- Home
- Life
- Top Load Vs Front Load: ఈ రెండు వాషింగ్ మెషీన్లలో ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?
Top Load Vs Front Load: ఈ రెండు వాషింగ్ మెషీన్లలో ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?
Top Load Vs Front Load: టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లలో ఏది కొనాలో ఎంతో మందికి అవగాహన లేదు. ఈ రెండింట్లో ఏది తక్కువ కరెంట్, తక్కువ నీళ్లు వాడుతుందో అది కొనుక్కోవడం బెటర్. ఈ రెండింట్లో ఏది కొంటే మంచిదో తెలుసుకోండి.

టాప్ లోడ్ vs ఫ్రంట్ లోడ్ — తేడా ఏంటి?
వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు టాప్ లోడ్ తీసుకోవాలా, ఫ్రంట్ లోడ్ తీసుకోవాలా అని ఎంతో మంది ఆలోచిస్తారు. ఈ రెండూ బట్టలు ఉతికేవే అయినా.. నీటి వాడకం, బట్టలు క్లీన్ చేసే విధానం, వాడుకునే వీలు, ధర లాంటి విషయాల్లో చాలా తేడాలు ఉంటాయి.
టాప్ లోడ్
ఇందులో పైనుంచి బట్టలు వేస్తాం. బట్టలు వేయడానికి, తీయడానికి ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.
ఫ్రంట్ లోడ్
దీనికి ముందు వైపు డోర్ ఉంటుంది. లోపల తిరిగే డ్రమ్ ద్వారా ఇది బట్టలను ఉతుకుతుంది. ఇది చాలా తక్కువ నీటితో బట్టలను క్లీన్ చేస్తుంది.
అందుకే, ఏది బెస్ట్ అని డిసైడ్ అయ్యేముందు కేవలం ధర మాత్రమే కాకుండా.. కరెంట్ బిల్లు, నీటి ఖర్చు, బట్టలు ఉతికే కెపాసిటీని కూడా మనం పోల్చి చూసుకోవాలి.
కరెంట్ బిల్లు దేనికి తక్కువ వస్తుంది?
కరెంట్ ఖర్చు విషయానికొస్తే, చాలా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు తక్కువ కరెంట్‌ను వాడుకుంటాయి. ముఖ్యంగా ఇవి తక్కువ నీటిని తీసుకోవడం వీటి స్పెషాలిటీ. అలాగని అన్ని ఫ్రంట్ లోడ్ మెషీన్లు, టాప్ లోడ్ మెషీన్ల కంటే తక్కువ కరెంట్‌ను లాగుతాయని మనం కచ్చితంగా చెప్పలేం. మెషీన్ కొనేముందు దానికి ఉన్న స్టార్ రేటింగ్, ఆ మోడల్ ఎంత కరెంట్ తీసుకుంటుందనే డీటెయిల్స్ మీరు తప్పకుండా చెక్ చేయాలి.
దుస్తుల మురికిని వదిలించడంలో, ఉతికాక బట్టల్లో తడిని తగ్గించడంలో ఫ్రంట్ లోడ్ మెషీన్లు ముందుంటాయి. డ్రమ్‌లో బట్టలు తిరుగుతూ ఉతికే విధానం వల్ల, ఇవి తక్కువ నీటితోనే బట్టలను చాలా నీట్‌గా క్లీన్ చేస్తాయి. స్పిన్ స్పీడ్ ఎక్కువగా ఉండే మోడల్స్ అయితే, ఉతికిన తర్వాత బట్టల్లోని నీటిని చాలావరకు బయటకు పంపేస్తాయి.
టాప్ లోడ్ మెషీన్లలో కూడా మురికిని బాగా వదిలించే మోడల్స్ ఉన్నాయి. కానీ నీటి వాడకం, బట్టలను ఉతికే తీరు, ఉతికాక బట్టల్లో ఉండే తడి లాంటివి పోల్చి చూస్తే.. ఫ్రంట్ లోడ్ మోడల్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా, రోజూ బట్టలు ఉతికే పెద్ద ఫ్యామిలీలకు ఈ తేడాలు చాలా ముఖ్యం.
ధర, నీళ్లు, మెయింటెనెన్స్
ఒకేసారి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనుకునేవాళ్లకు టాప్ లోడ్ మెషీన్ బెస్ట్ ఆప్షన్. దీని ధర కాస్త తక్కువగా ఉంటుంది. పైనుంచి బట్టలు వేస్తాం కాబట్టి వంగి పనిచేయాల్సిన అవసరం ఉండదు. మధ్యలో మర్చిపోయిన బట్టలు వేయడానికి కూడా కొన్ని టాప్ లోడ్ మోడల్స్ చాలా కంఫర్ట్‌గా ఉంటాయి.
కానీ, లాంగ్ రన్లో నీటి ఖర్చు తగ్గించుకోవాలి అనుకుంటే మీరు ఫ్రంట్ లోడ్ మెషీన్ల వైపు వెళ్లొచ్చు. ఇవి చాలా తక్కువ నీటిని వాడుకుంటాయి. అయితే, డోర్ దగ్గర ఉండే రబ్బర్ రింగ్ లాంటి పార్ట్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి, తక్కువ బడ్జెట్, ఈజీ వాడకం కావాలంటే టాప్ లోడ్.. నీటి ఆదా, పర్ఫెక్ట్ వాష్ కావాలంటే ఫ్రంట్ లోడ్.. ఇలా మీ అవసరాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి.

