MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi: ఇదేం అభిమానం రా బాబు..'పెద్ది' ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం దేశాలు దాటొచ్చిన ఫ్యాన్స్

Peddi: ఇదేం అభిమానం రా బాబు..'పెద్ది' ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం దేశాలు దాటొచ్చిన ఫ్యాన్స్

Peddi:RRR సినిమా తర్వాత ప్యాన్ ఇండియా వైడ్‍గానే కాకుండా ప్యాన్ వరల్డ్ లో తెలుగు సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే రామ్ చరణ్ (పెద్ది) సినిమా చూసేందుకు ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చేంతలా...ఇంతకీ జపాన్ నుంచి ఎవరు వచ్చారో తెలుసా?

2 Min read
Author : Nandini Arava
Published : Jun 04 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఇది కదా అభిమానం అంటే
Image Credit : Asianet News

ఇది కదా అభిమానం అంటే

హీరో ఫ్యాన్స్ అంటే ఫస్డ్ డే ఫస్ట్ షో, ప్రీమియం షోలు చూడటం, సినిమా రిలీజ్ రోజు కటౌట్ లు కట్టడం, రక్తదానాలు చేయడం చూసుంటాం. మరీ కాదంటే సినిమా టికెట్లు కూడా వేలం పాటలో లక్షల్లో కొనేవాళ్లని చూసుంటాం. కానీ ఇదేం అభిమానం రా బాబు...అభిమాన హీరో సినిమా చూసేందుకు ఏకంగా దేశాల సరిహద్దులే దాటేశారు. ప్రయాణ ఖర్చుల కోసం...వాళ్ల నిత్యవసరాలే తగ్గించుకున్నారంట. ఇది కదా అభిమానం అంటే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
టోక్యో నుంచి టాలీవుడ్ దాకా
Image Credit : Asianet News

టోక్యో నుంచి టాలీవుడ్ దాకా

టోక్యో నుంచి టాలీవుడ్ సినిమా చూడటానికి రావడమంటే మామూలు విషయం కాదు. గుండెల నిండా భావోద్వేగం నింపుకుంటూ రాంచరణ్(పెద్ది ) చూసేందుకు హైదరాబాద్ వచ్చారు...ఇద్దరు జపనీస్. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి. అంత దూరం నుంచి ఇక్కడికే ఎందుకు వచ్చారని అడిగితే...రాం చరణ్ ఫ్యాన్స్ సందడి, థియేటర్ల వద్ద కోలాహలం ఎలాం ఉంటుందో కళ్లారా చూడాలనే ఇక్కడికి వచ్చినట్లు జపాన్‍కు చెందిన మసామీ, క్రిస్ చెబుతున్నారు. 

Related Articles

Related image1
Peddi Review: పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ, రామ్‌ చరణ్‌కి అసలు పరీక్ష ఇదే..
Related image2
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
37
రెండురోజుల్లో 10 షోలు చూడనున్న జపనీస్
Image Credit : Asianet News

రెండురోజుల్లో 10 షోలు చూడనున్న జపనీస్

దక్షిణాది మూవీలకు జపాన్ లో సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉందంట. ఒక హైదరాబాద్ లోనే కాకుండా చెన్నైలో కూడా పెద్ది సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకున్నారంట. ముందు సింగపూర్‍లోనే ఈ సినిమా చూద్దామని అనుకున్నారు. కానీ లిప్ రీడింగ్ అర్థం కావడం కష్టమని హైదరాబాద్ వచ్చినట్లు జపనీస్ చెబుతున్నారు. అంతేకాదు రెండురోజుల్లో 10 షోలు చూడనున్నారట.

47
మగధీర నుంచి ఆయనకు బిగ్ ఫ్యాన్ అయిపోయా
Image Credit : Asianet News

మగధీర నుంచి ఆయనకు బిగ్ ఫ్యాన్ అయిపోయా

ఈ జపనీస్ మహిళా ఫ్యాన్స్ ఏం చెబుతున్నారంటే...రాం చరణ్ కు బిగ్ ఫ్యాన్స్ అని, మగధీర సినిమాతో ఆయన నటన బాగా ఆకట్టుకుందని చెబుతున్నారు. మళ్లీ RRR మూవీ, రంగస్థలంలో ఆయన యాక్టింగ్‍తో ఇరగదీశారని, అందుకే ఆయన సినిమాలు హిట్ అయినా, ప్లాప్ అయినా పర్లేదు..రాం చరణ్ ఉంటే చాలని అంటున్నారు. ఇందులో మసామీ అనే ఆమె గేమ్ ఛేంజర్ సినిమా చూసేందుకు సింగపూర్ వెళ్లారంట. 

57
ఇబ్బంది పెట్టడం లఇష్టం లేదు
Image Credit : Asianet News

ఇబ్బంది పెట్టడం లఇష్టం లేదు

గతేడాది రంగస్థలం సినిమా అప్పుడు హైదరాబాద్ వచ్చి ఆయన్ని కలిసినట్లు తెలిపారు. ఈసారి ఆయన పెద్ది సినిమా ప్రమోషన్స్ లో బిజిగా ఉన్నారు కాబట్టి...ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కేవలం సినిమా చూసి వెళ్లిపోతున్నట్లు తెలిపారు.

67
టీ షర్టులు కూడా డిజైన్ చేయించుకున్న జపనీస్
Image Credit : Asianet News

టీ షర్టులు కూడా డిజైన్ చేయించుకున్న జపనీస్

రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షలు ఖర్చు పెట్టి పెద్ది సినిమా చూసేందుకు వచ్చారంట. అలా అని వీళ్లేమీ రిచ్ పీపుల్ కాదు..ఇండియాకు రావడానికి ఓవర్ టైం డ్యూటీ చేస్తూ...నిత్యవసర ఖర్చులు కూడా తగ్గించుకున్నారంట. ఆఫీసుకు 5 రోజులు సెలవు కూడా పెట్టి పెద్ది సినిమా చూసేందుకు వచ్చినట్లు జపనీస్ చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన కణ్మని సహకారంతో ఇండియా వచ్చినట్లు వారు తెలిపారు.పెద్ది సినిమా కోసం ప్రత్యేకంగా టీ షర్టులు కూడా డిజైన్ చేయించుకున్నారు.

77
తెలుగు నేర్చుకున్న జపాన్ మహిళ
Image Credit : Youtube@Mythri Movie Makers

తెలుగు నేర్చుకున్న జపాన్ మహిళ

RRR సినిమా తర్వాత ప్యాన్ వరల్డ్ లో తెలుగు సినిమా అరుదైన గౌరవం దక్కింది. ఇక బాహుబలి, కల్కి, ఇలా ఎన్నో దక్షిణాది సినిమాలను ప్రేమిస్తున్నారు. అందుకే గతంలో జూనియర్ NTR ..దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్తే ఆయనపై అభిమానంతో ఏకంగా ఓ మహిళ తెలుగు నేర్చుకుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Super Star Krishna: మహేష్ బాబుకి ఇప్పటికైనా అర్థం కావాలి..కృష్ణ ఆవేదన, ఆ మూవీ తర్వాత షాకింగ్ కామెంట్స్
Recommended image2
Ram Charan: రాంచరణ్ నటనపై విమర్శలు, వరస్ట్ నుంచి ది బెస్ట్ వరకు..నోరు మెదపకుండా 5 సినిమాలతో ఇచ్చిపడేశాడు
Recommended image3
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Peddi Review: పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ, రామ్‌ చరణ్‌కి అసలు పరీక్ష ఇదే..
Recommended image2
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved