Kitchen Hacks: నూనె తక్కువ వాడినా వంట రుచిగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?
మనం మన వంట చేసే విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే..ఏ వంట అయినా ఆరోగ్యంగానూ అదేవిధంగా రుచిగా కూడా మార్చుకోవచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తక్కువ నూనెతో రుచికరమైన వంట..
వంట చేయడానికి వంట నూనె చాలా అవసరం.అయితే.. ఎక్కువ నూనె ఉపయోగించి చేసిన వంటలు తినడం వల్ల అధిక బరువు సమస్య రావడమే కాకుండా.. గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు.. అనేక ఆరోగ్య సమస్యలు పిలవకుండానే వచ్చేస్తాయి. అందుకే.. మనం వంటకు ఉపయోగించే నూనె విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా చెబుతుంటారు. చాలా కొద్ది నూనె మాత్రమే వాడి వంట చేయాలని చెబుతుంటారు. కానీ, నూనె తక్కువ వస్తే వంటకు రుచి ఎక్కడి నుంచి వస్తుంది..? రుచిగా లేకపోతే ఎలా తింటాం అని చాలా మంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ, నూనె ఎక్కువగా వాడకపోయినా కూడా వంట చాలా రుచిగా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
డీప్ ఫ్రై వద్దే వద్దు..
మనలో చాలా మంది రుచి, ఆరోగ్యం విషయానికి వస్తే.. ఎక్కువ మంది రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఉన్నది ఒకే ఒక్క జీవితం.. రుచిగా భోజనం చేయకపోతే ఈ లైఫ్ ఇంకెందుకు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, మనం మన వంట చేసే విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే..ఏ వంట అయినా ఆరోగ్యంగానూ అదేవిధంగా రుచిగా కూడా మార్చుకోవచ్చు.
మీరు మీ ఆహారంలో నూనె మొత్తాన్ని తగ్గించాలనుకుంటే, మీ వంట పద్ధతులను కూడా మార్చుకోండి. ఉదాహరణకు, మీ ఆహారాన్ని డీప్-ఫ్రై చేయడానికి బదులుగా, దానిని ఎయిర్ ఫ్రై చేయండి. దీనితో పాటు, వంట కోసం బేకింగ్, గ్రిల్లింగ్ లేదా స్టీమింగ్ ఉపయోగించండి. ఇది ఆహారంలోని నూనెను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. మీరు రుచిలో రాజీ పడాల్సిన అవసరం కూడా రాదు.
నూనెకు బదులుగా నీరు లేదా పాల ఉత్పత్తులను వాడండి
మనం సాధారణంగా మన ఆహారాన్ని నూనెలో వేయించుకుంటాము, కానీ మీరు ఆరోగ్యకరమైన ఎంపిక కోసం చూస్తున్నట్లయితే, ఆహారాన్ని నీరు, కూరగాయల రసం లేదా పాల ఉత్పత్తులతో వేయించాలి. ఉల్లిపాయలు, టమోటాలు, వెల్లుల్లిని మృదువుగా చేయడానికి, త్వరగా ఉడకడానికి నీరు సహాయపడుతుంది. మరోవైపు, కూరగాయల రసం ఆహారాన్ని ఆరోగ్యంగా, రుచికరంగా చేస్తుంది. అదేవిధంగా, పెరుగు లేదా మజ్జిగ నూనె లేకుండా కూరకు క్రీమీ ఆకృతిని ఇస్తుంది. మీరు దక్షిణ భారత వంటకం తయారు చేస్తుంటే, నూనె, నెయ్యికి బదులుగా కొబ్బరి పాలను ఉపయోగించండి.
ఆయిల్ స్ప్రే లేదా బ్రష్ ఉపయోగించండి
మీ ఆహారంలో నూనెను తగ్గించడానికి ఇది చాలా సులభమైన మార్గం. బాటిల్ నుండి నేరుగా నూనెను జోడించే బదులు ఎల్లప్పుడూ ఆయిల్ స్ప్రే లేదా బ్రష్ ఉపయోగించండి.అప్పుడు తక్కువ నూనె ఉపయోగించలం. ఏదైనా వంటకు మీరు నాలుగు స్పూన్ల నూనె అవసరం అనుకుంటే.. దాని ప్లేస్ లో రెండు స్పూన్ల నూనె వాడండి.