విటమిన్ బి12 లోపిస్తే.. ఈ అనారోగ్య సమస్యలొస్తయ్.. జాగ్రత్త..!
విటమిన్ బి12 లోపిస్తే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే అనేక మార్పులు కనిపిస్తాయి. అవేంటంటే

మన శరీర అవయవ పనితీరుకు అనేక విటమిన్లు తప్పనిసరి. అయితే ఈ మధ్యకాలంలో చాలా మందిలో విటమిన్-డి లోపంతో పాటు మరో విటమిన్ బి-12 (Vitamin B-12) లోపం కూడా కనిపిస్తోంది. విటమిన్ బి-12 ని కోబాలమిన్ (Cobalamin ) గా కూడా పిలుస్తారు. విటమిన్ బి-12 ముఖ్యంగా మెదడు, ఎముకలు పనితీరులో ప్రధాన పాత్ర వహిస్తుంది.
అదేవిధంగా రక్త కణాల వృద్ధికి (Growth of blood cells) డిఎన్ఏ తయారీకి ఇది సహాయపడుతుంది. అయితే మన శరీరం దీన్ని సహజంగా ఉత్పత్తి చేసుకోలేదు. దాంతో పాటు ఎక్కువ కాలం నిలువ ఉంచుకోలేదు. కాబట్టి శాకాహార ఉత్పత్తుల్లో (Vegetarian Products) ఇది చాలా తక్కువగా ఉంటుంది.
అయితే విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు మీ శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. అలాంటప్పుడు మీరు దానిని ఎదుర్కోవటానికి ఎన్నో రకాల చిట్కాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మీకు అనేక రకాల సమస్యల చుట్టుకునే ప్రమాదం ఉంది. వాస్తవానికి మీ జీవనశైలి బాగా లేకపోతే కూడా ఈ విటమిన్ కొరత ఏర్పడుతుంది.కాబట్టి విటమిన్ బి 12 లోపించినప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో, వాటిని నివారించే మార్గాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మం పసుపు పచ్చగా మారడం: మీ చర్మం తరచుగా పసుపు రంగులోకి మారితే.. మీరు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఈ రకమైన సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేకపోతే ఈ సమస్య మరింత పెరగవచ్చు. నిజానికి విటమిన్ బి12 లోపించినప్పుడు కూడా శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణాలు లోపిస్తాయి.
తలనొప్పి: మీరు తరచుుగా తలనొప్పి సమస్యతో బాధపడితే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి చాలాసార్లు ఈ నొప్పి విటమిన్ బి 12 లోపం వల్ల వస్తుంది.
పొట్టకు సంబంధించిన సమస్యలు ఉండటం: కొందరికి కడుపు సంబంధిత సమస్యలు తరచుగా సంభవిస్తుంటాయి. విరేచనాలు, మలబద్ధకం, అపానవాయువు (పిత్తులు), కడుపులో గ్యాస్ ఏర్పడటం, వికారం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టైతే మీకు విటమిన్ బి 12 లోపం ఉండవచ్చు.
మైకము కూడా ఒక లక్షణమే: ఇవే కాకుండా.. మీకు తరచుగా మగతగా అనిపిస్తే కూడా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి ఈ కారణంగా శరీరంలోని కణాలు సరిగ్గా పనిచేయలేకపోవచ్చు. ఇది తరచుగా విటమిన్ బి 12 లోపం ద్వారా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ లోపం ఏర్పడినప్పుడు అధిక ఒత్తిడి (Stress), అలసట (Fatigue), తలనొప్పి వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లోపాన్ని అజాగ్రత్త చేస్తే చర్మం పాలిపోవడం, నీరసంగా అనిపించడం, నాలుక నున్నగా మారడం, మలబద్ధకం డయేరియా తగ్గకపోవడం, ఆకలి లేకపోవడం, కండరాలు బలహీనపడటం, కంటిచూపు మందగించడం, నడవలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.