MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Tea: నెల రోజులు టీ తాగడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుంది?

Tea: నెల రోజులు టీ తాగడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుంది?

Tea: ఉదయం లేవగానే టీ తాగకుండా ఉండలేరా? టీ తాగకపోతే తల నొప్పి వస్తుందా? టీకి పూర్తిగా బానిసలుగా మారిపోయారా?  అయితే.. నెల రోజుల పాటు టీ తాగకపోతే ఏమౌతుంది? శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి.. ఆరోగ్యానికి మంచిదా? కాదా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 31 2026, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టీ తాగే అలవాటు ఉందా?
Image Credit : Asianet News

టీ తాగే అలవాటు ఉందా?

మనలో చాలా మందికి ఉదయం నిద్రలేవగానే చేతిలో ఒక కప్పు వేడి వేడి టీ ఉండాల్సిందే. టీ తాగిన తర్వాతే ఏ పని అయినా మొదలుపెడతారు. ఉదయాన్నే టీ తాగకపోతే.. వారు ఏదో కోల్పోయినట్లు ఫీలౌతూ ఉంటారు. మరి కొందరు అయితే.. ఉదయం మాత్రమే కాదు.. మధ్యాహ్నం, సాయంత్రం కూడా టీ తాగుతూ ఉంటారు. కానీ, ఎప్పుడైనా ఆలోచించారా? టీ తాగకుండా ఒక్క పూట కూడా ఉండలేని వాళ్లు.. ఆ టీని కనీసం 30 రోజుల పాటు తాగకుండా ఉంటే ఏం జరుగుతుందో? మన శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. అవేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టీ మానేసిన మొదటి వారం..
Image Credit : Getty

టీ మానేసిన మొదటి వారం..

రోజూ టీ తాగే అలవాటు ఉన్నవారికి సడెన్ గా ఒక్క రోజు టీ మానేస్తే.. మొదటి మూడు, నాలుగు రోజులు చాలా కష్టంగా అనిపిస్తుంది. మన శరీరం టీలోని కెఫీన్ కి అలవాటు పడి ఉంటుంది. సడెన్ గా టీ తాగడం ఆపడం వల్ల.. తలనొప్పి, అలసట, పని మీద ఏకాగ్రత తగ్గడం, చిరాకు లాంటివి కలుగుతాయి. వైద్య పరిభాషలో దీనిని కెఫిన్ విత్ డ్రాయల్ అంటారు. కానీ, మీరు వెంటనే కంగారు పడి మళ్లీ టీ తాగడం మొదలుపెట్టద్దు. ఒక వారం ఓపిక పడితే... ఈ లక్షణాలు అన్నీ తగ్గిపోతాయి.

రెండో వారంలో మార్పులు..

చాలా మందికి పరగడుపున టీ తాగే అలవాటు ఉంటుంది. దీని వల్ల కడుపులో ఎసిడిటీ, గుండెల్లో మంట, జీర్ణాశయ సంబంధిత సమస్యలు రావచ్చు. కానీ, ఈ టీ తాగడం మానేసిన తర్వాత మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీకు కడుపు ఉబ్బరం తగ్గుతుంది. కడుపుకు హాయిగా అనిపిస్తుంది.

33
మూడో వారంలో మంచి నిద్ర...
Image Credit : Asianet News

మూడో వారంలో మంచి నిద్ర...

టీలోని కెఫీన్ మన మెదడును చురుకుగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల నిద్రపోవడం కష్టంగా ఉంటుంది, ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రిపూట టీ తాగేవారికి రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. మీరు కనుక టీ తాగడం మానేస్తే, మీ నిద్ర నాణ్యత పెరుగుతుంది. గాఢ నిద్ర కారణంగా మరుసటి ఉదయం మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు.

చెక్కర వాడకం తగ్గడం..

మనం టీ తాగేటప్పుడు, దానితో పాటు కనీసం రెండు నుంచి మూడు చెంచాల చక్కెరను తీసుకుంటాము. మనం రోజుకు మూడుసార్లు టీ తాగితే, తెలియకుండానే మన శరీరానికి ఎక్కువ కేలరీలు అందిస్తున్నామని అర్థం. మనం టీ మానేసినప్పుడు, చక్కెర వాడకం కూడా ఆగిపోతుంది. ఇది మీ బరువును అదుపులో ఉంచడానికి ,చర్మపు కాంతిని పెంచడానికి సహాయపడుతుంది.

టీ ఆరోగ్యానికి మంచిది కాదా?

టీ పూర్తిగా ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పడం లేదు. ఎందుకంటే.. టీలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. కానీ అసలు సమస్య దానిని 'అతిగా' తీసుకోవడంలోనే ఉంది. రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు, మితమైన చక్కెరతో తాగడం హానికరం కాదు. కానీ మీరు టీకి బానిస అయితే,ఒక నెల పాటు దానిని తాగకుండా పక్కన పెడితే.. బాడీ డీటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది.

అయితే...మీరు టీ మానేయాలని నిర్ణయించుకుంటే, ఒకేసారి పూర్తిగా ఆపకుండా క్రమంగా దాని పరిమాణాన్ని తగ్గించండి. టీకి బదులుగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లేదా హెర్బల్ టీ వంటివి ప్రయత్నించండి. మీ లైఫ్ స్టైల్ లో చేసుకునే ఈ చిన్న చిన్న మార్పులు.. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mutton: చలికాలంలోనే మటన్ ఎందుకు ఎక్కువ రుచిగా ఉంటుంది..? అసలు కారణం ఇదే..!
Recommended image2
Jowar Roti: జొన్న రొట్టె రోజూ తింటున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!
Recommended image3
Kiwi: కివీని ఎలా తింటున్నారు? ఇలా మాత్రం తినకండి, నిపుణులు ఏం చెప్తున్నారంటే?
Related Stories
Recommended image1
Chips Packet:ఎంత మోసం..! చిప్స్ ప్యాకెట్ లో సగం చిప్స్ ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే
Recommended image2
Masala Spices: ఇక్కడ బిర్యానీ మసాలాలు చాలా చీప్ గా దొరుకుతాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved