Diabetes: షుగర్ పేషెంట్లు పసుపును ఇలా తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి..
Diabetes: మధుమేహులు పసుపుతో పాటుగా కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

ఆయుర్వేద పరంగా.. పసుపు (turmeric)ను ఎన్నో ఔషదాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇది ఎన్నో రోగాలను నయం చేస్తుంది. అందుకే దీనిని ఎన్నో ఏండ్ల కిందటి నుంచి ఉపయోగిస్తున్నారు. పసుపులో యాంటీమైక్రోబయల్ (Antimicrobial), యాంటీఆక్సిడెంట్, యాంటిక్యాన్సర్ (Anticancer) యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. పసుపును రెగ్యులర్ గా కొంతమొత్తంలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఇది షుగర్ పేషెంట్లకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. పసుపు మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ (Blood sugar levels) ను నియంత్రించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం పసుపును వీళ్లు ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహులకు పసుపు ఏ విధంగా మేలు చేస్తుంది..
పసుపులో కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. మధుమేహులు పసుపును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
పసుపు, దాల్చిన చెక్క పౌడర్
పసుపు, దాల్చిన చక్క పౌడర్ (Cinnamon powder) ను కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇందుకోసం గ్లాస్ పాలలో సమపాళ్లలో దాల్చిన చెక్క పౌడర్ ను , పసుపును వేసి వేడి చేయాలి. ఈ పాలను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తాగాలి. పసుపే కాదు దాల్చిన చెక్క కూడా షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
పసుపు, నల్లమిరియాలు
పసుపుతో నల్లమిరియాల పౌడర్ (Black pepper powder)ను కలిపి తీసుకుంటే కూడా షుగర్ నియంత్రణలో ఉంటాయి. ఇందుకోసం గ్లాస్ పాలను తీసుకుని అందులో కొంచెం నల్లమిరియాల పొడిని, పసుపును వేసి వేడి చేసి తాగాలి.
పసుప, ఉసిరి పొడి (Amla powder)
ఉసిరి కూడా షుగర్ పేషెంట్లకు మంచి చేస్తుంది. ఇది కూడా వారి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఉసిరిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి (Vitamin C) రోగ నిరోధక శక్తి (Immunity)ని పెంచడమే కాదు చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ (Bad cholesterol levels) ను కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఇందుకోసం మీరు గ్లాస్ నీళ్లను తీసుకుని అందులో పసుపుతో పాటుగా ఉసిరి పొడిని వేసి బాగా కలపండి. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది.