- Home
- Life
- షుగర్ పేషెంట్లు ఈ పండ్లను అసలే తినకూడదు.. తిన్నారో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి జాగ్రత్త..
షుగర్ పేషెంట్లు ఈ పండ్లను అసలే తినకూడదు.. తిన్నారో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి జాగ్రత్త..
షుగర్ పేషెంట్లు ఏవి పడితే అవి తినకూడదు. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అయితే కొన్ని రకాల పండ్లు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.

ఆరోగ్యంగా ఉండేందుకు.. ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఏవి పడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే వీటిలో రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అందుకే మధుమేహుల ఆరోగ్యానికి ఏవి మంచివో.. ఏవి కావో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
fruits
పండ్ల ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో అందుతాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను పోగొడుతాయి. అందుకే రోజూ రెండు మూడు రకాల పండ్లను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. అయినప్పటికీ కొన్ని రకాల పండ్లు షుగర్ పేషెంట్లకు అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మధుమేహులు వీటిని తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అందుకే వీటిని తినకూడదు. ఇంతకీ మధుమేహులు ఎలాంటి పండ్లను తినకూడదో తెలుసుకుందాం పదండి..
cherry
చెర్రీలు
చెర్రీలు తియ్యగా, టేస్టీగా ఉంటాయి. అందుకే ఈ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఎందుకంటే ఈ పండ్లలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కప్పు చెర్రీలో 20 గ్రాముల చక్కెర కంటెంట్ ఉంటుంది. అందుకే మధుమేహులు చెర్రీలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
అంజూర పండ్లు
ఎండిన అంజూర పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ పండ్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. కప్పు ఎండిన అంజూర పండ్లలో 29 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. అందుకే వీటిని స్వీట్లు, కుకీలలో ఉపయోగిస్తుంటారు. అందుకే మధుమేహులు ఈ పండ్లకు దూరంగా ఉండాలి.
lychees
లిచీ
లిచీ పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పండ్లను ఎక్కువగా బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ జిల్లాలోనే పండిస్తారు. ఒక కప్పు లిచీలో సుమారు 29 గ్రాముల చక్కెర స్థాయిలు ఉంటాయి. అందుకే మధుమేహులు వీటిని తినకూడదు.
మామిడి పండు
మన దేశంలో మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందుకంటే ఈ పండు తియ్యగా టేస్టీగా ఉంటుంది. అందుకే పండను తొక్కతో సహా తినేస్తుంటారు. అయితే ఒక కప్పు మామిడి పండులో సుమారుగా 23 గ్రాముల షుగర్ ఉంటుంది. ఇది డయాబెటీస్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు.
పైనాపిల్
పైనాపిల్ వగరుగా, తియ్యగా టేస్టీగా ఉంటుంది. దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ పండులో షుగల్ కంటెంట్ మోతాదుకు మించి ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్ లో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒకవేళ మధుమేహులు ఈ పండ్లను తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు దారుణంగా పెరిగిపోతాయి.