చ్ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అయోడిన్ టెస్ట్ చేయడం బెటర్.చిన్న పనీర్‌ ముక్కను నీటిలో ఉడికించి చల్లారిన తర్వాత దానిపై కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణం వేస్తే, అది నీలం లేదా నలుపు రంగులోకి మారితే స్టార్చ్ ఉండే అవకాశం ఉందని చెబుతారు. అందులో కల్తీ జరిగిందని గుర్తించొచ్చు.

4. పెనంపై వేడి చేసి చూడండి

చిన్న పనీర్‌ ముక్కను నూనె వేయకుండా వేడి పెనంపై ఉంచి గమనించవచ్చు. నాణ్యమైన పనీర్‌ వేడెక్కినప్పుడు సాధారణంగా పాల ఉత్పత్తికి సంబంధించిన సహజమైన వాసనతో మెత్తగా మారుతుంది. అయితే పనీర్‌ అసహజంగా రబ్బర్‌లా మారడం, తీవ్రమైన వాసన రావడం లేదా అసాధారణంగా ఎక్కువ నూనె బయటకు రావడం కనిపిస్తే దాని నాణ్యతను ఒకసారి పరిశీలించండి.

5. గోరువెచ్చని నీటిలో వేసి చూడండి

చిన్న పనీర్‌ ముక్కను గోరువెచ్చని నీటిలో వేసి కొంతసేపు గమనించవచ్చు. పనీర్‌ వెంటనే ఆకారం కోల్పోవడం, అసాధారణంగా కరిగిపోవడం లేదా నీటిలో ఎక్కువ అవశేషాలు కనిపించడం జరిగితే అందులో కల్తీ జరిగిందని గుర్తించొచ్చు.

ఇంట్లో పరీక్షలు చేయడం కంటే నమ్మకమైన బ్రాండ్‌ లేదా విశ్వసనీయమైన విక్రేత నుంచి పనీర్‌ కొనడం మరింత ముఖ్యం. ప్యాక్‌ చేసిన పనీర్‌ అయితే తయారీ తేదీ, గడువు తేదీ, పదార్థాల జాబితా, ప్యాకేజింగ్‌ సరిగ్గా ఉందో లేదో పరిశీలించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: క్రౌన్ షేప్ గోల్డ్ రింగ్.. రాణి లాంటి లుక్ మీ సొంతం!
Recommended image2
Ginger Garlic Paste: ఇదొక్కటి కలిపితే... అల్లం వెల్లుల్లి పేస్టు 6 నెలలైనా ఫ్రెష్ గా ఉంటుంది..!
Recommended image3
Paya: చిక్కటి మటన్ పాయా ఇలా వండారంటే ఎవరైనా ఇష్టంగా తింటారు.. ఇడ్లీ, దోశెతో అదిరిపోతుంది
Related Stories
Recommended image1
Mutton: మటన్ ఉడికేటప్పుడు ఇదొక్కటి వేస్తే.. కూర ముదిరినా కూడా నిమిషాల్లో ఉడికిపోతుంది..!
Recommended image2
Crispy Dosa: పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక్కటి వేస్తే.. దోశలు ఎర్రగా, క్రిస్పీగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved