MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • River: మనదేశంలో వర్షాకాలంలో మాత్రమే బతికే విచిత్ర నది.. థార్ ఎడారి ఇసుకలో ఇంకిపోతుంది

River: మనదేశంలో వర్షాకాలంలో మాత్రమే బతికే విచిత్ర నది.. థార్ ఎడారి ఇసుకలో ఇంకిపోతుంది

River: వానాకాలంలో మాత్రమే ప్రాణం పోసుకునే విచిత్ర నది ఒకటుంది. దీన్ని సరస్వతి నదిగా కూడా చెప్పుకుంటారు. హిమాలయాల్లో మొదలై వానాకాలంలో మాత్రం భూమిపై ప్రవహిస్తూ కనిపిస్తుంది. సముద్రంలో కలవకుండా థార్ ఎడారిల ఇసుకలోనే ఇంకి పోతుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 13 2026, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఎడారిలో కలిసిపోయే నది
Image Credit : Gemini AI

ఎడారిలో కలిసిపోయే నది

హిమాచల్ ప్రదేశ్ శివాలిక్ కొండల్లో పుట్టి, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ఎడారి సరిహద్దుల వైపు సాగే ప్రవాహమే ఘగ్గర్-హక్రా నది. భారత భూభాగంలో ఉన్నప్పుడు దీన్ని ఘగ్గర్ నది అని, సరిహద్దు దాటాక పాకిస్తాన్‌లో హక్రా అని పిలుస్తారు. అయితే ఈ నది ఎప్పుడుపడితే అప్పుడు కనిపించదు. ఈ నది ప్రవహించే ప్రాంతాన్ని వేసవిలో చూస్తే ఒట్టి ఎడారి నేలలా కనిపిస్తుంది. వర్షాకాలం రాగానే ఉగ్రరూపం దాల్చి కనువిందు చేస్తుంది. ఏ సముద్రంలోనూ కలవకుండా, థార్ ఎడారి ఇసుక తిన్నెల్లో ఇంకిపోయి అదృశ్యమవడం ఈ నదికి ఉన్న ఒక విచిత్రమైన భౌగోళిక లక్షణం. వర్షపు చినుకులు తాకగానే ప్రాణం పోసుకుని, ఆ వెంటనే భూమి గర్భంలో మాయమైపోయే ఈ నదీ మార్గం ఎందరో పరిశోధకులను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇదేనా సరస్వతి నది?
Image Credit : Gemini AI

ఇదేనా సరస్వతి నది?

భారతీయ సంస్కృతిలో పూజలందుకునే పౌరాణిక సరస్వతి నది ఈ ఘగ్గర్-హక్రా రూపంలోనే ప్రవహిస్తుందని అంటారు. ఋగ్వేదంలో కీర్తించిన పవిత్ర సరస్వతి నది ఒకప్పుడు సముద్రం వరకు ఉరకలెత్తుతూ ప్రవహించిందని, కాలక్రమంలో భూగర్భ మార్పులు, భూకంపాల వల్ల దానికి నీటినందించే ఉపనదులు మార్గం మళ్లడంతో క్రమంగా ఎండిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతారు. ఇస్రో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా రాజస్థాన్ ఇసుక పొరల కింద ప్రాచీన జల ప్రవాహ మార్గాలు ఉన్నాయని చెప్పాయి. పురాణాల్లో వర్ణించిన వేద సంస్కృతి మూలాలు ఈ నదీ తీరంతోనే ఉన్నాయనడానికి బలమైన ఆధారాలు కూడా కనిపించాయి.

33
సింధులోయ నాగరికతకు ఆధారం
Image Credit : Pixabay

సింధులోయ నాగరికతకు ఆధారం

సింధు లోయ నాగరికత వికాసానికి ఘగ్గర్-హక్రా నదీ తీరం ఒకప్పుడు చాలా ప్రధాన కేంద్రం అని చెబుతారు. హర్యానాలోని రాఖీగఢీ, బనవాలి, రాజస్థాన్‌లోని కాళిబంగన్ లాంటి ప్రాచీన నగరాలు ఈ నదీ ఒడ్డునే వర్ధిల్లాయి. వాస్తవానికి సింధు కంటే ఈ నది వెంబడే వందలాది నాగరికతా కేంద్రాలు బయటపడినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. కాలం తెచ్చిన భౌగోళిక విపత్తులు నదిని ఎండబెట్టడంతో, తాగునీరు కరువై ఒకనాటి పెద్ద నగరాలు మట్టిలో కలసిపోయాయి. ఇప్పుడు వర్షాకాలంలో మాత్రమే కనిపించే ఈ నది వేల ఏళ్ల మానవ చరిత్రను గుర్తు చేస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC: పద్మనాభస్వామి నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే సౌత్ టెంపుల్ టూర్
Recommended image2
ఉద్యోగం వదిలేసి పీతల వ్యాపారంతో రోజుకు రూ.14 లక్షలు సంపాదిస్తున్న యువతి
Recommended image3
Mushrooms : ఏంటీ..కిలో మష్రూమ్స్ రూ.60 లక్షలా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు
Related Stories
Recommended image1
అక్బర్ చక్రవర్తికి ఎన్ని వేల ఎకరాల భూమి ఉండేదో తెలుసా? ఇప్పుడు ఆ భూమి ఎవరి దగ్గర ఉంది?
Recommended image2
Soft Chapati: పెనంపై చపాతీలు పొంగేలా రావాలంటే ముందుగా చేయాలసిన పని ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved