- Home
- Life
- Mutton Curry: మటన్ కర్రీ మెత్తగా, జ్యూసీగా రావాలా? మ్యారినేట్ చేసేటప్పుడు ఈ చిట్కా ఫాలో అయితే చాలు..!
Mutton Curry: మటన్ కర్రీ మెత్తగా, జ్యూసీగా రావాలా? మ్యారినేట్ చేసేటప్పుడు ఈ చిట్కా ఫాలో అయితే చాలు..!
Mutton Curry: నాన్ వెజ్ కర్రీలు వండేటప్పుడు.. అవి మెత్తగా , తొందరగా ఉడకాలని ముందుగా మ్యారినేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే, మ్యారినేట్ చేసేటప్పుడు కొన్ని చిట్కాలు ఫాలో అయితే.. మటన్ కర్రీ రుచి రెట్టింపు అవుతుంది.

చికెన్, మటన్ వండుతున్నారా?
చికెన్ , మటన్ ఏ కర్రీ అయినా.. జ్యూసీ గా ఉండి.. ముక్క మెత్తగా ఉడికితే వచ్చే రుచే వేరు. అలా ఉడకాలని చాలా మంది ముందుగానే చికెన్, మటన్ ని మ్యారినేట్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత మంచి మసాలాలు వేసినా, మ్యారినేట్ చేసే విధానం సరిగా లేకపోతే కోరుకున్న రుచి రాదు. ఉప్పు ఎక్కువగా వేయడం, రెస్సటింగ్ టైమ్ ఇవ్వకపోవడం లేదా పులుపు ఎక్కువ ఉన్న మసాలాల్లో చాలాసేపు ఉంచడం వంటి చిన్న పొరపాట్లు రుచిని, టెక్స్చర్ ను దెబ్బతీస్తాయి. ఈ సాధారణ తప్పులను అర్థం చేసుకుంటే.. మసాలాలు లోపలికి బాగా పట్టి, మాంసం సమానంగా ఉడుకుతుంది. మరి, ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం....
1.మరీ ఎక్కువసేపు మ్యారినేట్ చేయడం....
ఎక్కువసేపు మాంసం మ్యారినేట్ చేస్తే.. ఇంకా తొందరగా ఉడుకుతుంది అని, రుచి పెరుగుతుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఎక్కువ మంది చేసే పొరపాటు ఇదే. నిమ్మరసం లేదా వెనిగర్ వంటి ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలతో మ్యారినేట్ చేసినప్పుడు.. అవి చికెన్ టెక్స్చర్ ని పాడు చేస్తాయి. దాని వల్ల కూర వండినా కూడా రుచిగా ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే.. అప్పటికప్పుడు వండుకోవాలి అంటే.. 30 నిమిషాలు మ్యారినేట్ చేయాలి. మరుసటి రోజు వండాలి అంటే... ఎక్కువలో ఎక్కువ 24 గంటలకు మించి నానపెట్టకూడదు.
2.ఎక్కువ ఉప్పు వేయడం...
మాంసం మ్యారినేట్ చేసేటప్పుడు చాలా మంది తెలీక ఎక్కువ ఉప్పు వేసేస్తూ ఉంటారు. దీనివల్ల వండిన తర్వాత మాంసం పొడిబారిపోయి, జ్యూసీనెస్ తగ్గుతుంది. ఆకృతి మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే... ఎక్కువ ఉప్పు వేయకూడదు. కొద్దిగా మాత్రమే వేసి.. తర్వాత రుచి కోసం ఇంకాస్త వేసుకోవచ్చు.
3. రెస్టింగ్ టైమ్ ఇవ్వకపోవడం
మసాలాలు కలిపిన వెంటనే మాంసాన్ని వండేస్తే రుచులు లోపలికి ఇంకేందుకు తగిన సమయం దొరకదు. మసాలాలు పైపైన మాత్రమే ఉండిపోతాయి. వండటానికి ముందే మాంసాన్ని ఫ్రిజ్లో పెట్టి, సూచించిన సమయం పాటు రెస్ట్ ఇవ్వండి.
4. మసాలాను సరిగ్గా పట్టించకపోవడం
మాంసం ముక్కలకు మసాలా సమానంగా పట్టకపోతే కొన్ని చోట్ల చప్పగా, మరికొన్ని చోట్ల మరీ ఘాటుగా ఉంటుంది. దీనివల్ల మాంసం కూడా సమానంగా ఉడకదు. అందుకే, మసాలాను మాంసానికి బాగా పట్టిస్తూ రాయాలి.
5. గది ఉష్ణోగ్రత వద్ద మ్యారినేట్ చేయడం
మ్యారినేట్ చేస్తున్నప్పుడు పచ్చి మాంసాన్ని బయట ఉంచితే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువై, ఆహార భద్రతకు ముప్పు కలుగుతుంది. ఫ్రెష్నెస్ కూడా తగ్గుతుంది. కాబట్టి.. మాంసాన్ని మ్యారినేట్ చేసినప్పుడు.. ఫ్రిజ్ లోనే స్టోర్ చేయాలి...














