Ceiling Decor: తక్కువ బడ్జెట్‌లో ఇల్లు లగ్జరీ ప్యాలెస్‌లా మార్చే సీలింగ్ డిజైన్లు
Ceiling Decor: ఎవరికైనా సొంతిల్లు ఒక డ్రీం. కట్టేటప్పుడే గోడ, కిటికీ, తలుపులకు రకరకాల డిజైన్స్ చూస్తారు. కానీ సీలింగ్ విషయం పట్టించుకోరు. ఇంటికి లగ్జరీ లుక్ రావాలంటే సీలింగ్ డిజైనింగ్ చాలా ముఖ్యం. అందుకే ఈ ఐడియాస్ ట్రై చేయండి.

సీలింగ్ కూడా ముఖ్యమే
ఇంటి అందం గోడలు, కర్టెన్లు, ఫర్నిచర్, ఫ్లోరింగ్, కిటికీలే కాదు. సీలింగ్ కూడా ముఖ్యమే. ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటీరియర్ విషయంలో ఎన్నో ఆలోచిస్తారు. కానీ సీలింగ్ విషయం పట్టించుకోరు. ఒక ఇంటికి లగ్జరీ లుక్ రావాలంటే సీలింగ్ డిజైన్ కంపల్సరీ. అయితే ఎలాంటి డిజైన్లు ఎంపిక చేసుకోవాలి అని కంగారు పడొద్దు. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఈ సీలింగ్ డిజైన్లు మీ ఇంటికి మోడ్రన్, లగ్జరీ లుక్ ఇస్తాయి. సరైన సీలింగ్ డిజైన్ గదిని అందంగా చూపించడమే కాకుండా, విశాలంగా, ప్రకాశవంతంగా కూడా కనిపించేలా చేస్తుంది. సీలింగ్ డిజైన్ వల్లే గందరగోళంగా ఉన్న మీ మనసు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోతుంది.
ఫాల్స్ సీలింగ్ డిజైన్
కోవ్ లైటింగ్‌తో కూడిన ఫాల్స్ సీలింగ్ డిజైన్...మీ మనసుకు ఒక ప్రశాంతతను ఇస్తుంది. మెదడును కామ్ చేస్తుంది. మంచి నిద్ర పడుతుంది. ఇందులో వాడే కవర్డ్ LED లైట్లు సీలింగ్‌కు మృదువైన, సొగసైన వెలుగును అందిస్తాయి. దీంతో గది మొత్తం ప్రీమియంగా, సౌకర్యవంతంగా కనిపిస్తుంది.
వుడెన్ ప్యానెల్ సీలింగ్‍తో క్లాసీ లుక్
సహజమైన, వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడేవారికి వుడెన్ ప్యానెల్ సీలింగ్ ఒక అద్భుతమైన ఎంపిక. చెక్క టెక్చర్ గదికి క్లాసీ లుక్ ఇస్తుంది. ఇది ఆధునిక ఇంటీరియర్‌తో సులభంగా కలిసిపోతుంది. ఒక కాస్ట్లీ హోటల్ లో ఉన్నామనే ఫీల్ ఇస్తుంది. అందుకే ఇల్లు కట్టుకునేటప్పుడే అన్నిరకాలుగా ఆలోచించుకోవాలి.
హెక్సాగాన్ లుక్...
చతురస్రం, షడ్భుజి (హెక్సాగాన్) వంటి జియోమెట్రిక్ ఆకారాలతో కూడిన డిజైన్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ స్టైల్ గదిలో ఒక ప్రత్యేకమైన విజువల్ ఎఫెక్ట్‌ను సృష్టిస్తుంది. ఇది మోడ్రన్ డెకర్‌కు కొత్త రూపాన్ని ఇస్తుంది.
మిర్రర్ ఫినిష్ సీలింగ్
చిన్న గదులను పెద్దవిగా చూపించడానికి మిర్రర్ ఫినిష్ సీలింగ్ ఉత్తమమైన మార్గం. దీని రిఫ్లెక్టివ్ బేస్ గదిలో వెలుతురును పెంచుతుంది. అలాగే గది మరింత విశాలంగా కనిపించేలా చేస్తుంది. రాజభవనంలా మెరిసిపోతుంది.
3D టెక్చర్, ప్యాటర్న్
3D టెక్చర్, ప్యాటర్న్‌లతో ఉండే సీలింగ్ ఇంటికి లగ్జరీ హోటల్ లుక్‌ను ఇస్తుంది. ఈ డిజైన్ ముఖ్యంగా లివింగ్ రూమ్, మాస్టర్ బెడ్‌రూమ్‌లలో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చూడగానే దృష్టిని ఆకట్టుకుంటుంది.
గోల్డ్, బ్రాంజ్, సిల్వర్ టోన్
స్మార్ట్ లైటింగ్
మినిమలిస్ట్ వైట్ సీలింగ్ బెస్ట్ ఆప్షన్
సాధారణంగా, ఎప్పటికీ నిలిచిపోయే లుక్ కోరుకునే వారికి మినిమలిస్ట్ వైట్ సీలింగ్ బెస్ట్ ఆప్షన్. స్పష్టమైన లైన్లు, లేత రంగులతో ఈ డిజైన్ ఏ ఇంటీరియర్ థీమ్‌లోనైనా సులభంగా ఇమిడిపోతుంది.

