టొమాటో జ్యూస్ మన పాణానికి ఎంత వరకు మంచిది..?
టొమాటోలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని కూరల్లోనూ, పచ్చిగానూ, జ్యూస్ గా చేసుకుని తాగుతుంటారు. అయితే ఈ టొమాటో జ్యూస్ నిజంగా మన పాణానికి మంచి చేస్తదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి కొంతమందికి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

tomato juice
సాధారణంగా ప్రతి వంటగదిలో ఏ కూరగాయ ఉన్నా లేకున్నా పక్కగా టొమాటో మాత్రం ఉంటుంది. టొమాటోలను ప్రతి కూరలో ఉపయోగిస్తారు. వీటిని పచ్చిగా, సలాడ్లు, సూప్ ల రూపంలో కూడా తీసుకుంటారు. టొమాటోలు వంటలకు మరింత టేస్ట్ ను తీసుకొస్తాయి. అయితే కొంతమంది టొమాటో జ్యూస్ లను బాగా తాగుతుంటారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి, ఎలాంటి దుష్ప్రభావాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది టొమాటో జ్యూస్ ను ఇష్టంగా తాగుతుంటారు. ఎందుంటే దీనిలో లైకోపీన్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలను తగ్గిస్తాయి. కానీ ఇది మన ఆరోగ్యాని ఎంత వరకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
టొమాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలను బలోపేతం చేసే బంధన కణజాలం, కొల్లాజెన్ ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది. ఇనుము శోషణను కూడా మెరుగుపరుస్తుంది. గాయాలను కూడా తొందరగా మాన్పుతుంది.
tomato juice
టొమాటో జ్యూస్ తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అలా అని టొమాటో జ్యూస్ ను బయట తాగడం కంటే ఇంట్లోనే తయారుచేసుకుని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే బయట ఈ జ్యూస్ లల్లో శరీరానికి హాని చేసే ఎన్నో రసాయనాలను కలిపే అవకాశం ఉంది.
నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ 2017-19 ప్రకారం.. టొమాటో ఉండే లైకోపీన్ ప్రొస్టేస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ లైకోపీన్ టొమాటోల్లోనే కాదు ద్రాక్ష, జామ, పుచ్చకాయల్లో కూడా ఉంటుంది. మొత్తంగా టొమాటో జ్యూస్ ను తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ప్రోస్టేట్ ఆరోగ్యంగం మెరుగుపడుతుంది.
టొమాటో జ్యూస్ లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 200 గ్రాముల టొమాటో రసంలో 630 మి.గ్రా సోడియం కంటెంట్ ఉంటుంది. అంటే దీనిలో సురక్షితమైన స్థాయి కంటే ఎక్కువగా ఉంటుందన్న మాట. దీనివల్ల రక్తపోటు పెరిగిపోయే ప్రమాదం ఉంది.
టొమాటో జ్యూస్ ఎప్పుడన్నా ఒకసారి తాగితే ఎలాంటి ప్రమాదం లేదు కానీ.. అదెపనిగా రోజూ తాగితే మాత్రం యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే ప్రమాదం పెరగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే రెగ్యులర్ గా తాగడం వల్ల గుండెల్లో మంట కలుగుతుంది. అందుకే టొమాటో జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగడం సేఫ్ కాదు.