Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఆ సమయంలో నిద్రపోతే ఈజీగా తగ్గుతారట..
Weight Loss Tips: పడకగదిలో ఓ గంట సేపు ఎక్స్ ట్రాగా నిద్రపోతే చాలు ఈజీగా బరువు తగ్గుతారని University of Chicago సైంటిస్టులు కనుగొన్నారు. అవును వెయిల్ లాస్ అవ్వాలనుకునే వారు రాత్రి పూట మరో గంట ఎక్స్ ట్రాగా పడుకోవడంతో తక్కువగా తింటారట. దీనివల్ల వెయిట్ లాస్ అయ్యే అవకాశముందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువున్న వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడాలని వ్యాయామాలను, చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయినా కొందరిలో ఎటువంటి ఫలితం కనిపించదు.
అయితే University of Chicago, University of Wisconsin-Madison అధ్యయనం అధిక బరువు సమస్యతో బాధపడేవారికి చక్కటి పరిష్కారం కనుగొన్నది. ఈ అధ్యయనం ప్రకారం.. బరువు తగ్గాలనుకునే వారు రాత్రి సమయంలో ఓ గంట ఎక్కువ సేపు పడుకుంటే చాలని చెబుతోంది. ఏంటీ.. ఎక్స్ ట్రా గంటసేపు పడుకుంటే బరువు తగ్గుతారా? అని ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇది నూటికి నూరుపాళ్లూ నిజమని ఈ అధ్యయనం పేర్కొంటోంది.
వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు రాత్రి సమయం ఓ గంటపాటు ఎక్స్ ట్రాగా పడుకోవడం వల్ల వారు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా పడుకునే కొంతమంది ఒక్క రోజుకు 270 కేలరీల ఆహారాన్ని తగ్గించారట. ఇకపోతే మరికొంతమందేమో ఇలా పడుకోవడం వల్ల రోజుకు 500 కేలరీల ఆహారాన్నితీసుకోవడం తగ్గించారని అధ్యయనం పేర్కొంటోంది.
కాగా ఇలా నిద్రపోయి రోజుకు 270 క్యాలరీల ఆహారాన్ని తగ్గించేవారు.. మూడేండ్లలో దాదాపుగా 13 కిలోల బరువును ఇట్టే కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. అయితే నిద్ర తగ్గిస్తే మాత్రం ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. కాగా తాజా అధ్యయనం ప్రకారం.. నిద్రపోయే సమయాన్ని ఓ గంట పెంచితే తక్కువగా తినే అవకాశముందని తేల్చి చెప్పింది. అందుకే నిద్రపోయే సమయాన్ని గంటపాటు పెంచండి. అప్పుడే మీరు బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
కంటినిండా నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఊకాయులు సరిపడా నిద్రపోతే వారి ఆకలిని నియంత్రించే ఘ్రెలిన్ అనే హార్మోన్ తగ్గుతుందట. అంతేకాదు దీనివల్ల మెదడులో ఆకలిని నియంత్రించే మార్పులు చోటుచేసుకుంటాయని పరిశోధకులు కనుగొన్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కంటినిండా నిద్రపోండని నిపుణులు సూచిస్తున్నారు.