MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • No Alcohol Village: ఈ ఊళ్లో ఒక్కరు కూడా మందు తాగరు.. ఎవరినీ తాగనివ్వరు..!

No Alcohol Village: ఈ ఊళ్లో ఒక్కరు కూడా మందు తాగరు.. ఎవరినీ తాగనివ్వరు..!

 No Alcohol Village: ఈరోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ మద్యానికి అలవాటు పడుతున్నవారే. మందు తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేం అనేవారికి కచ్చితంగా ఈ ఊరు వెళ్లాల్సిందే.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 15 2026, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మద్యం ముట్టని గ్రామం...
Image Credit : chat GPT

మద్యం ముట్టని గ్రామం...

ఒకప్పుడు మందు తాగే అలవాటు ఉన్నవారికి ఒక చీడ పురుగులా చూసేవారు. కానీ.. ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది. మందు అలవాటు లేని వాళ్లను వింతగా చూస్తున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా మందు తాగేస్తున్నారు. అసలు ఆల్కహాల్ తీసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. అలాంటి ఈ రోజుల్లో ఓ గ్రామం ఈ విషయంలో చాలా ఆదర్శంగా ఉంది. అందరూ పబ్బులు, పార్టీలు అంటూ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతుంటే.. ఈ గ్రామస్థులు మాత్రం మద్యం జోలికే వెళ్లరు. ఈ నిర్ణయం వీళ్లు నిన్న, మొన్న తీసుకున్నది కాదు.. దాదాపు 26ఏళ్లుగా ఆ గ్రామంలో ఎవరూ మందు తాగలేదు. మరి.. ఆ గ్రామం ఎక్కడ ఉంది? వాళ్లు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ గ్రామం ఎక్కడ ఉంది?
Image Credit : Getty

ఈ గ్రామం ఎక్కడ ఉంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగారెడ్డి గూడెం సమీపంలోని అమ్మపాలెం గ్రామంలో 26 ఏళ్లుగా మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. వాళ్ల ఊళ్లో మద్యం అమ్మరు. వేరే వాళ్లని అమ్మనివ్వరు. వీళ్ల గ్రామస్థులు ఎవరూ తాగరు... ఎవరైనా తాగుతుంటే.. ఆపడానికే చూస్తారు.ఈ గ్రామంలో ఏ ఇంటికి వెళ్లి అడిగినా.. తమ ఊరంతా మంచి ఊరు మరొకటి లేదు అని గర్వంగా చెప్పుకుంటారు.

Related Articles

Related image1
Phone Number: మన ఫోన్ నెంబర్ లో 10 అంకెలు ఎందుకు ఉంటాయి? 8, 9 ఎందుకు లేవు..?
Related image2
Anant Ambani: వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నా.. అంబానీ కొడుకు బరువు ఎందుకు తగ్గలేదు..?
33
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..?
Image Credit : Gemini AI

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..?

ఒకప్పుడు మద్యం కారణంగా వాళ్ల గ్రామంలో చాలా మంది కుటుంబాలు వీధిన పడ్డాయంట. తినడానికి తిండి లేక.. ఆస్తులు పోగొట్టుకొని ఇబ్బందుల పాలైనవాళ్లు చాలా మంది ఉన్నారు. విపరీతంగా తాగేసి వచ్చి భార్య, బిడ్డలను కొట్టడం.. వారిని పట్టించుకోకపోవడం చేసేవారట. దీంతో.. ఇలా అయితే కష్టం అని.. మద్యపాన నిషేధం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 26 ఏళ్లుగా ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన వాళ్లు.. మద్యానికి దూరంగా ఉండటమే కాదు.. వేరే ఊరి వాళ్లు కూడా తమ గ్రామంలో ఆల్కహాల్ జోలికి వెళ్లనివ్వరు. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూల్ డ్రింక్స్ ఇస్తారు తప్ప.. ఆల్కహాల్ మాట మాత్రం ఎత్తరు.

ఎవరైనా మద్యం తాగితే కఠిన శిక్షలు...

ఈ గ్రామ నిబంధనల ప్రకారం ఎవరైనా మద్యం సేవించినట్లు తెలిస్తే.. వెంటనే వారికి జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు గ్రామ సభ ముందు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఆ గ్రామ పెద్దలు చెబుతున్నారు. అయితే.. ఈ నియమం పెట్టుకున్న తర్వాత ఎవరూ ఈ రూల్ ని అతిక్రమించకపోవడం గమనార్హం.

ఈ గ్రామాన్ని చూసి.. చుట్టు పక్కన గ్రామాలు కూడా ఈ నియమం పాటించాలని అనుకుంటున్నాయంట. చాలా మంది మందు మానేసిన వారు కూడా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం కారణంగా.. అక్కడ చాలా మంది కుటుంబాలు దారిన పడ్డాయి. కుటుంబంలో గొడవలు తగ్గాయి. ఆదాయం కూడా క్రమంగా పెరిగింది. మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత కాలంలో.. ఈ గ్రామం ఇతర ప్రాంతానికి ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామస్థుల ఐక్యత, సామాజిక బాధ్యత ఉంటే ఎలాంటి సమస్యలను అయినా సులభంగా అధిగమించవచ్చని ఈ గ్రామం నిరూపిస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడు ఎక్కువ ఒంటరిగా ఫీల్ అవుతాడో తెలుసా?
Recommended image2
Cinnamon Water: రోజూ ఈ డ్రింక్ ఒక్క గ్లాస్ తాగినా చాలు.. ఎన్ని లాభాలో!
Recommended image3
Polki Bangles: చేతులకు అందాన్ని తెచ్చే పోల్కీ గాజులు..ఎంత బాగున్నాయో
Related Stories
Recommended image1
Phone Number: మన ఫోన్ నెంబర్ లో 10 అంకెలు ఎందుకు ఉంటాయి? 8, 9 ఎందుకు లేవు..?
Recommended image2
Anant Ambani: వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నా.. అంబానీ కొడుకు బరువు ఎందుకు తగ్గలేదు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved