MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Home Remedies: పగిలిన పాదాలను మృదువుగా మార్చుకోవాలా? అయితే ఈ హోంమేడ్ క్రీమ్ వాడండి

Home Remedies: పగిలిన పాదాలను మృదువుగా మార్చుకోవాలా? అయితే ఈ హోంమేడ్ క్రీమ్ వాడండి

Home Remedies: వేసవికాలం రాగానే పాదాల మడమలు పొడిబారిపోతాయి. పగుళ్ళు వచ్చేస్తాయి. దీనివల్ల మంట, నొప్పి ఇలా ఎన్నో బాధలు. ఇంట్లోనే ఫుట్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడితే పాదాలు మృదువుగా మారిపోతాయి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 06 2026, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పాదాల క్రీమ్
Image Credit : Getty

పాదాల క్రీమ్

వేసవి కాలం రావడంతోనే కొన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పాదాల సంరక్షణ కష్టమైపోతుంది. దుమ్ము, వేడి, చెమట పాదాలు అతుక్కుని మడమలు పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. మహిళలు ముఖ్యంగా ఈ సమస్యతో ఇబ్బంది పడతారు. పాదాల పగుళ్ళతో మీరు బాధపడుతుంటే కష్టపడక్కర్లేదు. ఇంట్లోనే హోమ్ మేడ్ క్రీమ్ తయారు చేసుకొని దాన్ని ప్రతిరోజు పాదాలకు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆ క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తయారీ ఇలా
Image Credit : Getty

తయారీ ఇలా

పగిలిన మడమలకు హోంమేడ్ క్రీమ్ తయారీకి కావలసిన పదార్థాలు కలబంద జెల్, ఆవనూనె, బంగాళదుంప జ్యూసు, గ్లిజరిన్ వీటిని తీసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కలబంద జెల్ వేయాలి. అందులోనే బంగాళదుంప రసం, ఆవనూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇది మరీ చిక్కగా ఉండకూడదు. క్రీమ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. దీన్ని గాలి చొరబడి డబ్బాలో వేసి నిల్వ చేసుకోండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పగిలిన పాదాలకు దీన్ని రాసి మసాజ్ చేస్తూ ఉండండి. ఇది చాలా చవకైనది. పైగా తయారు చేసుకోవడం చాలా సులువు.

33
నిల్వ చేసుకోవచ్చు
Image Credit : Getty

నిల్వ చేసుకోవచ్చు

ఈ హోమ్‌మేడ్ ఫుట్ క్రీమ్ పాదాలకు రాయడం వల్ల నొప్పి, చికాకు వంటివి కూడా ఉండవు. ఇది పాదాల చర్మాన్ని మృదువుగా, సున్నితంగా మార్చేస్తుంది. పాదాల నొప్పి, రక్తస్రావం, దురద వంటివి కూడా తగ్గిస్తుంది. ఒక్కసారి ఇలా ఫుట్ క్రీమ్ తయారు చేసి దాచుకుంటే రెండు మూడు నెలలు దాన్ని చక్కగా వాడుకోవచ్చు. పైగా దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువ. బ్యూటీ పార్లర్లకు లేదా ఇతర కాస్మెటిక్స్ కొనాలంటే వందలలో ఖర్చు అవుతుంది. అదే ఈ ఫుట్ క్రీమ్ అయితే చాలా తక్కువ ఖర్చుతో సిద్ధం అయిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Birth Month: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఏ రంగంలో అడుగుపెట్టినా నంబర్ వన్‌గా ఎదిగిపోతారు
Recommended image2
Saturn Rise: ఈ 5 రాశులకి అదృష్టం పట్టనుంది, ఏప్రిల్‌లో శని దయతో డబ్బే డబ్బు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved