Crispy Dosa: దోశ పిండిలో ఇదొక్కటి ఒక స్పూన్ కలిపితే.. దోశలు ఎర్రగా, క్రిస్పీగా వస్తాయి..!
Crispy Dosa: హోటల్ దోశలు క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి.. అదే ఇంట్లో దోశలు వేసుకుంటే మెత్తగా, సాగినట్లుగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇంట్లో దోశలు రుచిగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?
dosa secret
హోటల్స్ లో తయారు చేసే దోశలు బంగారు రంగులో ఉంటాయి. తింటుంటే కూడా కరకరలాడుతూ.. చాలా రుచిగా ఉంటాయి. అలాంటి దోశలు ఇంట్లో వేయాలని ట్రై చేస్తే మాత్రం... అంత రుచిగా రావు. మరీ ముఖ్యంగా ఎర్రగా కాలవు. అయితే, దోశ పిండిలో ఒక మ్యాజిక్ పౌడర్ కలపడం వల్ల.. హోటల్ స్టైల్ దోశలు ఇంట్లో కూడా ట్రై చేయచ్చు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం...
దోశలను కరకరలాడించే ఆ మ్యాజిక్ పదార్థం ఇదే
ఆ పదార్థం మరేదో కాదు.. బియ్యప్పిండి . దోశల పిండిలో కొద్దిగా బియ్యప్పిండి కలపడం వల్ల దోశలకు మంచి క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. సహజంగానే గ్లూటెన్-ఫ్రీ అయిన బియ్యప్పిండిని స్నాక్స్ కరకరలాడటానికి వాడుతుంటారు. వేడి పెనంపై దోశ వేసినప్పుడు ఇది పలుచగా, క్రిస్పీగా కాలడానికి ఎంతో సహాయపడుతుంది.
దోశల పిండిలో బియ్యప్పిండిని ఎలా కలపాలి? ముందుగా 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని సుమారు 2 కప్పుల దోశల పిండిలో వేసి బాగా కలపాలి. పిండి పెనంపై సులువుగా వేయడానికి వీలుగా జారుడుగా ఉండేలా చూసుకోవాలి. పెనం బాగా వేడయ్యాక, అవసరమైతే కొద్దిగా నూనె రాసి ఒక గరిటెడు పిండిని పలుచగా, గుండ్రంగా వేయాలి. అంచులు బంగారు రంగులోకి మారి పెనం నుంచి పైకి లేచే వరకు మీడియం మంటపై కాల్చాలి. కావాలంటే అంచుల వెంబడి కాస్త నూనె లేదా నెయ్యి వేసి దోశ క్రిస్పీగా అయ్యే వరకు ఉంచి తీసేయాలి.
ఇంట్లో క్రిస్పీ దోశలు వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 4 చిట్కాలు:
బియ్యప్పిండి మరీ ఎక్కువగా వేయొద్దు: మొదట తక్కువ పరిమాణంతోనే ప్రయత్నించండి. మరీ ఎక్కువగా కలిపితే దోశ గట్టిగా లేదా పొడిగా మారిపోయే అవకాశం ఉంది.
పెనం వేడి సరిగ్గా ఉండాలి: పెనం సరిగ్గా వేడెక్కకపోతే పిండి అతుక్కుపోతుంది. అలాగని మరీ ఎక్కువ వేడి ఉంటే దోశ సరిగ్గా కాలకుండా మాడిపోతుంది.
పిండిని పలుచగా పరచాలి: దోశ మందంగా ఉంటే అంతటా ఒకేలా కరకరలాడదు. కాబట్టి పిండిని వీలైనంత పలుచగా వేయాలి.
కాలడానికి తగిన సమయం ఇవ్వాలి: తొందరపడి దోశను ముందే తిప్పేయడం లేదా తీసేయడం చేయకండి. అడుగు భాగం లేత బంగారు రంగులోకి మారే వరకు ఆగితేనే అసలైన క్రిస్పీనెస్ వస్తుంది.
సో, ఇకపై ఇంట్లో హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు రావడం లేదని చింతించాల్సిన పనిలేదు. ఎలాంటి హంగులు లేకుండా, చిటికెడు బియ్యప్పిండి చిట్కాతో మీ బ్రేక్‌ఫాస్ట్‌ను సూపర్ క్రిస్పీగా మార్చేయండి.















