విటమిన్ డి లోపం వీరిలోనే ఎక్కువగా ఉంటుంది..
విటమిన్ డి లోపం ఏర్పడితే.. ఎముకలు బలహీనంగా మారుతాయి. సంక్రమణ పెరుగుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ విటమిన్ లోపించకుండా చూసుకోవాలి.

Vitamin d
మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ డి ఒకటి. ఈ విటమిన్ మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. భాస్వరం, కాల్షియాన్ని మన శరీరం శోషించుకోవానికి సహాయపడే అత్యంత ముఖ్యమైన పోషకాల్లో ఇదీ ఒకటి. ఇది లోపిస్తే శరీరం బలహీనపడుతుంది. ఎముకలు శక్తిని కోల్పోతాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సంక్రమణకు గురవుతారు. అందుకే ఈ విటమిన్ లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా ఈ డి విటమిన్ పెద్దలకు చాలా అవసరం. పురుషులు, స్త్రీలు అంటూ తేడా లేకుండా వీరికి ప్రతి రోజూ డి విటమిన్ లభించే ఆహారం 15 ఎంసిజీ అవసరం అవుతుంది. అదే 70 ఏండ్లు నిండిన వారికి ఒక్క రోజుకు 20 ఎంసిజి ఆహారం అవసరం.
విటమిన్ డి కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ డి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలను దూరం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలను బలంగా ఉంచుతంది. కండరాలకు బలాన్ని ఇస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు అకాల మరణాల్ని సైతం తగ్గించడానికి సహాయపడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు వంటి ఇతర క్యాన్సర్ లను నియంత్రించడంలో ఈ విటమిన్ ప్రయోజనకరంగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
మన బాడీ విటమిన్ డి ని ఎలా ఉత్పత్తి చేస్తుంది..
మన చర్మంపై రసాయనిక ప్రతిచర్య జరిగినప్పుడు డి విటమిన్ ఉత్పత్తి అవుతుంది. అంటే.. చర్మానికి సూర్మరశ్మి తగిలినప్పుడు 7-dehydrocholestero అనే స్టెరాయిడ్ విచ్చిన్నమవుతుంది. దీంతో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.
vitamin d deficiency
విటమిన్ డి లోపం ఎవరికి ఎక్కువగా ఉంటుంది..
శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకునే వారికి విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచడం వల్ల సూర్యరశ్మి చర్మానికి తగలదు. దీంతో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది.
సన్ స్క్రీన్ ను ఎక్కువగా ఉపయోగించే వారిలో కూడా ఈ విటమిన్ లోపిస్తుంది.
ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేవారు
ముదురు రంగు చర్మ రంగును కలిగున్నవారు
వృద్ధుల్లో కూడా విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరు ఇంట్లోనే ఉంటారు.
ఊబకాయులు, బోలు ఎముకల వ్యాధితో బాధపడేవారు.
కాలెయ సమస్యలు, మూత్రపిండాల సమస్యలున్న వారు
విటమిన్ డి లోపం సంకేతాలు
మీకు విటమిన్ డి లోపం ఉంటే డిప్రెషన్ బారిన పడతారు. అలాగే కండరాల్లో నొప్పి, ఎముకల నొప్పి, తీవ్రమైన అలసట కలుగుతుంది. విటమిన్ డి లోపం చిత్తవైకల్యానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. పలు అధ్యయనాల ప్రకారం.. అంగస్తంభనకు, విటమిన్ డి లోపానికి దగ్గరి సంబంధం ఉందని తేలింది.