మీ ఒంట్లో ఈ విటమిన్లు లోపిస్తే ఎముకల బలం తగ్గుతుంది.. జాగ్రత్తగా ఉండండి..
ఎముకల బలం తగ్గడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఎముకలు బలహీనంగా మారడానికి మన శరీరంలో కొన్ని రకాల పోషకాలు లోపించడమే కారణం.

మన శరీరంలో ఎముకలు బలంగా ఉంటేనే ఎన్నో పనులను చేయగలుగుతాం.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఎముకల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఎముకలు బలహీనంగా మారడంతో కీళ్ల నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఈ కీళ్ల నొప్పులు ఎక్కువైతే మాత్రం నడవడమేంటి.. కూర్చోవడం కూడా కష్టంగానే ఉంటుంది. అందుకే ఎముకలు బలంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇంతకీ ఎముకలు ఎందుకు బలహీనంగా మారుతాయో తెలుసుకుందాం పదండి..
విటమిన్ డి లోపం
విటమిన్ డి మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకం. ఇది లోపిస్తే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రోగాలు వస్తాయి. ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. ఎందుకంటే మన శరీరంలో కాల్షియం శోషించుకోవాలంటే విటమిన్ డి చాలా అవసరం. ఒకవేళ మీ శరీరంలో విటమిన్ డి లోపిస్తే.. ఉదయం ఒక అర్థగంట పాటు సూర్యరశ్మిలో కూర్చోండి. అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆవు పాలు, పుట్టగొడుగులు, సాల్మన్ చేపలు, నారింజ పండ్లు వంటివి ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి.
vitamin k
విటమిన్ కె లోపం
ఎముకలు బలహీనంగా మారడానికి విటమిన్ కె లోపం కూడా ఒక కారణమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విటమిన్ కె లోపం వల్ల ఎముకలు నొప్పి పుడతాయి. అందుకే విటమిన్ కె ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తినండి. ఇవి ఎముకల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బ్రోకలీ, జున్ను, బచ్చలి కూర, మొలకలను రోజూ తినండి.
calcium
కాల్షియం
కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే కూడా ఎముకలు బలహీనంగా మారి కీళ్ల నొప్పులు పుడతాయి. అందుకే ఒక వ్యక్తికి రోజుకు ఎంత మొత్తంలో కాల్షియం అవసరమవుతుందో తెలుసుకుని తీసుకోండి. కాల్షియం పాలు, పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే సాల్మన్ చేపలు, ఆకుపచ్చ కూరగాయలు, బ్రోకలీ వంటి కూరగాయల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
protein rich foods
ప్రోటీన్
ప్రోటీన్ కూడా కండరాలను, ఎముకలను బలంగా చేస్తుంది. అందులోనూ ఎముకలకు ప్రోటీన్ చాలా అవసరం. ఇది గుమ్మడి విత్తనాలు, జున్ను, వేరు శెనగ, టోఫు, పాలు, విత్తనాల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయినప్పటికీ ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. బరువును బట్టే ప్రోటీన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 60 కిలోల బరువున్న వ్యక్తి ఒక రోజులో 60 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ ను అస్సలు తీసుకోకూడదు.