MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Alia Bhatt Diet Secret: సెలబ్రిటీ డైట్ అంటే ఇదేనా? ఆలియా భట్ ఫుడ్ ఛాయిస్ ఇదే

Alia Bhatt Diet Secret: సెలబ్రిటీ డైట్ అంటే ఇదేనా? ఆలియా భట్ ఫుడ్ ఛాయిస్ ఇదే

Alia Bhatt Diet Secret: సెలబ్రిటీలు ఏం తింటారు? ఫిట్‌గా ఉండటానికి ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? ఇలాంటి విషయాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అయితే బాలీవుడ్ నటి ఆలియా భట్ ఫుడ్ విషయంలో ప్రెజెంట్ ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 28 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆలియా ఫుడ్ ఛాయిస్ చూస్తే ఆశ్చర్యపోతారు
Image Credit : Filmfare/instagram

ఆలియా ఫుడ్ ఛాయిస్ చూస్తే ఆశ్చర్యపోతారు

సెలబ్రిటీలు ఫిట్‌నెస్ కోసం కఠినమైన డైట్‌లు పాటిస్తారని, నచ్చిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారని చాలామంది అనుకుంటారు. కానీ బాలీవుడ్ నటి ఆలియా భట్ ఆహారపు అలవాట్లు మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి. ఆమెకు ఇష్టమైన వంటకాల గురించి తెలిస్తే.. ఆమె ఫుడ్ ఛాయిస్ ఎంత సింపుల్ గా ఉంటుందో అర్థమవుతుంది. పోహా, మజ్జిగ తనకు ఎంతో ఇష్టమని గతంలో చెప్పారు. ఒకవేళ జీవితాంతం ఒకే ఆహారం తినాల్సి వస్తే పోహా, మజ్జిగనే ఎంచుకుంటానని అన్నారు.

ఇక ఇంట్లో చేసే పప్పు అన్నం, కూరలు కూడా ఆమెకు ఇష్టమైనవే. బెండకాయ కూర, టమాటా కూర, తాలింపు పెరుగు.. ఆమె ఫుడ్ లిస్ట్‌లో ఉన్నాయి. ఖరీదైన రెస్టారెంట్లలో దొరికే వంటకాలే సెలబ్రిటీలకు ఇష్టమని చాలా మంది అనుకుంటారు కానీ... ఆలియా ఫుడ్ ఛాయిస్ చూస్తే...ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చాక్లెట్, ఫ్రెంచ్ ఫ్రైస్‌ లాగించేస్తారు
Image Credit : instagram

చాక్లెట్, ఫ్రెంచ్ ఫ్రైస్‌ లాగించేస్తారు

ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే ఆలియా భట్.. తనకు నచ్చిన ఆహార పదార్థాలన్నింటినీ దూరం పెట్టరు. చాక్లెట్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్పఘెట్టి వంటి వంటలంటే ఆమెకు ఇష్టం. బంగాళాదుంపలపై తనకున్న ఇష్టాన్ని కూడా ఆమె సరదాగా పంచుకున్నారు. చిన్నతనంలో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఆమెను ‘ఆలూ’ అని పిలిచేవారట. బీట్‌రూట్ సలాడ్, చియా పుడ్డింగ్ వంటి వంటలతో ట్రెండ్‌లో నిలిచిన ఆమె.. పోహా, పప్పు అన్నం, చాక్లెట్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి సాధారణ ఫుడ్ ని కూడా ఇష్టపడతారట.

34
సోషల్ మీడియాలో ఆలియా ఫుడ్ ట్రెండ్!
Image Credit : Instagram

సోషల్ మీడియాలో ఆలియా ఫుడ్ ట్రెండ్!

ఆలియా భట్ సినిమాలతోనే కాదు.. తన ఫిట్‌నెస్, జీవనశైలి, ఆహారపు అలవాట్లతోనూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆమెకు సంబంధించిన బీట్‌రూట్ సలాడ్, చియా పుడ్డింగ్ వంటకాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది వాటిపై ఆసక్తి చూపించారు. దీంతో ఆమె ఫుడ్ ఛాయిస్ మీద బోలెడు చర్చలు కూడా జరిగాయి.

ఆలియా భట్ ఆహారపు అలవాట్లలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఒకవైపు ఆరోగ్యకరమైన ఆహారంపై శ్రద్ధ, మరోవైపు తనకు ఇష్టమైన వంటను దూరం పెట్టలేదు. చాలామంది ఫిట్‌నెస్ కోసం డైట్ మొదలుపెట్టగానే తమకు నచ్చిన పదార్థాలన్నింటినీ మానేయాలని భావిస్తారు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఇష్టమైన వంటకాలను పూర్తిగా వదిలేయడమేనా? అనేదే ఇక్కడ అసలు ప్రశ్న.

పోషకాలు అందించే ఆహారాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో..ఆహారం పట్ల అతిగా ఆందోళన చెందకుండా, దాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. అయితే ఏం తినాలి, ఎంత తినాలి అనేది వ్యక్తి శరీరం అవసరాలు, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

44
ఆలియా డైట్‌ను ఫాలో అవ్వొచ్చా?
Image Credit : instagram

ఆలియా డైట్‌ను ఫాలో అవ్వొచ్చా?

ఆలియా భట్ ఏం తింటారనే ఆసక్తి ఉండొచ్చు. కానీ ఆమె ఫుడ్ లిస్ట్‌ను చూసి అదే డైట్‌ను అనుసరించడం మాత్రం సరైన పద్ధతి కాదు. సినిమా షూటింగులు, వ్యాయామం, వ్యక్తిగత జీవనశైలి.. ఇలా ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి. అందుకే సెలబ్రిటీల ఆహారపు అలవాట్ల నుంచి స్ఫూర్తి పొందొచ్చు గానీ..శరీరానికి ఏది అవసరమో దానికి అనుగుణంగానే ఆహారాన్ని ఎంచుకోవాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
వినోదం
జీవనశైలి
 

Latest Videos
Related Stories
Recommended image1
Milk Cake: కేవలం ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు..నోట్లో కరిగిపోయే మిల్క్ కేక్ రెడీ
Recommended image2
Kulcha Capital: మనదేశంలో ‘కుల్చా క్యాపిటల్‌’గా పేరొందిన నగరమేదో తెలుసా? వరల్డ్ వైడ్ ఫేమస్ ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved