Weight loss tips: ఇలా చేశారంటే 1 నెలలోనే 8 కిలోల బరువు తగ్గుతారు తెలుసా..!
Weight loss tips: బరువు పెరగడం చాలా సులువు కానీ.. తగ్గడం మాత్రం అంత ఈజీ కాదు. ఇందుకోసం ఎన్నో చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ను పాటిస్తే.. కేవలం 1 నెలలోనే 8 కిలోల బరువు తగ్గుతారంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Weight loss tips: ఈ రోజుల్లో ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారింది. అందులోనూ ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారి తీస్తుంది. అటువంటి పరిస్థితిలో.. తమను తాము ఫిట్ గా ఉంచుకోవడానికి ఏమి చేయాలో సరిగ్గా చాలా మందికి తెలియదు. ముఖ్యంగా బరువు తగ్గాలని గంటల తరబడి జిమ్ లో వ్యాయామం చేస్తుంటారు. తినడం, తాగటం మానేస్తుంటారు. అయినా బరువు పెరుగుతుంటారు కానీ తగ్గను మాత్రం తగ్గరు. అటువంటి పరిస్థితిలో ఒక నెలలోపు మీరు 8 కిలోల బరువు తగ్గడానికి 6 సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
నీళ్లను ఎక్కువగా తాగాలి: నీళ్లు మనల్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి పని చేయడమే కాకుండా.. బరువు తగ్గడానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన కొవ్వు బర్నర్. ఇందుకోసం మీరు సరైన సమయంలో నీటిని తాగాలి. ఇందుకోసం ఉదయాన్నే లేచిన వెంటనే రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే తినడానికి 1 గంట ముందు 500 మిల్లీ లీటర్ల నీటిని తాగాలి. తిన్న 1 గంట తర్వాత 500 మిల్లీలీటర్ల నీళ్లను తాగాలి. ఇలా తాగితే మీరు 1 నెలలో 3 కిలోల బరువును తగ్గుతారు.
వ్యాయామం: బరువు తగ్గడానికి వ్యాయామం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు జిమ్ కు వెళ్లి పెద్ద పెద్ద డంబెల్స్ లేదా యంత్రాలపై వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. దీని కోసం మీరు కార్డియో వ్యాయామాలు చేయవచ్చు. ఇందుకోసం శిక్షణ కూడా తీసుకోవచ్చు. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివన్నీ మీ వ్యాయామంలో పక్కాగా ఉండాలి. మీరు ప్రతి వారం 140 నిమిషాలు వ్యాయామం చేయాలి.
చిన్న చిన్న పనులకు కూడా బైక్ లపై వెళ్లే అలవాటు చాలా మందికి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు ఈ అలవాటును మార్చుకోవాలి. మీ చుట్టు పక్కల ఏదైనా పని పడ్డప్పుడు మీరు టూ వీలర్ పై కాకుండా.. నడుచుకుంటూ వెళ్లండి. ప్రతిరోజూ 30 నిమిషాలు నడిచినా మీరు 150 కేలరీల వరకు బర్న్ చేయవచ్చు. 3 రోజుల్లో 500 గ్రాముల వరకు కోల్పోవచ్చు.
లీన్ ప్రోటీన్ ను డైట్ లో చేర్చండి: మీ డైట్ లో లీన్ ప్రోటీన్ (Lean protein) ని చేర్చండి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు 1 రోజులో 70 నుంచి 115 గ్రాముల లీన్ ప్రోటీన్ తీసుకోవచ్చు. ఇందులో గుడ్డు, టోఫు, సీ ఫుడ్స్, చికెన్ ఉన్నాయి.
గ్రీన్ టీ (Green tea): గ్రీన్ టీలో కెఫిన్, కాటెచిన్ గాలేట్ అధికంగా ఉంటాయి. ఈ రెండూ మీ శరీర కొవ్వును కరిగించడానికి, జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడతాయి. రోజూ మూడు నుంచి నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల 100 క్యాలరీల వరకు బర్న్ అవుతుంది. 5 రోజుల్లో అర కిలో బరువు తగ్గుతారు.
తినడానికి ముందు ఆహారాన్ని వాసన చూడటం వల్ల మీ ఆకలి తగ్గుతుందని, మీరు తక్కువ తినడానికి మరియు ఎక్కువ బరువు తగ్గుతారని ఒక పరిశోధన కనుగొంది. ఆపిల్, అరటిపండ్లు, పుదీనా, వెల్లుల్లి మరియు ఆలివ్ ఆయిల్ వంటి వాసన వచ్చే ఆహారాలను తినడానికి ముందు మీరు వాసన చూడండి.