ఇదొక్కటి చేస్తే చాలు..రోజంతా ఫ్రెష్ గా ఉంటారు..అసలు చెమటే రాదు
life May 25 2026
Author: Nandini Arava Image Credits:Asianet News
Telugu
యాంటీ-బ్యాక్టీరియల్ సబ్బు వాడండి
వాస్తవం చెప్పాలంటే చెమటకు వాసన ఉండదు. చర్మంపై ఉండే బ్యాక్టీరియా వల్లే వాసన వస్తుంది. అందుకే స్నానం చేసేటప్పుడు యాంటీ-బ్యాక్టీరియల్ సబ్బు లేదా బాడీ వాష్ వాడటం మంచిది.
Image credits: Asianet News
Telugu
సరైన దుస్తులు ఎంచుకోండి
సింథటిక్ బట్టలకు బదులుగా కాటన్ లేదా లినెన్ దుస్తులు ధరించండి. ఇవి చెమటను పీల్చుకుని, వాసన రాకుండా చేసి ఫ్రెష్‍గా ఉండేలా చేస్తుంది.
Image credits: Getty
Telugu
సరైన డియోడరెంట్ వాడాలి
కేవలం సెంట్ వాడితే సరిపోదు. చెమట రాకుండా చేసే యాంటీ-పెర్స్పిరెంట్స్ వాడటం వల్ల రోజంతా ఫ్రెష్‌గా ఉండొచ్చు. బయటకు వెళ్లాలన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Image credits: Getty
Telugu
రోజుకు రెండుసార్లు స్నానం
వేసవిలో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం అలవాటు చేసుకోండి. స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా వేపాకులు వేసుకుంటే చెమట వాసన తగ్గుతుంది.
Image credits: Asianet News
Telugu
అండర్ ఆర్మ్స్ శుభ్రత ముఖ్యం
అండర్ ఆర్మ్స్‌లో వెంట్రుకలు తొలగించడం చాలా ముఖ్యం. దీనివల్ల బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. చెమట వాసన చాలా వరకు తగ్గిపోతుంది.
Image credits: Asianet News
Telugu
ఆహారంలో మార్పులు చేసుకోండి
ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలా ఫుడ్ ఎక్కువగా తింటే చెమట వాసన పెరుగుతుంది. వీటికి బదులుగా ఎక్కువగా నీళ్లు తాగండి, ఫ్రూట్స్ తినండి.
Image credits: Asianet News
Telugu
బట్టలను శుభ్రంగా ఉతకాలి
ఒకసారి వేసుకున్న బట్టలను ఉతక్కుండా మళ్లీ వేసుకోకండి. దీనివల్ల బట్టల్లోని బ్యాక్టీరియా మళ్లీ మీ చర్మానికి చేరి దుర్వాసనకు కారణమవుతుంది.